ఈ కోటి రూపాయలతో ఏం చేస్తానంటే..! - inspiring story of the first crorepati of kbc season 13
close
Published : 31/08/2021 19:33 IST

ఈ కోటి రూపాయలతో ఏం చేస్తానంటే..!

(Photo: Screengrab)

15 ఏళ్ల వయసంటే... అమ్మాయిల జీవితంలో అత్యంత కీలకమైన దశ. అప్పుడప్పుడే యవ్వనంలోకి అడుగుపెడుతూ భవిష్యత్‌ గురించి ఎన్నో కలలు కంటుంటారు ఈ వయసు అమ్మాయిలు. దురదృష్టవశాత్తూ ఇలాంటి దశలోనే రోడ్డు ప్రమాదం బారిన పడింది హిమానీ. రెండు కళ్లూ దెబ్బతినడంతో చూసే శక్తి బాగా తగ్గిపోయింది. చేతికొచ్చిన ఆడపిల్ల జీవితం తలకిందులు కావడంతో కుటుంబ సభ్యులందరూ కన్నీరుమున్నీరయ్యారు.

ఈ సీజన్‌లో మొదటి కోటీశ్వరురాలు!

అయితే ఆత్మస్థైర్యమే ఆయుధంగా ముందుకు సాగింది హిమానీ. మొక్కవోని ధైర్యంతో ఉన్నత చదువులు అభ్యసించి టీచర్‌గా ఉద్యోగం సంపాదించింది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూనే తన ఆశలు, ఆశయాలను నెరవేర్చుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రతిష్ఠాత్మక ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ షోలోనూ పాల్గొంది. తన ప్రతిభాపాటవాలతో ఏకంగా కోటి రూపాయలు గెల్చుకుంది.

కౌన్‌ బనేగా కరోడ్‌ పతి... బాలీవుడ్ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ బుల్లితెర టీవీ షోకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో పాల్గొనాలని, హాట్‌సీట్‌ వరకు చేరుకోవాలని వేలాదిమంది ప్రయత్నిస్తుంటారు. అందుకు తగ్గట్లే ఇప్పటివరకు ఎంతోమంది సామాన్యులను లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా మార్చి వారి కలలను నిజం చేసిందీ గేమ్‌షో. ఇప్పటికే 12 సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ గేమ్‌షో తాజా సీజన్‌ ఇటీవల ప్రారంభమైంది.

చిన్నప్పుడు తోబుట్టువులతో కేబీసీ!

కేబీసీ చరిత్రలోనే మొదటిసారిగా కంటి చూపు సరిగా లేని ఓ మహిళ ఈ కార్యక్రమంలో పాల్గొంది. అంతేకాదు.. ఏకంగా కోటి రూపాయలు సొంతం చేసుకుంది. ఆమే ఆగ్రాకు చెందిన 25 ఏళ్ల హిమానీ బుందేలా. 13 ఏళ్ల వయసు నుంచే కేబీసీ అంటే ఆసక్తి పెంచుకున్న ఆమె...అప్పటి నుంచి తన తోబుట్టువులు, స్నేహితులతో కలిసి ఈ గేమ్‌షో ఆడేదట. ఎప్పటికైనా అమితాబ్‌ ఎదురుగా కూర్చొని ఈ గేమ్ షో ఆడడమే తన లక్ష్యంగా పెట్టుకున్న హిమానీ ఇప్పటివరకు నాలుగుసార్లు ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసిందట. కానీ నిరాశే ఎదురైంది. అయినా వెనక్కు తగ్గని ఆమె ఈ సీజన్‌లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కేబీసీ కాల్‌ రావడంతో ఎగిరి గంతేసింది. ఇక షోలో భాగంగా ఇప్పటికే 15 ప్రశ్నలకు కరెక్టుగా సమాధానం చెప్పిన హిమానీ కోటి రూపాయలు తన ఖాతాలో వేసుకుంది. 13వ సీజన్‌లో తొలి కోటీశ్వరురాలిగా నిలిచిన ఈ టీచరమ్మ తదుపరి రౌండ్‌లో 7 కోట్ల రూపాయల ప్రశ్నను ఎదుర్కోనుంది.

నా ఫ్యామిలీనే నాకు బలం!

‘సిటీ ఆఫ్‌ లవ్‌’గా పేరొందిన ఆగ్రానే హిమానీ సొంతూరు. తండ్రి పేరు విజయ్‌సింగ్‌ కాగా తల్లి సరోజ్‌ బుందేలా. అందరమ్మాయిల్లాగే అప్పటివరకు ఆడుతూ పాడుతూ తిరిగిన హిమానీ జీవితం 15 వ ఏట అనుకోని మలుపు తిరిగింది. రోడ్డు ప్రమాదంలో ఆమె రెండు కళ్లు బాగా దెబ్బతిన్నాయి.

‘రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు నాకు 15 ఏళ్లు ఉంటాయనుకుంటా. కళ్లకు బాగా దెబ్బలు తగిలినా కంటిచూపునకు ఎలాంటి ప్రమాదం లేదనుకున్నాను. ఎన్నో ఆశలతో కళ్లు తెరచిన నాకు చీకటి తప్ప ఇంకేమీ కనిపించలేదు. ఇది నన్నే కాదు.. నా కుటుంబ సభ్యులను కూడా విషాదంలో ముంచేసింది. అయితే తర్వాత నా ఫ్యామిలీనే నాకు బలంగా మారింది. ముఖ్యంగా చెల్లి పూజ దగ్గరుండి నా ఆలనాపాలన చూసుకుంది. నా కష్టాన్ని మర్చిపోయేలా చేసింది. నన్ను నిరంతరం సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించింది’ అని తన టీనేజ్ నాటి పరిస్థితులను గుర్తుకు తెచ్చుకుంది హిమానీ.

ప్రత్యేకంగా ప్రిపేరవ్వలేదు!

కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో హ్యుమానిటీస్‌లో డిగ్రీ పట్టా అందుకున్న ఆమె లక్నోలోని డాక్టర్‌ శకుంతలా మిశ్రా యూనివర్సిటీ నుంచి బీ.ఎడ్‌ పూర్తి చేసింది. ఆ తర్వాత ఆగ్రాలోని కేంద్రీయ విద్యాలయలో మ్యాథ్స్‌ టీచర్‌గా ఉద్యోగం సంపాదించింది. ఇక కేబీసీతో తన అనుబంధాన్ని అడిగితే ‘నాకు చిన్నప్పటి నుంచే కేబీసీ అంటే ఎంతో ఇష్టం. నా తోబుట్టువులు, స్నేహితులతో కలిసి ఈ గేమ్‌ ఆడేదాన్ని. నేను అందులో అమితాబ్‌ సార్‌ పాత్ర పోషించేదాన్ని. నేను 13 ఏళ్ల నుంచే ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాను. అప్పుడే ఎలాగైనా కేబీసీలో పాల్గొనాలని డిసైడయ్యాను. నాకు జనరల్ నాలెడ్జ్‌ మీద బాగా అవగాహన ఉంది. దీంతో పాటు ఉదయం నిద్ర లేవగానే కరెంట్‌ అఫైర్స్‌ చదువుతాను. ఇది నా దినచర్య. అందుకే కేబీసీ కోసం ప్రత్యేకంగా ప్రిపేరవ్వాల్సిన అవసరం కూడా రాలేదు. కేవలం కొన్ని విషయాలు రివిజన్‌ చేసుకున్నాను అంతే.’

ఇదేదో స్కామ్ కాల్‌ అనుకున్నా!

‘నేను ఇప్పటివరకు 4 సార్లు కేబీసీకి దరఖాస్తు చేశాను. కానీ రిప్లై రాలేదు. ఈసారి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ పెట్టడంతో నా పని కాస్త సులువైంది. అయితే ఈసారి కూడా అవకాశం వస్తుందనుకోలేదు. అందుకే కేబీసీ నుంచి కాల్ వచ్చినా ‘ఇదేదో స్కామ్‌ కాల్‌’ అని మూడుసార్లు రిజెక్ట్‌ చేశాను. చాలా మంచి పని చేశావని నా కుటుంబ సభ్యులు కూడా నా నిర్ణయాన్ని సమర్థించారు. అయితే మాటిమాటికీ కాల్స్ వస్తుండడంతో అసలు విషయం నిర్ధారించుకున్నాను.’

ఈ డబ్బును అందుకు వినియోగిస్తా..

‘నాలాంటి వారు చదువుకోవడం కోసం దేశంలో ఇన్‌క్లూజివ్‌ యూనివర్సిటీలు ఉన్నాయి. కానీ పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడానికి ఎక్కడా కోచింగ్‌ సెంటర్లు లేవు. ఈ షో ద్వారా వచ్చిన మొత్తంలో కొంత భాగాన్ని ఇన్‌క్లూజివ్‌ కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయడానికి కేటాయిస్తాను. దివ్యాంగ విద్యార్థులు కూడా యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ వంటి పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేలా చర్యలు తీసుకుంటాను. నేను ఇక్కడ వరకు రావడానికి కారణం నా ఫ్యామిలీనే. లాక్‌డౌన్‌లో మా నాన్న వ్యాపారం బాగా దెబ్బతింది. ఆయనతో ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాలనుంది. అలాగే నా తోబుట్టువులకు అవసరమైన సౌకర్యాలన్నీ కల్పిస్తాను’ అని చెప్పుకొచ్చిందీ టీచరమ్మ.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని