హెర్బల్ బ్లీచ్ ఇంట్లోనే ఇలా...! - homemade bleach in telugu
close
Updated : 25/09/2021 16:54 IST

హెర్బల్ బ్లీచ్ ఇంట్లోనే ఇలా...!

ఫేషియల్ బ్లీచ్ అనగానే అందరి చూపూ బ్యూటీ పార్లర్లవైపే ఉంటుంది. కానీ, కాస్త ఓపిక వహిస్తే ఇంట్లోనే సులభంగా బ్లీచ్ తయారు చేసుకోవచ్చు. ఇదేదో బాగుందే! ఎలా సాధ్యం అనుకుంటున్నారా! అదెలాగో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే మరి!!

కావాల్సినవి

పుల్లటి పెరుగు - పావుకప్పు

పసుపు - పావు టీస్పూన్

చందనం పౌడర్ - పావు టీస్పూన్

నిమ్మరసం - ఒక స్పూన్

తేనె - 2 టీస్పూన్లు

నిమ్మతొక్కల పొడి - పావు టీస్పూన్

నారింజ తొక్కల పొడి - పావు టీస్పూన్

బ్లీచ్ వేసుకునే విధానం

పైన చెప్పినవన్నీ ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. ముఖాన్ని శుభ్రపరుచుకుని తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా అప్లై చేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత మర్దన చేస్తూ శుభ్రపరుచుకోవాలి. దీన్ని వారానికి ఒకసారి వేసుకోవచ్చు. సున్నిత చర్మతత్వం ఉన్న వారు తప్ప ఎవరైనా ఈ హెర్బల్ బ్లీచ్‌ను వాడి ప్రయోజనం పొందొచ్చు.మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని