చినుకు కురిసే వేళ.. ఈ స్నాక్స్‌తో బరువు అదుపులో! - healthy tasty snacks for this monsoon in telugu
close
Updated : 27/07/2021 19:25 IST

చినుకు కురిసే వేళ.. ఈ స్నాక్స్‌తో బరువు అదుపులో!

బయట వర్షం పడుతుంటే.. వేడివేడి సమోసా, పకోడీ, మిర్చీ-బజ్జీ.. వీటిపైకే మనసు లాగుతుంటుంది. నూనె, క్యాలరీలు ఎక్కువగా నిండి ఉండే ఈ స్నాక్స్‌ ఆరోగ్యంగా ఉన్న వారికే కాదు.. బరువు అదుపులో ఉంచుకోవాలనుకునే వారికీ మంచివి కావు. పైగా ఈ కాలంలో జీర్ణవ్యవస్థ వేగం మందగిస్తుంది కాబట్టి.. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోయినా అజీర్తి, గ్యాస్‌.. వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తప్పవు. మరి, ఈ తిప్పలన్నీ తప్పాలంటే ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను మించిన ప్రత్యామ్నాయాలు మరొకటి లేవంటున్నారు పోషకాహార నిపుణులు. అలాంటి హెల్దీ స్నాక్స్‌ని ఈ వర్షాకాలంలో భాగం చేసుకున్నామంటే అటు ఆరోగ్యంతో పాటు ఇటు బరువూ అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు.

పండ్లే.. కానీ ఇలా!

బయట వర్షం పడుతుంటే.. పండ్లు తినడమేంటి అని చెప్పిన వాళ్ల వైపు ఎగాదిగా చూస్తాం.. కానీ ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే సీజనల్‌ పండ్లను మించినవి మరొకటి లేదంటున్నారు నిపుణులు. అయితే వాటినీ వేడివేడిగా తీసుకోవచ్చంటున్నారు. ఇందుకోసం.. మీకు నచ్చిన పండ్లు తీసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్‌ చేసుకోవాలి. వాటిపై కాస్త ఉప్పు-కారం చల్లుకొని, నిమ్మరసం పిండుకొని గ్రిల్‌ చేసుకోవాలి. గ్రిల్‌ ఆప్షన్‌ లేని వారు క్యాస్టర్‌ ఐరన్‌ కడాయిలో వేపుకోవచ్చు. ఇక వీటిని వేడివేడిగా తిన్నామంటే అటు తియ్యతియ్యగా.. ఇటు వగరుగా భలే రుచిగా ఉంటాయి.. పైగా ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా! ఇలా పండ్లకు బదులు మీకు నచ్చిన కాయగూరల్ని సైతం ఇలా గ్రిల్‌ చేసుకొని లాగించేయచ్చు.

‘కార్న్‌’పై అపోహలు వద్దే వద్దు!

వర్షాకాలంలో ఎక్కువగా నోరూరించే మరో స్నాక్‌ ఐటమ్‌ స్వీట్‌కార్న్‌. అయితే వీటిలో చక్కెర ఎక్కువ మోతాదులో ఉంటుంది.. బరువు తగ్గాలనుకునే వారికి ఇది సరైన స్నాక్‌ కానే కాదు.. అన్న భ్రమలో ఉంటారు కొంతమంది. అయితే ఇలాంటి అపోహల్ని వీడమంటున్నారు నిపుణులు. శరీరానికి కావాల్సిన పోషకాలెన్నో నిండి ఉండే మొక్కజొన్న పొత్తుల్ని తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి అందడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయులు కూడా అదుపులో ఉంటాయట! అందుకే వీటిని ఉడికించి లేదంటే సన్నని సెగపై కాల్చుకొని తీసుకోవడం మంచిదంటున్నారు.

పాప్‌కార్న్‌.. తనివి తీరేలా!

ఇది ఎంత తిన్నా తనివే తీరదు. అందుకే ఈ వర్షాకాలంలో మీకు నచ్చినంత తినమంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిని ఎక్కువగా తీసుకున్నా క్యాలరీల సంఖ్య అదుపులోనే ఉంటుందట! అది కూడా ఏ ఫ్లేవర్‌ కలపని, నూనె లేకుండా తయారుచేసిన పాప్‌కార్న్‌ అయితేనే మంచిదట! తద్వారా ఫైబర్‌, ప్రొటీన్లు ఎక్కువగా శరీరానికి అందుతాయి. ఈ పీచు గుండె జబ్బులు, డయాబెటిస్‌, పలు రకాల క్యాన్సర్లు.. వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది.. అలాగే ప్రొటీన్‌ శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఇక ఈ సాధారణ పాప్‌కార్న్‌ వల్ల బరువు పెరుగుతామన్న భయమూ అక్కర్లేదు.

ఇమ్యూనిటీ స్నాక్‌!

ఈ కరోనా కాలంలో అందరి మనసు రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపైనే ఉంది. ఈ క్రమంలో ఇమ్యూనిటీ పెంచే పదార్థాలకే ప్రాధాన్యమిస్తున్నారు. అలాంటివారు ఈ వర్షాల వేళ మరమరాలతో చేసిన చాట్‌ని స్నాక్‌గా తీసుకోమంటున్నారు నిపుణులు. మరమరాలు, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర చట్నీ, రెడ్‌ చట్నీ (ఎర్ర మిరపకాయలతో చేసిన చట్నీ).. ఇవన్నీ కొద్ది మోతాదుల్లో తీసుకొని కలుపుకుంటే మరమరాల చాట్‌ రడీ అవుతుంది. మరమరాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు.. రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేయడానికి సహకరిస్తాయి. ఇక ఇందులో అధిక మొత్తంలో ఉండే పీచు మలబద్ధకం సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇక వర్షాకాలంలో తలెత్తే దగ్గు, జలుబు, గొంతు నొప్పి.. వంటి సీజనల్‌ వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికీ ఈ స్నాక్‌ చక్కగా ఉపయోగపడుతుందట!

వేడివేడిగా ఇవి ట్రై చేయండి!

* బరువు అదుపులో ఉంచుకోవాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా.. డ్రైఫ్రూట్స్‌ని మించిన స్నాక్‌ ఐటమ్‌ లేదు. కాబట్టి జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా, వాల్‌నట్స్‌, గుమ్మడి గింజలు.. వంటివన్నీ కొద్ది మోతాదులో తీసుకొని నూనె లేకుండా వేపుకొని తీసుకోవచ్చు.

* వర్షాకాలంలో ఎక్కువగా దొరికే పచ్చి పల్లికాయను ఉడికించుకొని తీసుకోవచ్చు.. లేదంటే వేయించుకొని బెల్లంతో కలిపి తీసుకున్నా శరీరానికి ఐరన్‌ ఎక్కువ మొత్తంలో అందుతుంది.

* ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ని కూడా ఈ వర్షాకాలంలో కొంతమంది తినాలని ఇష్టపడుతుంటారు. అయితే వాటికి బదులు చిలగడదుంప, బంగాళాదుంపల్ని స్ట్రిప్స్‌లా కట్‌ చేసి ఉప్పు-కారం, చాట్‌ మసాలా చల్లి.. నూనె లేకుండా బేక్‌ చేసుకోవచ్చు.. నూనె వేసుకోవాలనుకునే వారు ఆలివ్‌ ఆయిల్‌ వాడచ్చు.. అది కూడా మోతాదులోనే!

అటు ఆరోగ్యంగా, ఇటు బరువు అదుపులో ఉండాలంటే ఈ వర్షాకాలం ఎలాంటి స్నాక్స్‌ తీసుకోవడం మంచిదో తెలుసుకున్నారు కదా! మరి, ఈ వర్షాల వేళ మీరు ఎలాంటి హెల్దీ స్నాక్స్‌ తయారుచేస్తున్నారు? ఆ విశేషాలు మాతో పంచుకోండి.. మీరిచ్చే రెసిపీలు, చిట్కాలు ఎంతోమందికి ఉపయోగపడచ్చు.

మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని