లేలేత అధరాల కోసం ఇలా చేయండి! - home remedies to get soft lips
close
Published : 11/08/2021 20:02 IST

లేలేత అధరాల కోసం ఇలా చేయండి!

ముఖసౌందర్యాన్ని పెంపొందించడంలో అధరాలు సైతం ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే కొంతమంది అమ్మాయిల పెదవులు పొడిబారినట్లు నిర్జీవంగా కనిపిస్తాయి. ఫలితంగా అవి వారి అందాన్ని తగ్గించి చూపిస్తాయి. మరి, పొడిబారి, నిర్జీవంగా మారిన పెదవులను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలంటే ఏం చేయాలి? అదెలాగో మీకు మేం చెబుతాం. ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలను ఉపయోగించి పొడిబారిన అధరాలను మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చే కొన్ని చిట్కాలు మీకోసం..

తేమ నిలిచేలా..

చెంచా తేనె, అరచెంచా దానిమ్మ రసం తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు అప్త్లె చేసుకొని 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకొని వెంటనే లిప్ బామ్ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల అధరాల్లోని తేమ ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది. అయితే ఈ చిట్కా కోసం అందుబాటులో ఉన్న తేనె వినియోగించినా సరిపోతుంది. ఎందుకంటే పొడిబారిన అధరాలను సాధారణ స్థితికి తీసుకురావడంలో అదే ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే దానిమ్మ రసం వల్ల పెదవులు సహజసిద్ధమైన గులాబీ రంగులో మెరుస్తూ కనిపిస్తాయి.

రంగు మారడానికి..

కొంతమంది పెదవులు చాలా డార్క్ కలర్‌లో ఉంటాయి. అటువంటివారు నిమ్మరసం, తేనె చెంచా చొప్పున తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు అప్త్లె చేసి పూర్తిగా ఆరనివ్వాలి. తర్వాత తడిగా ఉన్న వస్త్రంతో తుడిచేసుకోవాలి. అనంతరం పెదాలకు పెట్రోలియం జెల్లీ లేదా లిప్‌బామ్ రాసుకోవాలి. ఈ చిట్కాను క్రమం తప్పకుండా పాటించడం వల్ల అధరాల రంగులో కచ్చితంగా మార్పు కనిపిస్తుంది. దీంతో ముదురు వర్ణంలో ఉన్న పెదాలు లేలేత గులాబీ రంగులోకి మారడం గమనించవచ్చు.

స్క్రబ్ చేయాలి..

పొడిబారిన పెదవుల చర్మంలో మృతకణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నిర్జీవంగా మారిన కణాలతోపాటు వాటిని కూడా తొలగించాలి. అప్పుడే అవి తిరిగి సాధారణ స్థితికి వస్తాయి. ఇందుకోసం పెదవులను స్క్రబ్బింగ్ చేయాల్సి ఉంటుంది.
చక్కెర, తేనె, ఆలివ్ ఆయిల్, పెట్రోలియం జెల్లీ.. వంటివి చెంచా చొప్పున తీసుకోవాలి. మొదట ఒక బౌల్‌లో తేనె, పంచదార బాగా కలుపుకొని అందులో ఆలివ్ నూనె కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత పెట్రోలియం జెల్లీ కూడా జత చేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కావాలనుకుంటే వారం రోజుల పాటు నిల్వ కూడా చేసుకోవచ్చు.

ఈ మిశ్రమం కొద్దిగా తీసుకొని దాంతో పెదవులపై మృదువుగా మర్దన చేసుకోవాలి. కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని వెంటనే లిప్‌బామ్ రాసుకోవాలి. ఫలితంగా నిర్జీవమైన పెదాలు మృదువుగా తయారవుతాయి. అలాగే ఈ ప్రక్రియను వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా చేయడం వల్ల తక్కువ సమయంలోనే గులాబీ రేకల్లాంటి అధరాలు సొంతం చేసుకోవచ్చు.

ఇలా కూడా..

* విటమిన్ 'ఇ' నూనెతో పెదవులకు మృదువుగా మర్దన చేసుకోవాలి.

* టూత్‌బ్రష్‌ని ఉపయోగించి పెదవుల చర్మంపై పేరుకొన్న మృతకణాలను ఎప్పటికప్పుడు నెమ్మదిగా తొలగించుకోవాలి.

* అధరాలకు పోషణ అందించే సహజసిద్ధమైన లిప్ మాస్క్‌లు, లిప్ బామ్‌లు ఉపయోగించడం మంచిది.

* మృతకణాలను తొలగిస్తూ పెదవులకు తగిన పోషణ అందించే స్క్రబ్స్ వినియోగించడం.. వంటి చిట్కాలు పాటిస్తూ కూడా పొడిబారి నిర్జీవంగా మారిన అధరాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చు. అలాగే ముదురు వర్ణంలోని పెదవులను తిరిగి లేలేత గులాబీ రంగులోకి మార్చవచ్చు.


Advertisement


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని