ప్రేమ కోసం రాచరికాన్నే వదులుకుంది! - japan princess mako marries her sweetheart kei komuro. here is the
close
Updated : 26/10/2021 16:00 IST

ప్రేమ కోసం రాచరికాన్నే వదులుకుంది!

కోటలోని యువరాణి సాధారణ పౌరుడిని ప్రేమించి పెళ్లాడడం మనం సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ నిజ జీవితంలోనూ అలాంటి జంటలు కొన్నున్నాయి. వారిలో జపాన్‌ యువరాణి మాకో, ఆమె ఇష్టసఖుడు కీ కొమురో జంట ఒకటి. చదువుకునే రోజుల్లోనే ఒకరినొకరు చూసుకొని మనసు పారేసుకున్న ఈ జంట.. పెద్దల అంగీకారంతో తాజాగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. అయితే జపాన్‌ రాచరికపు సంప్రదాయాల ప్రకారం.. రాజ కుటుంబానికి చెందిన మహిళలు సామాన్యులను పెళ్లాడితే రాచరికాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో తాను మనస్ఫూర్తిగా కోరుకున్న కొమురో కోసం రాణివాసపు విలాసాలు, గౌరవ మర్యాదలను సైతం తృణప్రాయంగా వదిలేసుకుంది మాకో. నిజమైన ప్రేమ ముందు కోటైనా, కోట్లాది ఆస్తిపాస్తులైనా దిగదుడుపే అంటోన్న ఆమె తన ప్రేమకథను ఇలా పంచుకుంది.

మా తాతగారు అకిహిటో. వారి రెండో సంతానమైన ఫుమిహిటో మా నాన్న. మా అమ్మ కికో.. వారికి మేం ముగ్గురం సంతానం. నేను, చెల్లి (కకో), తమ్ముడు (హిసాహిటో). నా ప్రాథమిక విద్యాభ్యాసం అంతా జపాన్‌లోనే సాగింది. టోక్యోలోని ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్సిటీ నుంచి 2014లో కళలు, సాంస్కృతిక వారసత్వంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశా. 2016లో లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ నుంచి Art Museum and Gallery Studies లో ఎంఏ పట్టా అందుకున్నా.

ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు నా స్నేహితురాలి ద్వారా కొమురో నాకు పరిచయం అయ్యాడు. మొదట తనని ఓ రెస్టారెంట్లో చూశా.. తొలిచూపులోనే నచ్చేశాడు. అతని గుణగణాలు, ప్రవర్తన, మనస్తత్వం.. నన్ను కట్టిపడేశాయి. కొమురో చాలా చక్కగా వయొలిన్ వాయిస్తాడు. వంట కూడా అద్భుతంగా చేస్తాడు.. తనకీ నేనంటే ఇష్టమని ఆ తర్వాత నాకు తెలిసింది.. ఆపై ఐదేళ్ల పాటు ప్రేమించుకున్నాం. మా పెళ్లికి తన ఇంట్లో వాళ్లను కూడా ఒప్పించాడు కొమురో.. అయితే తను జపాన్‌కి చెందిన ఒక సామాన్య వ్యక్తి కావడం, నేనేమో రాజ కుటుంబపు అమ్మాయిని కావడంతో అమ్మానాన్నలు అంత సులభంగా ఒప్పుకోలేదు. ఇక ఆఖరికి ఎలాగోలా వాళ్లను ఒప్పించగలిగా. అయితే మా రాచరికపు చట్టాల ప్రకారం.. రాజకుటుంబంలో పుట్టిన వ్యక్తులెవరూ సామాన్యులను పెళ్లాడకూడదు. ఒకవేళ అలా పెళ్లాడాలనుకుంటే మాత్రం రాచరికాన్ని త్యజించి.. రాణీవాసాన్ని వీడి ఓ సామాన్య వ్యక్తిలా జీవించాల్సి ఉంటుంది.

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన కొమురో ముందు ఇవేవీ నాకు ముఖ్యమనిపించలేదు. అందుకే అతని కోసం రాచరికాన్ని, రాణివాసాన్ని అన్నీ వదులుకొని అతని వెంట ఏడడుగులు నడిచా. అంతెందుకు రాజభరణం కింద నా తల్లిదండ్రులు నాకు అందించిన 153 మిలియన్‌ యెన్ల  (సుమారు 10 కోట్లు) మొత్తాన్ని కూడా నేను స్వీకరించలేదు. ఇలా ఓ యువరాణిలా కాదు.. ఓ సామాన్య యువతిలా అతని ఇంట అడుగుపెట్టా. నిజానికి మా పెళ్లి 2018లోనే జరగాల్సింది. కానీ కొన్ని ఆర్థిక వివాదాల కారణంగా ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇన్నేళ్లకు నా కల ఫలించింది. మనసిచ్చిన వాడిని మనువాడానన్న సంతోషం ఓవైపైతే.. కనిపెంచిన తల్లిదండ్రులు, తోబుట్టువుల్ని వీడుతున్న క్షణంలో నా మనసులోని భావోద్వేగం కట్టలు తెంచుకుంది. పుట్టింటిని వీడి మెట్టినింట అడుగుపెడుతున్న సమయంలో ప్రతి అమ్మాయికీ ఇదో ఎమోషనల్‌ జర్నీ!

ప్రస్తుతం నేను టోక్యో యూనివర్సిటీ మ్యూజియంలో రీసెర్చర్‌గా పనిచేస్తున్నా. కొమురో కూడా ఇటీవలే లా పూర్తి చేసుకొని అమెరికా నుంచి తిరిగొచ్చారు. ఇక త్వరలోనే మా లక్ష్యాలు, ఆశయాలపై దృష్టి పెట్టేందుకు సన్నద్ధమవుతాం.. థ్యాంక్యూ!!

హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌ స్వీట్‌ కపుల్!


Advertisement


మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని