నాన్‌స్టిక్ పాత్రల్ని ఇలా వాడితే ఎక్కువ కాలం మన్నుతాయి! - here are some tips which will help your non-stick cookware last longer
close
Published : 05/07/2021 17:36 IST

నాన్‌స్టిక్ పాత్రల్ని ఇలా వాడితే ఎక్కువ కాలం మన్నుతాయి!

మహిళలు వంటింట్లో ఎక్కువ కష్టపడకుండా.. సులభంగా వంట పని పూర్తిచేసుకోవడంతో పాటు శుభ్రపరుచుకునేందుకు కూడా వీలుగా ఉండే పాత్రలు నాన్‌స్టిక్ కుక్‌వేర్. అందుకే వంటింటి మహారాణులంతా నాన్‌స్టిక్ కుక్‌వేర్‌ని ఎంతగానో ఆదరిస్తున్నారు. అయితే ఈ రోజుల్లో ఆరోగ్య రీత్యా మట్టి పాత్రల వాడకం క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ నూనె ఉపయోగం తగ్గుతుందని, వేపుళ్లు రుచికరంగా ఉంటాయని.. ఇలా వివిధ కారణాలతో అనునిత్యం ఏదో ఒక విధంగా నాన్‌స్టిక్‌ పాత్రల్ని వాడుతున్నారు గృహిణులు. అయితే వీటిని మామూలు పాత్రల్లా ఇష్టం వచ్చినట్లు వాడితే వాటికి ఉన్న టెఫ్లాన్ కోటింగ్ త్వరగా పోయి, పనికి రాకుండా పోతాయి. నాన్‌స్టిక్ పాత్రల్లో ఉండే టెఫ్లాన్ కోటింగ్ స్టౌ నుంచి వచ్చే వేడిని తగ్గించి, కూరలు చక్కగా ఉడకడానికి అవసరమైన మేరకు వేడిని అందిస్తుంది.. ఫలితంగా కూర మాడిపోకుండా ఉంటుంది. అంతేకాదు.. ఈ నాన్‌స్టిక్ కుక్‌వేర్‌ వాడకం విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటిస్తే అవి ఎక్కువ కాలం మన్నుతాయి. ఇంతకీ అవేంటో తెలుసుకొని మనమూ పాటించేద్దామా..!!

* నాన్‌స్టిక్ పాత్రలు కొన్నాక మొదటిసారి ఉపయోగించేటప్పుడు వాటికి ఉన్న స్టిక్కర్స్ తొలగించాలి. నేరుగా చేత్తో లాగితే మొత్తం ఊడిరాకుండా పాత్రకు కొంత అతుక్కుపోయే అవకాశం ఉంది. అందుకే ఆ పాత్రను స్టౌ మీద పెట్టి కాస్త వేడి చేస్తే ఆ స్టిక్కర్ సులభంగా వూడి వచ్చేస్తుంది.

* ఆ తర్వాత కొద్దిగా వేడిచేసిన నీటితో పాత్రలను శుభ్రం చేసి ఆరబెట్టాలి.

* స్టౌ మీద నాన్‌స్టిక్ పాత్రలు ఉపయోగించేప్పుడు వాటిని సన్నని సెగపైనే (మంటపైనే) ఉంచాలి. లేదంటే ఎక్కువ వేడి వల్ల వాటికి ఉన్న టెఫ్లాన్ కోటింగ్ పోతుంది.

* అవసరమైనంత మేరకే నాన్‌స్టిక్ పాత్రలను ఉపయోగించుకోవాలి. ఏ వంటకాలైతే వండేటప్పుడు అంటుకునే స్వభావం కలిగి ఉంటాయో వాటిని వండటానికి మాత్రమే నాన్‌స్టిక్ పాత్రలను ఉపయోగించాలి. వేణ్నీళ్లు మరిగించడానికి... ఇతరత్రా అనవసరమైన పనులకు వీటిని ఉపయోగించడం వల్ల నాన్‌స్టిక్‌ పాత్రలు త్వరగా పాడైపోతాయి.

* నాన్‌స్టిక్ పాత్రలను ఉపయోగించి వంట చేసేటప్పుడు స్టౌ మంట సిమ్‌లో లేదంటే మీడియంలో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వంట ప్రారంభంలో.. మామూలు పాత్రల్లో వంట చేసే క్రమంలో వాటిని ముందు స్టౌ మీద పెట్టి వేడి చేసి అప్పుడు నూనె వేసి వంట ప్రారంభిస్తారు. కానీ, ఈ పాత్రలను నేరుగా పెద్ద మంట మీద అలా ఖాళీగా ఉంచకూడదు. వీటిని స్టౌ మీద పెట్టిన వెంటనే అందులో నూనె వేయడం మర్చిపోవద్దు.

* ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే.. పెద్ద మంట మీద వంట చేస్తే తొందరగా పూర్తవుతుంది.. రుచిగా కూడా ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు.. ఎంత చిన్న మంట మీద వంట చేస్తే.. అంత రుచిగా ఉంటుంది. సమయం కాస్త ఎక్కువే పట్టినా.. ఆ కాయగూరలు నెమ్మదిగా ఉడికి దాని రుచి మరింతగా పెరిగిపోతుంది. నాన్‌స్టిక్ పాత్రలను కూడా ఇదే ఉద్దేశంతోనే తయారు చేశారు. అందుకే ఎంత తక్కువ మంట మీద వాటిని ఉపయోగిస్తే.. అవి అంత ఎక్కువ కాలం మన్నుతాయి.

* వీటిలో కూరలు వండేటప్పుడు మధ్యమధ్యలో కలపడానికి స్టీల్, ఇనుము, ఇత్తడి కాకుండా చెక్కతో చేసిన గరిటెలను ఎంచుకోవడం ఉత్తమం. ఫలితంగా పాత్రలపై గీతలు పడకుండా ఎక్కువ కాలం మన్నుతాయి.

* ఈ పాత్రలను శుభ్రం చేయడానికి అధిక గాఢత గల సబ్బులు, గరుకుగా ఉండే పీచులు ఉపయోగించకూడదు. మెత్తటి పీచు లేదా బ్రష్ ఉపయోగించి వేడినీళ్లతో శుభ్రం చేయవచ్చు. ఇక ‘క్లీనింగ్ పౌడర్ వాడక తప్పదు’ అనుకుంటే లిక్విడ్ సోప్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.

* ఒకవేళ పాత్రకు ఏవైనా పదార్థాలు గట్టిగా అతుక్కొని అలాగే ఉండిపోతే వాటిని తొలగించడానికి చాకు లేదా ఇతర పదునైన వస్తువులు ఉపయోగించకూడదు. పాత్రలో నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టాలి. తర్వాత నెమ్మదిగా రుద్ది కడిగితే అవి సులభంగా తొలగిపోతాయి.

* నాన్‌స్టిక్ పాత్రలను కిచెన్ ప్లాట్‌ఫామ్ పైన, అల్మరాల్లోనూ కాకుండా సామాన్లు భద్రపరిచే స్టాండ్‌లోనే పెడితే వాటి పైభాగంలో ఉండే పెయింట్ కోటింగ్ పోకుండా ఎక్కువ కాలం ఉంటుంది.

* ఈ పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, మెత్తని పొడి వస్త్రంతో తుడిచి భద్రపరిస్తే ఎక్కువ కాలం పాటు కొత్తవిగానే కనిపిస్తాయి.

* నాన్‌స్టిక్ పాత్రలు కొన్నప్పుడు వాటితో పాటు చిన్న సూచనల పుస్తకం ఒకటి ఇస్తారు. అందులో మరిన్ని జాగ్రత్తలు, వీటిని వాడే విధానం గురించి ఉంటుంది. కాబట్టి నాన్‌స్టిక్‌ వంటపాత్రల్ని వాడే ముందు ఆ సూచనల్ని చదివితే వీటి వాడకానికి సంబంధించిన మరింత సమాచారం మీకు తెలుస్తుంది.

మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని