ఇలా తలస్నానం చేస్తే మీ జుట్టు పట్టులా మెరుస్తుంది! - how to shampoo your hair
close
Updated : 09/07/2021 20:01 IST

ఇలా తలస్నానం చేస్తే మీ జుట్టు పట్టులా మెరుస్తుంది!

జుట్టు కాస్త డల్‌గా, రఫ్‌గా కనిపించిన వెంటనే తలస్నానం చేయడం మనలో చాలామందికి ఉన్న అలవాటు. కానీ, అలా చేయడం మంచిదేనా? అసలు ఎన్ని రోజులకోసారి తలస్నానం చేయాలి? తలస్నానం చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే జుట్టుకి మంచిది??.. ఈ వివరాలన్నీ మీరూ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది చదవాల్సిందే..

ఎన్నిరోజులకోసారి చేస్తున్నారు?

వాతావరణ కాలుష్యం, దుమ్ము, ధూళి, పొగ.. ఇలా రకరకాల కారణాల వల్ల జుట్టు తొందరగా రఫ్‌గా, డల్‌గా మారిపోవడం సహజమే. అందుకే జుట్టు తిరిగి మృదువుగా, ఆరోగ్యంగా కనిపించాలని వెంటనే తలస్నానం చేసేస్తూ ఉంటాం. కానీ, అలా ఎన్నిరోజులకోసారి చేస్తున్నారో ఎప్పుడైనా గమనించారా? మీ జుట్టు జిడ్డుగా ఉంటే నిపుణుల సలహా మేరకు రెండు రోజులకోసారి తలస్నానం చేయచ్చు.. ఒకవేళ మీది సాధారణ, పొడి జుట్టు అనుకోండి.. వారానికి రెండుసార్లు మాత్రమే తలస్నానం చేయాల్సి ఉంటుంది. ఇలా ఎప్పుడు, ఎన్నిసార్లు చేసినా గాఢత తక్కువగా ఉండే షాంపూనే ఉపయోగించాలి.

తలస్నానానికీ పద్ధతుంది..

తలస్నానం చేయాలనుకునే ముందు జుట్టు చిక్కులు తీసి బాగా దువ్వుకోవాలి. దీనివల్ల తలస్నానం చేసేటప్పుడు జుట్టు రాలడం కొంత వరకు తగ్గించుకోవచ్చు. అలాగే పెళుసుగా ఉన్న వెంట్రుకలు కూడా తెగిపోకుండా ఉంటాయి. ముందుగా నీళ్లతో జుట్టుని బాగా తడపాలి. ఇప్పుడు నీళ్లలో షాంపూను కలుపుకొని.. ఈ మిశ్రమాన్ని తలపై పోసుకొని.. కుదుళ్లను రెండు నిమిషాల పాటు గుండ్రంగా రుద్దుతూ మసాజ్‌ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఫలితంగా కుదుళ్లు బాగా శుభ్రపడి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. జుట్టు రాలిపోయే సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.

గోరువెచ్చని నీరే..!!

తలస్నానం చేసేటప్పుడు మరీ చల్లని లేదా బాగా వేడిగా ఉండే నీళ్లను ఉపయోగించకూడదు. ఇలా చేస్తే కుదుళ్ల లోపల ఉండే సెబేషియస్‌ గ్రంథులు దెబ్బతింటాయి. కాబట్టి ఆ ప్రాంతంలో జుట్టు పల్చగా అయిపోయి, తేమను కూడా కోల్పోతుంది. అందుకే తలస్నానానికి ఉపయోగించే నీళ్లు మరీ చల్లగా కాకుండా.. మరీ వేడిగా కాకుండా.. గోరు వెచ్చగా ఉండేలా చూసుకోవడం ఉత్తమం.

కండిషనర్‌తో ఫినిషింగ్‌ టచ్‌..

చాలామంది తలస్నానం చేశాక అక్కడితో పని పూర్తైపోయిందనుకుంటారు. కానీ, అన్నింటికంటే ముఖ్యమైంది.. తలస్నానం చేశాక జుట్టుకి కండిషనర్ రాసుకోవడం. కండిషనర్ రాసుకోవడం వల్ల చివర్లు చిట్లకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే జుట్టు మృదువుగా, పట్టుకుచ్చులా మారుతుంది. కండిషనర్‌ వెంట్రుకల చివర్లను బ్లాక్‌ చేసి జుట్టు తేమను కోల్పోకుండా చేస్తుంది. 

తడి తలను దువ్వకండి..

తలస్నానం చేసిన తర్వాత కుదుళ్లు బాగా మెత్తబడి ఉంటాయి. ఇలాంటి సమయంలో తల దువ్వితే ఎక్కువగా జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఎప్పుడూ తడి తలను దువ్వే ప్రయత్నం చేయకండి. ముందు బాగా ఆరబెట్టుకుని, ఆ తర్వాతే దువ్వుకోవాలి. అలాగే తడిగా ఉన్న తల తొందరగా ఆరిపోవాలని టవల్ పెట్టి తెగ తుడిచేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. ఇలా చేస్తే జుట్టు నిర్జీవంగా మారిపోతుంది. అందుకే వీలైనంత వరకు జుట్టుని సహజంగానే ఆరనివ్వాలి. అలాగే తలను ఆరబెట్టుకోవడానికి డ్రయర్స్, బ్లోయర్స్.. వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం కూడా వీలైనంత తగ్గించేయడం మంచిది. వీటివల్ల జుట్టు సహజసిద్ధమైన తేమను కోల్పోతుంది.

మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని