ఆన్‌లైన్‌ దొంగల్ని ఎలా పట్టుకోవాలో నేర్పుతోంది! - kamakshi sharma enters the world book of records for raising awareness on cybercrimes
close
Updated : 02/07/2021 20:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆన్‌లైన్‌ దొంగల్ని ఎలా పట్టుకోవాలో నేర్పుతోంది!

Photo: Twitter

కరోనా కాలంలో అందరూ ‘ఆన్‌లైన్‌’ బాట పట్టారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో భాగంగా పెద్దలు...డిజిటల్‌ తరగతుల కోసం పిల్లలు...ఇలా ఏదో ఒక విధంగా నిత్యం అంతర్జాలంలోనే గడుపుతున్నారు. అయితే ఇదే అదనుగా కొందరు సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పక్కదారి పట్టిస్తూ మార్ఫింగ్‌ ఫొటోలు, వీడియోలతో స్త్రీలను వేధిస్తున్నారు. ఖాతాదారులకు తెలియకుండానే వారి అకౌంట్ల నుంచి డబ్బు కాజేస్తున్నారు. మాయమాటలు చెప్పి ఇంకా ఎన్నెన్నో మోసాలు, దురాగతాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఆన్‌లైన్‌ మోసాలపై అవగాహన కల్పిస్తూ, ఈ అంశంపై శిక్షణనిస్తూ అందరి మన్ననలు అందుకుంటోంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల కామాక్షి శర్మ. సాంకేతిక పరిజ్ఞానంపై మంచి పట్టున్న ఈ యువతి.. సుమారు 30 నగరాల్లో పర్యటించి, సైబర్‌ నేరాల నియంత్రణపై 50వేల మంది పోలీసులకు శిక్షణ ఇచ్చింది. ఇలా తన కృషికి గుర్తింపుగా ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో ఇటీవలే చోటు దక్కించుకుంది.

హ్యాక్‌ చేసి ఆటపట్టించాను!

యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన కామాక్షికి చిన్నప్పటి నుంచే టెక్నాలజీ అంటే అమితాసక్తి. అందుకు తగ్గట్లే ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. చదువుకునే రోజుల్లోనే తన స్నేహితుల ఈ-మెయిల్స్‌ ఖాతాల వివరాలను హ్యాక్‌ చేసి ఆట పట్టించిన ఆమె... ఆతర్వాత అందులోనే తన కెరీర్‌ను వెతుక్కుంది. ‘2017లో బీటెక్‌ చదివేటప్పుడు ఘజియాబాద్‌కు చెందిన కొంతమంది పోలీసులు నన్ను సంప్రదించారు. దొంగలించిన మొబైళ్ల ఐపీ అడ్రస్‌, ఇతర సమాచారం కనుక్కోవడంలో వారితో సహకరించాలని కోరారు. అప్పుడే నా సైబర్‌ మిషన్‌ గురించి పోలీసులకు చెప్పాను. మొదటగా అమ్మాయిలకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పిద్దామని నిర్ణయించుకున్నాం. ఇందుకోసం స్కూళ్లు, కళాశాలల్లో వరుసగా క్యాంపెయిన్లు నిర్వహించాను. ఈక్రమంలోనే పోలీసు శాఖలోని సైబర్‌ క్రైమ్‌ సెల్‌ సహకారంతో  మరిన్ని సాంకేతిక మెలకువలు నేర్చుకున్నాను.’

మనమెందుకు వాళ్లని పట్టుకోకూడదు!

‘సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ కొంతమంది ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నారు. మరి అదే టెక్నాలజీని ఉపయోగించి పోలీసులు ఎందుకు ఆ మోసగాళ్లను పట్టుకోకూడదు?’ ఈ ఆలోచనతోనే నా సైబర్‌ మిషన్‌ మొదలైంది. దిల్లీ ఏసీపీ రాజ్‌పాల్‌ దాబస్‌ సర్‌ సహాయంతో 2019 సెప్టెంబర్‌లో ఈ మిషన్‌ను ప్రారంభించాను. ఇప్పటివరకు జమ్మూ కశ్మీర్‌, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, దిల్లీ, మహారాష్ట్ర, కన్యాకుమారి... వంటి దాదాపు 30 నగరాల్లో సుమారు 50 వేలమంది పోలీసులకు సైబర్‌ క్రైమ్‌ నియంత్రణపై శిక్షణనిచ్చాను. పలు దర్యాప్తు ఏజెన్సీలు, సంస్థలు, ఆర్మీ అధికారులతో కూడా కలిసి పనిచేస్తున్నాను.’

అదే నా కోరిక!

‘సైబర్‌ నేరాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడాలంటే ప్రపంచ దేశాల సైబర్‌ క్రైం బృందాలన్నీ ఒకే తాటిపైకి రావాలి. దీంతోపాటు నేరస్థులకు సంబంధించిన గత ట్రాక్‌ రికార్డులు, ఈ నేరాల్ని తుడిచిపెట్టే అస్త్రాలన్నీ వారి దగ్గర ఉండాలి. అప్పుడే ఆన్‌లైన్‌ దొంగల కంటే మనం ఒక అడుగు ముందుంటాం. నా లక్ష్యం కూడా ఇదే. ప్రభుత్వం సహకరిస్తే త్వరలోనే ఈ పనికి శ్రీకారం చుడదామనుకుంటున్నాను..’ అంటూ తన సైబర్‌ మిషన్‌ గురించి చెప్పుకొచ్చింది కామాక్షి.

తన ప్రతిభా పాటవాలు, నైపుణ్యంతో సైబర్‌ నేరాలను కట్టడి చేసేందుకు కృషి చేస్తోన్న కామాక్షి గతంలో ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించుకుంది. ఇటీవలే ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ చోటు దక్కించుకుంది.


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని