జిడ్డు, ట్యానింగ్, చెమటకాయలు... పరిష్కారమిదిగో! - home remedies to get rid of prickly heat in summer
close
Published : 05/07/2021 15:42 IST

జిడ్డు, ట్యానింగ్, చెమటకాయలు... పరిష్కారమిదిగో!

ఓ పక్క కరోనాకు తోడు వేడితో సెగలు పుట్టించేస్తున్నాడు సూర్యుడు. విపరీతమైన చెమట, ఉక్కపోతతో అల్లాడిపోవాల్సి వస్తోంది. ఈ సమయంలో అంతా ఎక్కువగా ఎదుర్కొనే సమస్యల్లో చెమటకాయలు కూడా ఒకటి. దీంతో పాటు అధిక చెమట, చర్మం జిడ్డుగా మారడం, ట్యానింగ్, సన్‌బర్న్.. వంటివి కూడా ఈ రోజుల్లో సర్వసాధారణంగా ఎదురయ్యే సమస్యల్లో కొన్ని. వీటి నుంచి సత్వరమే పరిష్కారం పొందాలంటే అందుకు కొన్ని సహజసిద్ధమైన మార్గాలను అనుసరించాల్సిందే.. ఇంతకీ ఆ మార్గాలేంటి? అందుకు ఉపయోగించాల్సిన పదార్థాలేంటి? తెలియాలంటే ఇది చదవాల్సిందే..

వేసవిలో విపరీతమైన చెమట, డీహైడ్రేషన్.. ఈ సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటి కారణంగానే వేసవిలో చెమటకాయలు ఎక్కువగా బాధిస్తుంటాయి. వాటితో పాటు ట్యాన్, సన్‌బర్న్.. వంటి సమస్యలు కూడా తోడవడంతో సౌందర్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ముఖం, మెడ, వీపు వెనుకభాగం, చేతులు.. మొదలైన ప్రాంతాల్లో ఈ సమస్యలు తలెత్తితే ఇబ్బంది ఇంకాస్త ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే వాటి నుంచి విముక్తి పొందేందుకు చాలామంది మార్కెట్లో లభ్యమయ్యే రసాయనాలు కలిగిన రకరకాల ఉత్పత్తులను ఆశ్రయిస్తూ ఉంటారు. వాటికి బదులుగా కొన్ని సహజసిద్ధమైన చిట్కాలు అనుసరించడం ద్వారా కూడా సులభంగా ఉపశమనం పొందచ్చు.

ఓట్‌మీల్స్‌తో..

స్నానం చేసే నీటిలో ఓట్స్ కలుపుకోవడం ద్వారా వేసవిలో ఎదురయ్యే చర్మ సంబంధిత సమస్యల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. ఓట్స్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడం ద్వారా మూసుకుపోయిన స్వేదగ్రంధులు తెరచుకునేలా చేస్తాయి. తద్వారా చెమటకాయలు తగ్గడంతో పాటు వాటి వల్ల కలిగే దురద, మంట.. వంటివి కూడా తగ్గుముఖం పడతాయి. ఈ ఫలితం పొందడానికి స్నానం చేయడానికి కాసేపటి ముందు గోరువెచ్చని నీటిలో రెండు లేదా మూడు కప్పుల ఓట్స్ వేసి కాసేపు నాననివ్వాలి. బాత్‌టబ్‌లో స్నానం చేసేటప్పుడు ఈ చిట్కాను అనుసరిస్తే మరింత మెరుగైన ఫలితం పొందచ్చు.

ఐస్‌క్యూబ్స్‌తో..

వేసవిలో ఎదురయ్యే సమస్యల్లో చెమటకాయలు, వాటి వల్ల వచ్చే దురద, మంట.. చాలా ముఖ్యమైనవి. వాటి నుంచి విముక్తి పొందడానికి ఇంట్లో లభ్యమయ్యే ఐస్‌క్యూబ్స్‌ని ఉపయోగిస్తే చాలు.. కాటన్ లేదా మెత్తని వస్త్రంలో కొన్ని ఐస్‌క్యూబ్స్ వేయాలి. దానిని మూటలా కట్టి దాంతో సమస్య ఉన్న ప్రదేశంలో మృదువుగా అద్దుకోవాలి. తరచూ ఇలా చేయడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.

ముల్తానీమట్టితో..

సూర్యరశ్మి కారణంగా సన్‌బర్న్, ట్యాన్.. వంటి సమస్యలు తలెత్తడం సహజం. వాటి నుంచి విముక్తి పొందేందుకు ముల్తానీ మట్టి చక్కగా ఉపయోగపడుతుంది. దీని కోసం రెండు చెంచాల ముల్తానీమట్టిలో సరిపడా రోజ్‌వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. సమస్య ఉన్న ప్రదేశంలో ఈ మిశ్రమాన్ని ప్యాక్‌లా అప్త్లె చేసి పూర్తిగా ఆరేంత వరకు వేచి ఉండాలి. ఆ తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకోసారి చొప్పున వారం రోజుల పాటు క్రమం తప్పకుండా చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఆసక్తి ఉన్నవారు ముల్తానీమట్టికి బదులుగా చందనం లేదా గంధం కూడా ఉపయోగించవచ్చు.

కీరాదోసతో..

వేసవిలో మనకి ఇటు అందంపరంగా, అటు ఆరోగ్యపరంగా అధిక ప్రయోజనాలు అందించే వాటిలో కీరాదోస ఒకటి. దానిని ముక్కలుగా కోసి సమస్య ఉన్న ప్రాంతంలో వాటితో రుద్దడం.. లేదా కీరాదోసను మెత్తని గుజ్జులా చేసి సన్‌బర్న్, ట్యాన్, చెమటకాయలు.. మొదలైనవి ఉన్న ప్రాంతంలో దానిని అప్త్లె చేసుకోవాలి. ఆ తర్వాత 15 నుంచి 20 నిమిషాలు ఆరనిచ్చి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా సమస్య తగ్గుముఖం పట్టేలా చేయచ్చు. అలాగే దీనిని ఉపయోగించడం ద్వారా చర్మానికి సహజసిద్ధంగా చల్లదనం లభిస్తుంది.

కలబందతో..

సమస్య ఉన్న ప్రాంతంలో కలబంద గుజ్జుని నేరుగా అప్త్లె చేసి 15 నుంచి 20 నిమిషాలపాటు ఆరనివ్వాలి. తర్వాత రోజ్‌వాటర్ సహాయంతో చేతివేళ్లతో మృదువుగా కాసేపు రుద్దుకోవాలి. అనంతరం చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకి రెండుసార్లు చొప్పున వారం రోజుల పాటు క్రమం తప్పకుండా చేయడం ద్వారా చెమటకాయలు, సన్‌బర్న్.. వంటివి సునాయాసంగా తగ్గుముఖం పడతాయి. అలాగే ట్యానింగ్ సమస్య నుంచి కూడా విముక్తి లభిస్తుంది.

టీ ట్రీ ఆయిల్‌తో..

వేసవిలో తలెత్తే చర్మసంబంధిత సమస్యలు తగ్గుముఖం పట్టేందుకు సమర్థంగా ఉపకరించే వాటిలో టీ ట్రీ ఆయిల్ కూడా ఒకటి. చెమటకాయలు ఎక్కువగా వచ్చి ఎర్రగా మారినప్పుడు, మంట, దురద వంటివి అధికంగా ఉన్నప్పుడు టీ ట్రీ ఆయిల్‌లో ముంచిన దూదితో వాటిపై మృదువుగా అద్దుకోవడం వల్ల కాస్త ఉపశమనం లభించే అవకాశాలుంటాయి. అలాగే దీనిని ఉపయోగించడం ద్వారా సన్‌బర్న్, ట్యానింగ్.. వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందచ్చు.

 

ఈ ప్యాక్‌లు కూడా..

* సమస్య ఉన్న ప్రాంతంలో తేనె రాసి కాసేపు ఆరనిచ్చి శుభ్రం చేసుకోవాలి.

* గుప్పెడు వేపాకులు తీసుకొని తగినన్ని నీళ్లు జతచేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రాంతంలో అప్త్లె చేసి కాసేపు ఆరనిచ్చి చల్లని నీటితో శుభ్రం చేయాలి.

* రోజ్‌వాటర్‌లో ముంచిన దూదితో సమస్య ఉన్న ప్రాంతంలో రోజుకి 2 లేదా 3సార్లు మృదువుగా రుద్దుకోవాలి.

* పుచ్చకాయ గుజ్జు లేదా రసాన్ని సమస్య ఉన్న ప్రాంతంలో అప్త్లె చేసి కాసేపు ఆరనిచ్చి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

* కర్పూరాన్ని పౌడర్‌గా చేసి అందులో కాస్త వేపనూనె వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రాంతంలో అప్త్లె చేసి 3 నుంచి 5 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత కడిగేసుకోవాలి.

ఈ చిట్కాలన్నీ వేసవిలో ఎదురయ్యే చర్మ సంబంధిత సమస్యలకు సులభంగా చెక్ పెట్టడమే కాదు.. చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉండేలానూ చేస్తాయి. ఎండాకాలంలో ఈ చిట్కాలు పాటించడంతో పాటు వీలైనంత ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగడం ద్వారా డీహైడ్రేషన్ సమస్య నుంచి కూడా విముక్తి పొందచ్చు. చర్మం తాజాగా, ఆరోగ్యంగా మెరిసేలా చేయచ్చు. ఏమంటారు??

మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని