అవును.. మీ అభిరుచులే డబ్బు సంపాదించి పెడతాయి! - hobbies that can turn into a good career option in telugu
close
Published : 31/08/2021 17:43 IST

అవును.. మీ అభిరుచులే డబ్బు సంపాదించి పెడతాయి!

కొంతమందికి పుస్తకాలు చదవడమంటే ఇష్టముంటుంది.. మరికొంతమంది ఫొటోగ్రఫీపై ఆసక్తి చూపుతుంటారు.. ఇంకొందరు కొత్త వంటకాలు ప్రయత్నిస్తూ రిలాక్సవుతుంటారు. నిజానికి వీటన్నింటినీ మనం కేవలం అభిరుచులుగా, అలవాట్లుగానే పరిగణిస్తుంటాం. ఎప్పుడో బోర్‌ కొట్టినప్పుడు మాత్రమే వీటిపై దృష్టి పెడుతుంటాం. ఇవి కేవలం టైంపాస్‌ కోసమే అనుకుంటాం.. కానీ ప్రతికూల పరిస్థితుల్లో వీటినే కెరీర్‌గా మలచుకోవచ్చంటున్నారు నిపుణులు. అందుకే మనకుండే ఏ అలవాటూ వృథా కాదని, ఎంతో విలువైందని చెబుతున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

మీరు పుస్తకాల పురుగా?!

పుస్తకాలు చదవడమంటే కొందరికి ఎంతిష్టమంటే.. ఆ ధ్యాసలో పడిపోయి ఈ లోకాన్నే మర్చిపోతుంటారు. అది నవల కానీ, జీవిత కథ కానీ, ప్రేమకథ కానీ.. మొదలుపెట్టారంటే పూర్తయ్యే దాకా ఓ పట్టు పడుతుంటారు. మరి, మీరూ ఇలాంటి పుస్తకాల పురుగేనా? అయితే ఈ అలవాటును అందమైన కెరీర్‌గా మార్చుకోవడానికి ప్రస్తుతం బోలెడన్ని ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయంటున్నారు నిపుణులు. పుస్తకాలు చదివే వారికి ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఏ పదం ఎక్కడ వాడాలి? దాని సరైన స్పెల్లింగ్‌, వ్యాకరణ నియమాలు (Grammar Rules), పదాలను చక్కగా కూర్చడం.. వంటి అంశాలతో పాటు రాయడంలోనూ వీరు నిష్ణాతులవుతారు. ఇలాంటి వారు వెబ్‌సైట్స్‌, బ్లాగ్స్‌, పబ్లిషింగ్‌ కంపెనీలకు.. ప్రూఫ్‌ రీడర్స్‌గా, కాపీ ఎడిటర్స్‌గా పనిచేసే అవకాశం సొంతం చేసుకోవచ్చు. అలాగే పుస్తకాలు చదివి.. వాటిపై మీ అభిప్రాయాన్ని పంచుకోవడం (Book Reviews) కూడా ఓ ఉపాధి మార్గమే! అంతేకాదు.. లైబ్రేరియన్‌గా, ట్రాన్స్‌లేటర్లుగా, ఆడియోబుక్ నెరేటర్ (ఆడియో రూపంలో పుస్తకాలు చదివి వినిపించడం)గా.. ఇలా మరెన్నో కెరీర్‌ ఆప్షన్లు బుక్‌ లవర్స్‌కి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

గార్డెనింగ్‌ అంటే ఇష్టమా?

కొంతమందికి పచ్చటి ప్రకృతి మధ్య గడపడమంటే ఇష్టముంటుంది.. ఇదే అభిరుచిని గార్డెనింగ్‌గా మార్చుకొని తమ ఇంటిని గ్రీనరీగా మార్చేసుకుంటుంటారు. మరి, దాన్ని అక్కడితో ఆపకుండా చక్కటి కెరీర్‌గానూ మలచుకోవచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీరే స్వయంగా ఓ గార్డెనింగ్‌ సర్వీసెస్‌ను ప్రారంభించి.. ఇళ్లలో, హోటల్స్‌లో, పబ్లిక్‌ పార్కుల్లో మీ క్రియేటివిటీని ప్రదర్శించచ్చు. అంత పెట్టుబడి పెట్టలేమంటే ముందు కొన్నాళ్ల పాటు మంచి పేరున్న గార్డెనింగ్‌ సర్వీసెస్‌ కంపెనీలో పనిచేసి.. ఆ తర్వాత మీ సొంత స్టార్టప్‌ను ప్రారంభించచ్చు. అయితే ఈ క్రమంలో నానాటికీ గార్డెనింగ్‌లో వచ్చే మార్పులు, గార్డెనింగ్‌ ట్రెండ్స్‌.. వంటి వాటిపై అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది.

ఫొటోగ్రఫీ.. ఓ మంచి కెరీర్!

చాలామంది అమ్మాయిలు ఫొటోలు, సెల్ఫీలు దిగడానికే ఆసక్తి చూపుతుంటారు. అయితే ఇలా తమని తాము ఫొటోల్లో బంధించుకోవడం కంటే ఎదుటివారిని, చుట్టూ ఉన్న ప్రకృతిని, వన్యప్రాణుల్ని.. తమ కెమెరాతో క్లిక్‌మనిపించడానికి ఆరాటపడే వారు అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో మీరూ ఒకరా? అయితే ఆ అలవాటునే చక్కటి కెరీర్‌గా మలచుకోవచ్చు. ప్రస్తుతం ఏ అకేషన్‌ అయినా ఫొటోలు/వీడియోలు తీయించుకోవడం, ప్రత్యేకంగా ఫొటోషూట్‌ చేయించుకోవడం.. ట్రెండ్‌గా మారిపోయింది. క్యాండిడ్‌ ఫొటోగ్రఫీకి ఆదరణ పెరుగుతోంది. కాబట్టి దీని ద్వారా బోలెడంత డబ్బూ ఆర్జించచ్చు. అయితే ఇక్కడ మీరు చేయాల్సిందల్లా.. అప్‌డేట్‌ అయ్యే ఫొటోగ్రఫీ ట్రెండ్స్‌పై పట్టు సాధించడమే. ఇక దీంతో పాటు ఫొటో ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్స్‌, గ్రాఫిక్‌ సాఫ్ట్‌వేర్స్‌పై అదనపు పట్టుంటే మరీ మంచిది.

భాషేదైనా ఓ పట్టు పడతారా?

ఉద్యోగ రీత్యా, మనం ఉండే ప్రాంతంలో ఇమిడిపోవడానికి వివిధ భాషలు నేర్చుకుంటుంటాం. అయితే కొంతమందికి ఇదో అలవాటుగా ఉంటుంది. ఎన్ని భాషలు నేర్చుకున్నా.. ఇంకా ఇంకా నేర్చుకోవాలనుకుంటుంటారు. కేవలం ప్రాంతీయ/దేశీయ భాషలే కాదు.. విదేశీ భాషల పైనా పట్టు సాధించాలనుకుంటారు. ఇలాంటి వారి కోసం ‘ఫారిన్‌ లాంగ్వేజ్‌ స్పెషలిస్ట్’, ‘ట్రాన్స్లేటర్’.. వంటి ఉద్యోగావకాశాలున్నాయి. వీటితో పాటు వివిధ రాష్ట్రాలు/దేశాల్లో టూరిస్ట్‌ గైడ్స్‌గానూ పనిచేయచ్చు. అదీ కాదంటే మల్టీనేషనల్‌ కంపెనీల్లోనూ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం ఆ దేశమే వెళ్లాలని లేదు.. ఆన్‌లైన్ ద్వారా కూడా పనిచేయచ్చు. ఇలా ఒక్క భాషతో కాసులు సంపాదించచ్చు.

పర్యటనలంటే మక్కువా?

కొంతమందికి విరామం దొరికితే చాలు.. ఏదో ఒక ప్రదేశానికి చెక్కేస్తుంటారు. అక్కడి అందమైన ప్రదేశాలను చూస్తూ మైమరచిపోతుంటారు. అక్కడితో ఆగిపోకుండా వాటి గురించి బోలెడన్ని విషయాలు తెలుసుకునే దాకా ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టరు.. ఇక ఇంటికి తిరిగొచ్చాక తాము చూసిన ప్రదేశపు అందాల్ని తమ ఇంట్లో వాళ్లతో, ఫ్రెండ్స్‌తో అద్భుతంగా వర్ణిస్తుంటారు. నిజానికి ఈ వర్ణనే ట్రావెల్‌ అండ్‌ టూరిజం సంస్థల్లో పనిచేసే అద్భుతమైన అవకాశాన్ని మీ ముందుంచుతుంది. ఈ క్రమంలో ట్రావెల్‌ ఏజెంట్‌గా, టూరిజం మేనేజర్‌గా, ట్రావెల్‌ కన్సల్టంట్‌/కౌన్సెలర్‌గా, టూరిస్ట్‌ గైడ్‌గా, ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌గా.. పనిచేయచ్చు. కేవలం ప్రైవేట్‌ సంస్థల్లోనే కాదు.. మీకున్న నైపుణ్యాలతో ప్రభుత్వ టూరిజం శాఖల్లోనూ ఓ ఉద్యోగం సంపాదించారంటే బోలెడంత జీతం, జాబ్‌ సెక్యూరిటీ.. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి!

వీటితో పాటు వంటలు, డ్యాన్సింగ్‌/సింగింగ్, కళలు.. వంటి అలవాట్లను కూడా కెరీర్‌గా మార్చుకొని మీకు తిరుగులేదనిపించచ్చు. అయితే ఏ సంస్థలో పనిచేసినా, మీరు సొంతంగా వ్యాపారం ప్రారంభించినా.. స్కిల్స్‌ని మెరుగుపరచుకుంటూ, నిజాయతీగా పనిచేస్తే కెరీర్‌లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాదు.


Advertisement


మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని