చపాతీలు చేయడమూ ఓ కళే! - how to make a perfect roti chapathi in telugu
close
Published : 23/09/2021 17:25 IST

చపాతీలు చేయడమూ ఓ కళే!

మా ఫ్రెండ్ శశి చేసే చపాతీలంటే నాకెంతో ఇష్టం. చక్కగా, మెత్తగా, మృదువుగా- ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించేలా ఉంటాయి. అదే నేనెప్పుడు చేసినా సరే- రాళ్లలా గట్టిగా అయిపోతాయి. అందుకే, 'చపాతీలు చేస్తున్నా' అంటే చాలు- మా ఆయన, పిల్లలు 'ఈరోజు మా డిన్నర్ బయటే' అంటారు..! ఎలాగైనా సరే- నేను కూడా చపాతీలు టేస్టీగా చేయాలని డిసైడైపోయి, ఆ టెక్నిక్స్ ఏంటో నేర్చుకున్నా.. మరి, మీక్కూడా చెప్పేయమంటారా..?

చపాతీలు మెత్తగా, మృదువుగా చేయడం ఒక కళ. చాలామందికి చేసే విధానం సరిగ్గా తెలియకపోవడం వల్ల చపాతీలు గట్టిగా వస్తాయి. అవి తినలేక దవడలు వాచిపోతాయ్! మరి చపాతీలు మెత్తగా రావాలంటే ఏం చేయాలి?

'పిండి కొద్దీ రొట్టె' అన్నట్లు- ఎన్ని చపాతీలు అవసరమో అంతకు సరిపడా పిండినే కలుపుకోవాలి. అలా పరిమాణం నిర్దిష్టంగా ఉండటం వల్ల అందులో కలిపే ఉప్పు, నూనె.. వంటివి సులభంగా అంచనా వేయవచ్చు. పిండి కలిపే సమయంలో కొంతమంది నెయ్యి లేదా నూనె, పెరుగు అందులో కలుపుతారు. వీటన్నిటినీ ఎంతో కొంత అని కాకుండా, తీసుకున్న పిండికి తగిన పాళ్లలో కలిపినప్పుడే చపాతీలు మృదువుగా వస్తాయి.

ఈ క్రమంలో ముందుగా నాణ్యమైన చపాతీ పిండి తీసుకోవాలి. అవసరమైతే దాన్ని జల్లెడ పట్టాలి. మీకు అవసరమయ్యే పరిమాణంలో పిండిని తీసుకుని తగు పాళ్లలో నూనె, ఉప్పు, నీళ్లు కలుపుకోవాలి. ఉదాహరణకు మీరు మూడుకప్పుల (చిన్నవి) పిండి కలపాలనుకుంటే; అందులో రెండు చెంచాల నూనె, కాస్త ఉప్పు, ఒకటిన్నర కప్పుల నీళ్లు (మీరు పిండి కొలిచిన కప్పుతో) కలపాలి. మొదట్లో మెల్లగా పిండి కలుపుకొంటూ కొద్దికొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఒకేసారి నీళ్లన్నీ పోసేయకూడదు. పిండి బాగా కలవాలంటే ముందు గోధుమ పిండిని ఒక కొండ ఆకారంలో పోసి దాని మధ్యలో నూనె, ఉప్పు, నీళ్లు వేసి కలపాలి. అప్పుడు మొత్తం అన్నీ సమానంగా కలుస్తాయి.

మదించడమూ ముఖ్యమే!

పిండిలో అన్నీ వేసి కలుపుకొన్న తర్వాత దాన్ని మదించడం చాలా ముఖ్యం. అప్పుడే ఆ పిండి మెత్తగా, మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. వెడల్పుగా ఉండే పాత్ర లేదా గిన్నెలో పిండి కలుపుకుంటే బాగా పిసకడానికి వీలుంటుంది. మీ బలం అంతా ఉపయోగించి కలిపిన పిండిని ఎంత వీలైతే అంత మదించడానికి ప్రయత్నించండి. తర్వాత దాని మీద తడి వస్త్రం కప్పి, 15 నుంచి 20 నిమిషాల పాటు కదపకుండా వదిలేయాలి. దీనివల్ల పిండికి వచ్చిన మెత్తదనం, మృదుత్వం పోకుండా ఉంటాయి.

ఒకేలా చేయాలి

చపాతీలు చేసుకోవడానికి పిండి సిద్ధమైన తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అన్ని ఉండల్నీ ఒకేలా, ఎక్కడా హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా, గుండ్రంగా అప్పడాల్లా ఒత్తుకోవాలి. ఈ క్రమంలో చపాతీలు ఒత్తే పీటకు తడి పిండి అంటుకోకుండా పొడి గోధుమ పిండి చల్లుతూ ఉండాలి. అలా చపాతీలు చేస్తున్నప్పుడు వాటిని ఎప్పుడూ సవ్యదిశలోనే తిప్పుతూ ఒత్తుకోవాలి.

చపాతీలు ఒత్తుకున్న తర్వాత వాటిని మొదట పచ్చిదనం పోయే వరకు పెనం మీద కాసేపు ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కాలనివ్వాలి. తర్వాత మంట మధ్యస్థంగా ఉంచాలి. ఇలా అవసరమైనంత ఉష్ణోగ్రత అందించడం వల్ల చపాతీలు మెత్తగా ఉంటాయి. మరీ, ఎక్కువ మంట పెట్టి కాల్చినా అవి గట్టిగా వచ్చేస్తాయి. అందుకే ఈ విషయం గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. ఇలా ఒక క్రమ పద్ధతిలో చపాతీలు చేస్తే.. చాలా చక్కగా, మెత్తగా, మృదువుగా వస్తాయి. ఎన్ని తిన్నా ఇంకా తినాలనే అనిపిస్తుంది. దీంతో పాటు మరికొన్ని చిట్కాలు పాటించడం వల్ల కూడా మెత్తటి చపాతీలు చేసుకోవచ్చు.. అవి;

గోధుమ పిండిని కలుపుకొనేటప్పుడు చల్లటి నీళ్లకు బదులు వేడి నీటిని ఉపయోగించవచ్చు.

* అరచెంచా బేకింగ్ సోడా పిండిలో కలపడం వల్ల కూడా చపాతీలు మెత్తగా వస్తాయి. పొంగుతాయి కూడా.

* చపాతీలు చేయడానికి ఒక గంట ముందే పిండిని కలిపి పెట్టుకోవాలి.

* నీళ్లకు బదులు పాలు కూడా కలుపుకోవచ్చు.

* చపాతీలు చేసుకునేటప్పుడు పొడి పిండిని ఎంత వీలైతే అంత తక్కువగా ఉపయోగించాలి. లేకపోతే చపాతీలు గట్టిపడే ప్రమాదం ఉంది.

* కాల్చిన చపాతీలను వెంటనే మూత ఉండే పాత్రల్లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చపాతీలు మెత్తగా, మృదువుగా, వేడిగా ఉంటాయి. ఈసారి చపాతీలు చేసేటప్పుడు ఈ చిట్కాలన్నీ పాటించి చూడండి.. 

అలాగే చపాతీలు మెత్తగా, మృదువుగా రావడానికి మీరు పాటించే చిట్కాలేంటో మాతో పంచుకోండి.మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని