అందరిదీ ఒకటే ప్రశ్న... నీ చేతికేమైంది? - how palak kohli beat the odds to qualify for tokyo paralympics
close
Published : 24/08/2021 16:57 IST

అందరిదీ ఒకటే ప్రశ్న... నీ చేతికేమైంది?

(Photo: Instagram)

చిన్నతనంలో పలక్‌ను చూసిన ప్రతిఒక్కరూ మొదట ‘నీ చేతికేమైంది’ అని అడిగేవారు. జాలి చూపించేవారు. ఇక స్కూల్లో తోటి విద్యార్థులందరూ ఆడుకుంటుంటే తను మాత్రం పక్కన కూర్చొని బేల చూపులు చూసేది. ఏదో సరదా కొద్దీ మైదానంలోకి అడుగుపెడితే ‘నీకెందుకీ ఆటలు... బుద్ధిగా చదువుకోక’ అని పీఈటీలే వెనక్కు పంపించేవారు. అయితే ఈ అవమానాలే ఆమెకో లక్ష్యాన్ని, దారిని చూపాయి.

టోక్యో వేదికగా నేటి నుంచి (ఆగస్టు 24) పారాలింపిక్స్‌ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఇటీవల ముగిసిన ఒలింపిక్స్ లాగానే ఈ విశ్వక్రీడల్లోనూ ‘భారత్‌’ వెలగాలని క్రీడాభిమానులు మనసారా కోరుకుంటున్నారు. ఇందుకు తగ్గట్లే మొత్తం 54 మంది భారతీయ క్రీడాకారులు ఈ క్రీడల్లో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఇందులో పారాబ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పలక్‌ కోహ్లీ కూడా ఉంది. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ఈ 19 ఏళ్ల అమ్మాయి... ఈ క్రీడల్లో పోటీ పడుతోన్న అతి పిన్న వయసున్న భారతీయ క్రీడాకారిణి కావడం గమనార్హం. అదేవిధంగా మహిళల సింగిల్స్‌తో పాటు మిక్స్‌డ్‌ డబుల్స్‌, మహిళల డబుల్స్‌... ఇలా మూడు విభాగాల్లో పారాలింపిక్స్‌కు అర్హత సాధించిన ఏకైక భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్ కూడా తనే కావడం గమనార్హం.

దానర్థం తెలిసేది కాదు!

పూర్తిగా ఎదగని ఎడమ చేతితోనే ఈ లోకంలోకి అడుగుపెట్టింది పలక్‌. దీంతో ప్రేమ చూపించాల్సిన బంధువులు, ఇరుగుపొరుగువారు ఆమెపై జాలి చూపడం ప్రారంభించారు. ‘నన్ను మొదటిసారి చూసిన వాళ్లెవరైనా ‘నీ చేతికేమైంది’ అని అడుగుతారు. ‘పుట్టుకతోనే...’ అని వారికి జవాబిస్తాను. అయితే నా చిన్నప్పుడు ‘పుట్టుకతోనే’ అనే మాటకు అర్థం తెలిసేది కాదు. కానీ అలాగే చెప్పాలని మాత్రం తెలుసు. ఇక స్కూల్లో పీఈటీ క్లాసులున్న సమయంలో అందరూ ఆడుకుంటుంటే నేను మాత్రం ఒంటరిగా పక్కన కూర్చొనేదాన్ని. నేనూ ఆడుకుంటానంటే ‘నీకెందుకు ఆటలు?.. బుద్ధిగా చదువుకో చాలు’ అని పీఈటీలే నన్ను నిరుత్సాహ పరిచేవారు.’

ఆ చేతిని కూడా పోగొట్టుకుంటావా?

‘ఒకసారి నేను మా సోదరునితో కలిసి ఓ షాపింగ్‌ మాల్‌కు వెళ్లాను. అప్పుడు అనుకోకుండా గౌరవ్‌ ఖన్నా (పారా బ్యాడ్మింటన్‌ కోచ్) నన్ను కలిశారు. ఆయన కూడా అందరిలాగే ‘నీ చేతికేమైంది’ అని అడిగారు. దీంతో పాటు పారా స్పోర్ట్స్‌ గురించి కూడా చెప్పారు. దీంతో స్కూల్‌ కెళ్లి హ్యాండ్‌బాల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్నాను. అప్పుడు పీఈటీ టీచర్‌ నన్ను పక్కకు తీసుకెళ్లి ‘ఇప్పటికే ఓ చేయి సరిగ్గా లేదు...ఈ ఆటలాడి ఉన్న ఇంకో చేతిని కూడా పోగొట్టుకుంటావా?’ అని మళ్లీ ఎత్తి పొడిచేలా మాట్లాడింది. అప్పటివరకు క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవాలన్న ఆసక్తి ఉండేది కాదు. అయితే ఈ సంఘటనతో నాలో కసి పెరిగింది. ఆటల్లో సత్తా చాటి నన్ను నేను ప్రపంచానికి పరిచయం చేసుకోవాలనుకున్నాను. పారా బ్యాడ్మింటన్‌ శిక్షణ కోసం గౌరవ్‌ ఖన్నాను కలుసుకున్నాను ’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ యంగ్‌ సెన్సేషన్.

ఘనమైన ఆరంభం!

ఆట కోసం ఇంటిని వదిలి లక్నోకు చేరుకుంది పలక్‌. అక్కడి పారా బ్యాడ్మింటన్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంది. క్రమంగా ఆటపై పట్టు సాధించిన ఆమె అతి తక్కువ సమయంలోనే పతకాలు సాధించడం మొదలుపెట్టింది. 2019లో ఉగాండా వేదికగా జరిగిన పారా బ్యాడ్మింటన్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో మొదటిసారిగా తన అదృష్టం పరీక్షించుకుంది. వుమెన్స్‌ సింగిల్స్‌లో బంగారు పతకం, డబుల్స్‌లో వెండి పతకం గెల్చుకుని తన క్రీడా ప్రస్థానాన్ని ఘనంగా ఆరంభించింది. అదే ఏడాది జపాన్‌లో జరిగిన పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్‌ టోర్నీలో కాంస్య పతకం సాధించింది. అయితే అప్పుడే మోకాలికి తీవ్ర గాయం కావడం, ఆపై కరోనా పరిస్థితులతో గతేడాదంతా ఆటకు దూరంగానే ఉంది పలక్‌. అయినా ఆటపై పట్టును కోల్పోలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో దుబాయి పారా బ్యాడ్మింటన్‌ టోర్నీ మూడు విభాగాల్లో (వుమెన్స్ సింగిల్స్‌, డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌)నూ పతకాలు సాధించింది. వీటితో పాటు టోక్యో పారాలింపిక్స్‌ బెర్తు కూడా ఖాయం చేసుకుంది.

నా వైకల్యాన్ని శక్తిగా మార్చుకున్నాను!

జీవితంలోని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడంపై స్పందించిన పలక్‌..‘ఆటల్లో రాణించాలంటే శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా బలంగా ఉండాలి. అన్నిటికీ మించి సానుకూల దృక్పథం ఉండాలి. మా కోచ్‌ కూడా ఇదే నేర్పారు. దీనికి సంబంధించి ఆయన ఒక నోట్స్ కూడా ప్రిపేర్ చేయించారు. ఇందులో భాగంగా నా జీవితంలో జరిగిన మంచి విషయాలన్నీ ఒక వైపు, చెడు విషయాలన్నీ మరో వైపు రాయించారు. అప్పుడు 27-28 వరకు సానుకూల విషయాలు వచ్చాయి. ప్రతికూల అంశాలు రాసినప్పుడు నాలుగు, ఐదు మాత్రమే లిస్టులో వచ్చాయి. అవి కూడా తాత్కాలికమైనవే. ఇలా నేను నా వైకల్యాన్ని శక్తిగా మార్చుకున్నాను. ప్రపంచమంతా ఏకమై ‘నీకు సాధ్యం కాదు’ అని చెప్పినా ‘సాధ్యం అవుతుంది. నేను చేసి చూపిస్తాను’ అనే చెప్పాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం’ అని స్ఫూర్తినిచ్చే మాటలు చెబుతోన్న పలక్‌ బంగారు పతకాలతో తిరిగి రావాలని కోరుకుందాం.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని