మతిమరపును ఇలా మరచిపోదాం..! - how to rescue from forgetfulness in telugu
close
Published : 18/10/2021 21:11 IST

మతిమరపును ఇలా మరచిపోదాం..!

రోజూ మనం కలిసి మాట్లాడే స్నేహితురాలే.. అయినా ఉన్నట్టుండి ఒక్కొక్కసారి తన పేరు ఎంతకీ గుర్తు రాదు.. ఒక సినిమాని కనీసం పదిసార్త్లెనా చూసి ఉంటాం.. ఆ హీరోయిన్ పేరు చెప్పాలంటే మాత్రం తడబడతాం.. కొన్ని సందర్భాల్లో అయితే ఇంటి తాళం చెవి ఎక్కడ పెట్టామో కూడా గుర్తురాదు. వినడానికి ఇలాంటి సంఘటనలు నవ్వు తెప్పించినా అందరికీ ఈ పరిస్థితి ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటుంది. వృత్తిపరమైన ఆందోళన, ఇతరత్రా కారణాల వల్ల చిన్న చిన్న విషయాలను సైతం మరచిపోతూ ఉంటాం. అలాంటి సమయాల్లో మతిమరపును పోగొట్టుకోవడమెలా? అనే ప్రశ్న మనకు ఎదురవుతూ ఉంటుంది. అయితే రోజూ కొన్ని పనులను చేయడం అలవాటుగా మార్చుకుంటే మతిమరపు అనే పదం మన డిక్షనరీలో కూడా కనపడదట. మరి అవేంటో తెలుసుకుందాం రండి..

పజిల్స్..

రోజూ పత్రికలు చదవడం చాలామందికి ఉండే అలవాటు. అయితే చాలా పత్రికల్లో సుడోకు, పజిల్స్, పొడుపు కథలు, లాజిక్‌తో ముడిపడి ఉండే ప్రశ్నలు వంటి వాటిని కూడా ప్రచురిస్తారు. అయితే అవన్నీ పిల్లల కోసం అని కొందరు వదిలేస్తూ ఉంటారు. కానీ ఈ పజిల్స్ పూర్తి చేస్తున్నప్పుడు మన మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది. ఎక్కడ ఏ పదం నింపామో కూడా గుర్తుపెట్టుకుంటుంది. అందుకే రోజూ ఏదో ఒక సమయంలో వీటిని సాధన చేయడం ద్వారా మన మెదడుని కూడా చాలా విషయాలు గుర్తుంచుకునేలా చేయచ్చు.

యోగా..

మతిమరుపుకి మరో ప్రధాన కారణం తీవ్రమైన ఒత్తిడి. ఆఫీసులో ఎక్కువ సమయం విధులు నిర్వహించినా.. లేదంటే ఏ పనైనా సరిగా పూర్తికాకపోయినా.. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ పనులు చేయడానికి ప్రయత్నించినా.. మన మెదడు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆ సమయంలో చేతికి అందుబాటులో ఉన్న పెన్ను కోసం కూడా చాలా వెతుక్కుంటాం. అంటే తెలియకుండానే మనకు మతిమరపు వచ్చేస్తుంది. దీనికి యోగా ఒక పరిష్కారాన్ని చూపిస్తుంది. యోగా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఫలితంగా మనం ఎదుర్కొంటున్న ఒత్తిడి తగ్గిపోతుంది. దీనితో పాటు ఒత్తిడికి గురవుతున్నామనిపించిన సమయంలో దీర్ఘశ్వాస తీసుకోవడం ద్వారా కూడా ఒత్తిడిని అదుపు చేయచ్చు.

తగినంత నిద్ర..

నిద్ర మెదడుకు పూర్తి విశ్రాంతినిస్తుంది. అందుకే సరిపడినంత సేపు నిద్రపోకపోతే మెదడు చురుగ్గా పనిచేయదు. ఫలితంగా సమయానికి ఏమీ గుర్తు రావు. అలాగే మెదడు కూడా ఒత్తిడికి గురవుతుంటుంది. కాబట్టి రోజూ ఎనిమిది గంటలు కచ్చితంగా నిద్రపోవాలి. దీనివల్ల ఉదయం లేవగానే మనసుకు ఉల్లాసంగా అనిపిస్తుంది. పైగా బద్ధకం లాంటి లక్షణాలు దరి చేరవు కాబట్టి మెదడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఫలితంగా మతిమరపు అనే సమస్యే ఉండదు. అలాగే 'ఎర్లీ టు బెడ్.. ఎర్లీ టు రైజ్' సిద్ధాంతాన్ని కూడా అనుసరించడం చాలా మంచిది. ఎందుకంటే ఉదయాన్నే నిద్ర లేచేవారిలో మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది.

శాకాహారంతో..

అన్ని రకాల పోషకాలు శరీరానికి అందేలా మన ఆహారం ఉండాలి. అందులో తాజా పండ్లు, కూరగాయలు, ముడి ధాన్యాలు తప్పకుండా భాగం చేసుకోవాలి. వీటి ద్వారా శరీరానికి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మెదడుకు హాని చేసే ఫ్రీరాడికల్స్‌ని నశింపజేస్తాయి. అలాగే వీటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా విటమిన్ 'బి12', ఫోలేట్, విటమిన్ 'సి', విటమిన్ 'ఇ', జ్ఞాపకశక్తిని పెంపొందించే విలువైన పోషకాలు సమృద్ధిగా అందుతాయి. వీటివల్ల కూడా మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

రివర్స్ చేద్దాం..

మీరు చేతికి వాచీ ఎలా పెట్టుకుంటారు? 'ఇదీ ఒక ప్రశ్నేనా!! టైం చూడటానికి వీలుగా పెట్టుకుంటాం' అంటారా?? అయితే ఈ సారి అలా కాకుండా వాచీని తిరగేసి పెట్టుకోండి. ఎందుకంటే వినడానికి ఇది సిల్లీగా ఉన్నా మన జ్ఞాపకశక్తిని పెంచుతుందట. ఎందుకంటే తిరగేసి వాచీ పెట్టుకున్నప్పుడు మొదట్లో సమయం తెలుసుకోవడానికి కాస్త ఇబ్బంది పడతాం. కానీ అలవాటయ్యే కొద్దీ మనకు ఎలాంటి కష్టమూ అనిపించదు. ఎందుకంటే మన మెదడుకి వాచీ ఎలా ఉన్నా అంటే ఏ దిశలో ఉన్నా సమయాన్ని గుర్తించగలిగే సామర్థ్యం వస్తుంది.

వీటితో పాటు రోజూ వ్యాయామం చేయడం, కాఫీ, టీలకు దూరంగా ఉండడం, చేసే పనిని కొత్తగా చేయడానికి ప్రయత్నించడం మొదలైన వాటి ద్వారా మెదడు మరింత హుషారుగా పనిచేస్తుంది. ఫలితంగా మతిమరపు సమస్య మనల్ని వేధించకుండా ఉంటుంది.


Advertisement


మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని