తలస్నానం ఎప్పుడు చేయాలో తెలుసా..! - how often you should wash your hair
close
Updated : 24/06/2021 20:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తలస్నానం ఎప్పుడు చేయాలో తెలుసా..!

సిల్కీ హెయిర్‌ అయినా, ఉంగరాల జుట్టైనా, అలల్లాంటి ముంగురులైనా.. ఇలా ఎలాంటి జుట్టున్న వారైనా సరే.. తలస్నానం చేసే విషయంలో అందరూ ఒకే పద్ధతిని అనుసరిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు రెండు, మూడు రోజులకోసారి తలస్నానం చేస్తే.. మరికొందరు వారానికోసారి మాత్రమే తలస్నానం చేస్తుంటారు. కానీ.. జుట్టు రకాన్ని బట్టి తలస్నానం చేసే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా కుదుళ్లు బలహీనపడడం, జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం.. వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చని వారు సూచిస్తున్నారు. మరి, జుట్టు రకాన్ని బట్టి తలస్నానం చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రండి.. తెలుసుకుందాం..

సెమీ కర్లీ హెయిర్‌

సెమీ కర్లీ హెయిర్‌ ఉన్న వారు వారంలో రెండు లేదా మూడుసార్లు తలస్నానం చేయాలంటున్నారు సౌందర్య నిపుణులు. ఒకవేళ మీ జుట్టు బాగా ఒత్తుగా ఉన్నట్లయితే వారానికి రెండుసార్లు చేసినా సరిపోతుంది. అయితే ఈ క్రమంలో నూనె ఆధారిత షాంపూలను ఎంచుకోకపోవడమే మంచిది. ఎందుకంటే వీటి వల్ల జుట్టు సహజమైన కర్లీనెస్‌ని కోల్పోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి గాఢత తక్కువగా ఉండే షాంపూలను ఎంచుకుంటే జుట్టుకు ఎలాంటి డ్యామేజ్‌ జరగదు.

కర్లీ హెయిర్‌..

కర్లీ హెయిర్‌.. ఇలాంటి జుట్టు కావాలని ప్రతి ఒక్క అమ్మాయీ కోరుకుంటుంది. అందుకు కారణాలూ లేకపోలేదు.. కర్లీ హెయిర్‌ ఉంటే జుట్టు కాస్త పలుచగా ఉన్నప్పటికీ.. ఒత్తుగా ఉన్నట్లు కనిపిస్తుంది. అంతేకాదు.. ఇలాంటి కురులు అలల్లా ఎగురుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఉంగరాల జుట్టున్న వారికి ఎదురయ్యే సమస్యల్లా.. జుట్టు త్వరగా పొడిబారిపోవడమే. కాబట్టి గాఢత తక్కువగా ఉండే షాంపూతో వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తలస్నానం చేయడం మంచిది. అలాగే కురులు తేమను కోల్పోకుండా పట్టులా ఉండాలంటే తలస్నానం చేసే గంట లేదా రెండు గంటల ముందు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు నూనెతో మసాజ్ చేసుకోవాలి.

పొడి జుట్టా?

పొడిబారిన జుట్టు ఉన్న వారి సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి జుట్టున్న వారు తమ కేశాలకు రంగు వేసుకున్నా, హెయిర్ డ్రయర్స్‌ వాడినా జుట్టు గడ్డిలా మారడం, కుదుళ్లలో దురద, అలర్జీలు రావడం.. వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేనా.. జుట్టు చివర్లు చిట్లడం, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు నిర్జీవమైపోవడం.. వంటి సమస్యలూ ఎదురవుతుంటాయి. అయితే ఈ సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టాలంటే సహజమైన షాంపూలను ఎంచుకోక తప్పదు. వీటిలో హానికారక రసాయనాలు ఉండవు కాబట్టి జుట్టుకు ఎలాంటి డ్యామేజ్‌ అయ్యే అవకాశమే ఉండదు. అలాగే పొడి జుట్టు ఉన్న వారు వారానికి రెండు సార్లు తలస్నానం చేయడం, ఈ క్రమంలో బాగా వేడిగా ఉండే నీళ్లు కాకుండా గోరువెచ్చటి నీళ్లను ఎంచుకోవడం.. వంటివి చేయాలి. అలాగే నీళ్లు ఎక్కువగా తాగడం, నీటి శాతం అధికంగా ఉండే పండ్లు-కాయగూరల్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా కొంత వరకు ఫలితం ఉంటుంది.

ఆయిలీ హెయిర్‌..

కుదుళ్లలో ఉండే నూనె గ్రంథులు అధికంగా నూనెలను ఉత్పత్తి చేయడం వల్ల కుదుళ్లు, జుట్టు జిడ్డుగా మారతాయి. ఫలితంగా చుండ్రు, దురద సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఆయిలీ హెయిర్‌ ఉన్న వారు రోజు విడిచి రోజు తలస్నానం చేయక తప్పదు. అలాగే నూనె ఆధారిత షాంపూలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కండిషనర్‌ను కూడా జుట్టు చివర్లకు మాత్రమే రాసుకోవాలి. తద్వారా కుదుళ్లలో అధిక నూనె ఉత్పత్తి కాకుండా నియంత్రించవచ్చు.

గమనిక: జుట్టు తత్వాన్ని బట్టి ఎన్ని రోజులకోసారి తలస్నానం చేయాలి? ఈ క్రమంలో ఎలాంటి షాంపూలు ఉపయోగించాలి? ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న విషయాల గురించి తెలుసుకున్నారుగా! అయితే మీ జుట్టు సంరక్షణ విషయంలో ఇంకా మీకేమైనా సందేహాలు, సమస్యలుంటే సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.. అంతేకానీ సొంత వైద్యం చేసుకొని లేనిపోని సమస్యలు కొనితెచ్చుకోకండి.


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని