మృతకణాలు పోవాలంటే... - home remedies to get rid of dead skin cells
close
Updated : 02/08/2021 20:08 IST

మృతకణాలు పోవాలంటే...

అందమైన ప్రకాశవంతమైన చర్మం కావాలని కోరుకోనివారు ఎవరైనా ఉంటారా? అయితే కొన్ని సందర్భాల్లో చర్మం ఛాయ తగ్గి జీవం కోల్పోయినట్లుగా తయారవుతుంది. దీనికి కారణం చర్మంపై మృతకణాలు పేరుకుపోవడమే. మరి వీటిని తొలగించుకోవాలంటే బ్యూటీపార్లర్‌కు వెళ్లాల్సిందేనా? ఆ అవసరమే లేదు. ఇంట్లోనే ఎప్పుడూ మనకు అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగించి ప్యాక్‌లు, స్క్రబ్‌లు తయారుచేసుకోవడం ద్వారా వీటిని సులభంగా వదిలించుకోవచ్చు. మరి, దానికోసం ఏం చేయాలో తెలుసుకుందామా..

ముఖంపై..

ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తేనే మనలోని సౌందర్యం మరింత ఇనుమడిస్తుంది. అయితే ఈ అందాన్ని కొన్ని సందర్భాల్లో చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు దెబ్బతీస్తుంటాయి. మరి వాటిని తొలగించుకోవాలంటే ఈ ప్యాక్‌లు ప్రయత్నించి చూడండి..

* సమాన పాళ్లలో చందనం, బియ్యప్పిండి, శెనగపిండి తీసుకోవాలి. దీనికి కొద్దిగా పాలు, రోజ్‌వాటర్ కలిపి చిక్కగా ఉండే మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్త్లె చేసి ఇరవై నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత మృదువుగా చర్మాన్ని రుద్దుతూ ప్యాక్‌ని తొలగించి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

* పది బాదం గింజల్ని తీసుకొని పాలల్లో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం తొక్క తీసి గింజలను మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు పూర్తిగా పేస్ట్‌గా మారిపోకుండా కాస్త బరకగా ఉండేలా జాగ్రత్తపడాలి. దీనికి రెండు టీస్పూన్ల తేనె కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకు అప్త్లె చేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది.

* నారింజ తొక్కల పొడి, పెరుగు సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లాగా వేసుకొని 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత చేతివేళ్లను కొద్దిగా తడిచేసుకొని గుండ్రంగా, మృదువుగా రుద్దుకొంటే చర్మంపై పేరుకొన్న మృతకణాలు వదిలిపోతాయి.

మొత్తం శరీరానికి..

పంచదారతో తయారుచేసిన స్క్రబ్‌ని ఉపయోగించి చర్మంపై చేరిన మృతకణాలను సులభంగా తొలగించుకోవచ్చు. దీనికోసం అరకప్పు చక్కెరలో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె, అంతే పరిమాణంలో తేనె, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మిశ్రమంగా చేయాలి. దీన్ని చర్మానికి రాసుకొని మృదువుగా మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే సరిపోతుంది. ఇలా వారానికి రెండు సార్లు ఉపయోగిస్తే చర్మంపై పేరుకున్న మృతకణాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవచ్చు. అయితే ఈ మిశ్రమాన్ని తయారుచేయడానికి ఉపయోగించే పంచదార చాలా సన్నగా ఉండేలా చూసుకోవాలి.

పెదవులకు..

కొన్ని సందర్భాల్లో గులాబీ రంగులో ఉండే పెదవులు సైతం నల్లగా, పగిలిపోయినట్లుగా తయారవుతాయి. దీనికి కారణం కూడా మృతకణాలే. దానిమ్మ గింజలను ఉపయోగించడం ద్వారా పెదవులను తిరిగి మామూలుగా అయ్యేలా చేసుకోవచ్చు. దీనికోసం కొన్ని దానిమ్మ గింజలను తీసుకొని మెత్తగా చేసుకోవాలి. దీనికి కొంచెం మిల్క్‌క్రీంను కలిపి పెదవులకు రాసుకొని మృదువుగా మర్దన చేసుకొంటే మృతకణాలు తొలగిపోతాయి.

కొన్ని దానిమ్మ గింజలను తీసుకొని పంచదార, కొద్దిగా ఆలివ్ నూనెతో మిశ్రమంగా చేసి పెదవులను మర్దన చేసుకోవడం ద్వారా కూడా పెదవులపై చేరిన మృతకణాలను తొలగించవచ్చు.

ఈ చిట్కాలను పాటించిన అనంతరం చల్లటి నీటితో పెదవులను శుభ్రం చేసి ఆరిన తర్వాత లిప్‌బామ్ రాసుకోవాలి.

పాదాల విషయంలో ఇలా..

పాదాలపై సైతం మృతకణాలు పేరుకుపోవడం వల్ల మృదుత్వాన్ని కోల్పోయి నిర్జీవంగా తయారవుతాయి. అయితే కాస్త సమయం కేటాయిస్తే పాదాలను తిరిగి మృదువుగా తయారుచేసుకోవచ్చు. దీనికోసం ముందుగా సోప్ కలిపిన గోరువెచ్చని నీళ్లలో పాదాలను ఉంచాలి. ఇలా అరగంట ఉంచిన తర్వాత అరచెక్క నిమ్మరసంలో రెండు టేబుల్ స్పూన్ల చొప్పున ఆలివ్ ఆయిల్, బ్రౌన్ షుగర్ కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దీనితో పాదాలను పావుగంట పాటు మృదువుగా మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత నీటితో కడిగి పొడిగా తుడుచుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. స్క్రబ్ చేసుకోవడానికి ఉపయోగించిన మిశ్రమం పాదాలపై చేరిన మృతకణాలు, మురికిని తొలగించడంతో పాటు తేమను అందిస్తుంది. ఈ పద్ధతిని వారానికోసారి పాటించడం ద్వారా పాదాలు అందంగా ఉంచుకోవచ్చు.

చేతులు..

కొందరిలో ముఖం ప్రకాశవంతంగానే ఉన్నా.. చేతులు మాత్రం జీవం కోల్పోయినట్లుగా తయారవుతాయి. దీనికోసం ఉప్పుతో తయారుచేసిన స్క్రబ్‌ని ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కొద్దిగా ఉప్పులో లావెండర్ నూనె లేదా స్వీట్ ఆల్మండ్ నూనెను కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. ముందుగా చేతులను నీటితో శుభ్రం చేసుకొని ఈ మిశ్రమాన్ని ప్యాక్‌లాగా వేసుకోవాలి. ఆ తర్వాత మృదువుగా రుద్దుతూ ప్యాక్‌ని తొలగించుకోవాలి. ఈ చిట్కాను అప్పుడప్పుడూ పాటించడం ద్వారా చేతులపై చేరిన మృతకణాలు, మురికి వంటి వాటిని తొలగించుకోవచ్చు.

మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని