'ముద్దుల కన్నయ్య'లను ముస్తాబు చేద్దామిలా... - how to make up your child as little krishna in telugu
close
Published : 29/08/2021 12:44 IST

'ముద్దుల కన్నయ్య'లను ముస్తాబు చేద్దామిలా...

'గోకుల కృష్ణ.. గోపాల కృష్ణ మాయలు చాలయ్యా..!

'మొర వినరా.. ఓ గోపీ కృష్ణ.. ఈ వన్నెలు నీవేలేరా..'

కృష్ణుడంటే అందరికీ ఇష్టమే. అందుకే ఏటా కృష్ణాష్టమి రోజున ఆ గోపాలుణ్ని ప్రార్థించడమే కాకుండా ఇంట్లో ఉండే చిన్న పిల్లలకు కృష్ణుడి గెటప్ వేసి సంబరపడుతూ ఉంటాం. చిట్టి చిట్టి పాదాలతో వాళ్లు అలా నట్టింట్లో తిరుగుతుంటే సాక్షాత్తూ ఆ కృష్ణ భగవానుడే నడుస్తున్నట్లు భావిస్తాం.. మరి పిల్లల్ని అలా చిట్టి కన్నయ్యలుగా తయారు చేయడమెలాగో చూద్దాం..

* చిన్న పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి మనం మేకప్ ఉత్పత్తులు ఎక్కువగా ఉపయోగిస్తే వారి చర్మం మీద చెడు ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా మేకప్ వేసుకోవాలి. ముందుగా సాధారణ టాల్కం పౌడర్ రాయాలి. తర్వాత చర్మం రంగుకు నప్పే కాంపాక్ట్ పౌడర్ రాయాలి. కృష్ణుడు నీలం రంగులో ఉంటాడు కాబట్టి కళ్లకు నీలం రంగు ఐ షాడో వేయాలి. తర్వాత తిలకంతో నుదుటన నామం దిద్దాలి. ఇక్కడితో ముఖానికి సంబంధించి మేకప్ పూర్త్తెంది.

* అలాగే పంచె కట్టి తర్వాత బయటకు కనిపించే భాగాల్లో కూడా టాల్కం పౌడర్, కాంపాక్ట్ పౌడర్ రాయాలి. అప్పుడు మేకప్ ఉత్పత్తుల వల్ల చర్మం అంతగా ప్రభావితం కాకుండా ఉంటుంది.

* తర్వాత ఇయర్ రింగ్స్ పెట్టాలి. ఒకవేళ దిద్దులు పెట్టడానికి రంధ్రాలు లేకపోతే ప్రెస్సింగ్‌వి కూడా పెట్టుకోవచ్చు.

* సంప్రదాయబద్ధంగా పంచె కట్టొచ్చు లేదా ధోతీ మోడల్స్‌లో ఉన్న రడీమేడ్ దుస్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

* పంచె కట్టిన తర్వాత అది జారిపోకుండా వడ్డాణం పెట్టాలి. తర్వాత మెడలో వేయాలనుకున్న ఆభరణాలు, హారాలు.. అన్నీ వేయాలి. అరవంకీలు చేతులకు వూడిపోకుండా తగిలించాలి.

* ఇలా మొత్తం గెటప్ రడీ అయ్యాక చివరిగా కిరీటం పెట్టాలి. కృష్ణుడికి నెమలి పింఛం తప్పనిసరిగా పెట్టాలి కాబట్టి మర్చిపోకుండా కిరీటానికి, జుట్టుకి మధ్య దాన్ని తగిలించాలి.

* చేతిలో పిల్లనగ్రోవి ఉంచాలి. చేతులకు ముత్యాలు లేదా స్టోన్స్‌తో చేసిన ఆభరణాలు, కాళ్లకు పట్టీలు లేదా గజ్జెలు పెడితే సరి.. మీ 'చిన్ని కృష్ణుడు' రడీ..!

బ్లూ షేడ్స్‌లో ఉండే పౌడర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కావాలనుకుంటే వాటిని ఉపయోగించి పిల్లల శరీరానికి నీలం రంగు వేయచ్చు. అయితే వాటిని అప్త్లె చేసే ముందు టాల్కం పౌడర్, కాంపాక్ట్ పౌడర్స్ తప్పనిసరిగా రాసుకోవాలి. ఒకవేళ అవి అందుబాటులో లేకపోతే ఐ షేడ్స్‌లో వాడే పౌడర్‌ని కూడా ఉపయోగించవచ్చు. అయితే గెటప్ తీసేసిన తర్వాత పాల మీగడ లేదా కొబ్బరి నూనెతో మేకప్‌ని రిమూవ్ చేసుకోవాలి. అప్పుడే చర్మానికి ఎలాంటి హానీ కలగదు. తర్వాత సబ్బుతో రుద్ది స్నానం చేయిస్తే సరిపోతుంది..

మరి, మీరు కూడా ఇదేవిధంగా మీ పిల్లల్ని కృష్ణుడి గెటప్‌లో అందంగా రడీ చేయండి.. కృష్ణాష్టమిని సంబరాలతో సందడిగా జరుపుకోండి. అలాగే- ఆ ఫొటోలను contactus@vasundhara.net మెయిల్ ఐడీకి పంపించండి. వాటిని vasundhara.netలో ప్రచురిస్తాం.


Advertisement


మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని