యాసిడ్ దాడికి గురై, 53 ఆపరేషన్లయినా తను యోగా వల్లే కోలుకుంది! - kangana shared the inspiring yoga stories of her family through social media posts in telugu
close
Updated : 21/06/2021 16:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యాసిడ్ దాడికి గురై, 53 ఆపరేషన్లయినా తను యోగా వల్లే కోలుకుంది!

శారీరక, మానసిక సమస్యల్ని నయం చేసే యోగాకు కాలిన గాయాలను మాన్పే శక్తి కూడా ఉందంటోంది బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌. ఆమ్ల దాడికి గురై తీవ్ర గాయాల పాలైన తన అక్క రంగోలీ.. ఆ ప్రమాదం నుంచి బయటపడి తిరిగి మామూలు మనిషిగా మారిందంటే అదంతా యోగా వల్లే అంటోంది. అంతేకాదు.. యోగాను జీవనశైలిలో భాగం చేసుకొని తన తల్లిదండ్రులు కూడా పలు ఆరోగ్య సమస్యల్ని జయించారని చెబుతోంది. ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సందర్భంగా తన కుటుంబంలోని యోగా స్ఫూర్తిదాయక కథనాల్ని వరుస సోషల్‌ మీడియా పోస్టుల రూపంలో పంచుకుందీ బాలీవుడ్‌ క్వీన్‌. మరి, ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

కంగనా రనౌత్‌-రంగోలీ చందేల్‌.. వీరిద్దరిదీ అక్కచెల్లెళ్లకు మించిన అందమైన అనుబంధం. ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ ఒకరికొకరు తోడుగా నిలుస్తూ తమ ఫ్యాన్స్‌కు ఆదర్శంగా నిలుస్తుంటారు. కొన్నేళ్ల క్రితం తన అక్క రంగోలీపై ఆమ్లదాడి జరిగిన సమయంలోనూ తను అనుక్షణం ఆమె పక్కనే ఉంటూ ధైర్యం నింపిన సంగతి ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే పలు సందర్భాల్లో పంచుకున్న విషయం తెలిసిందే! అయితే రంగోలీ ఆ దాడి నుంచి పూర్తిగా కోలుకోవడానికి యోగా ఎంతగానో సహకరించిందంటూ తాజాగా కంగన ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది. అంతేకాదు.. రంగోలీ యోగా కథ చాలామందికి స్ఫూర్తిదాయకం అంటోంది కంగన.

పెళ్లి రద్దైనా బాధపడలేదు!
ఈ క్రమంలో రంగోలీ యోగాసనాలు వేస్తోన్న ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకున్న కంగన.. ‘అప్పుడు మా అక్క రంగోలీకి 21 ఏళ్లుంటాయనుకుంటా.. ఆ సమయంలో ఓ ఆకతాయి ఆమెపై ఆమ్లదాడి చేశాడు. దీంతో ఆమె ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. సగం ముఖం కాలిపోయింది.. ఓ కన్ను చూపు కోల్పోయింది.. చెవి పూర్తిగా కరిగిపోయింది.. ఛాతీ చాలా వరకు డ్యామేజ్‌ అయింది. రెండు మూడేళ్లలోనే దాదాపు 53 సర్జరీలయ్యాయంటే తనపై జరిగిన దాడి తీవ్రతను మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ప్రమాదంతో తను శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఎంతో డిస్టర్బ్‌ అయ్యింది. మాతో మాట్లాడడమే మానేసింది.. తన ముందు ఏం జరిగినా అలా చూస్తూ ఉండిపోయేది తప్ప.. మరో మాట మాట్లాడేది కాదు. అప్పటికే ఓ ఐఏఎఫ్‌ అధికారితో అక్క పెళ్లి నిశ్చయమైంది. అయితే ఆమ్లదాడి తర్వాత వాళ్లు వివాహం రద్దు చేసుకున్నా ఆమె ఇసుమంతైనా బాధపడలేదు.. ఇలా మానసికంగా చలనం లేని అక్కను చూడలేకపోయా. డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్తే ఆమె షాక్‌లో ఉందని చెప్పారు. మందులిచ్చారు.. ఎన్నో థెరపీలు చేశారు.. అయినా ఫలితం కనిపించలేదు.

యోగా తనలో మార్పు తెచ్చింది!
అయితే ఆ సమయంలో నేను మా యోగా గురువు వద్ద యోగా నేర్చుకుంటున్నా. మానసిక సమస్యలకు, కాలిన గాయాలకు, రెటీనా ట్రాన్స్‌ప్లాంట్‌ రికవరీ అయ్యే క్రమంలో, కంటి చూపు కోల్పోయిన వారికి.. కూడా యోగ సాధన సహాయపడుతుందని తెలుసుకున్న నేను.. అప్పట్నుంచి నేను ఎక్కడికెళ్లినా అక్కను నాతో పాటే తీసుకెళ్లేదాన్ని. యోగా క్లాసులకు కూడా నాతో వెంటబెట్టుకెళ్లేదాన్ని. అలా క్రమంగా తను కూడా యోగాపై దృష్టి పెట్టింది. వివిధ రకాల ఆసనాలు సాధన చేయడం ప్రారంభించింది. ఎన్ని చికిత్సలకైనా లొంగని అక్క మనసు యోగా వల్ల క్రమంగా మారడం మొదలైంది. దాంతో తనలో కలిగే ప్రతి బాధనూ నాతో పంచుకోవడం ప్రారంభించింది.. అప్పటిదాకా షాక్‌లో ఉన్న తను నాతో సరదాగా గడపడం మొదలుపెట్టింది. అంతేకాదు.. యాసిడ్‌ దాడి వల్ల తను కోల్పోయిన కంటి చూపును సైతం తిరిగి పొందిందంటే అది యోగా వల్లే అని చెప్తా. అందుకే నన్నడిగితే.. అన్ని ప్రశ్నలకు యోగానే సమాధానం.. అన్ని అనారోగ్యాలకు యోగానే విరుగుడు! మీరు కూడా మీ జీవితంలో యోగాకు ఒక్క ఛాన్స్‌ ఇచ్చి చూడండి!’ అంటూ తన సోదరి స్ఫూర్తిదాయక స్టోరీని పంచుకుందీ బాలీవుడ్‌ క్వీన్.

అమ్మ ఆ సమస్యల నుంచి కోలుకుంది!
తన అక్క రంగోలీనే కాదు.. తన కుటుంబం పూర్తి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండడానికీ యోగానే కారణం అంటోందీ బాలీవుడ్‌ బ్యూటీ. ఈ వ్యాయామం వల్లే తన తల్లిదండ్రులు సైతం పలు అనారోగ్యాల నుంచి బయటపడ్డారని చెబుతోంది. ఈ క్రమంలో వారిద్దరూ యోగాసనాలు వేస్తోన్న ఫొటోల్ని పంచుకున్న కంగన.. వాళ్ల యోగా స్టోరీస్‌ని సైతం ఓ సుదీర్ఘ పోస్ట్‌ రూపంలో రాసుకొచ్చింది.
‘కొన్నేళ్ల క్రితం మా అమ్మ మధుమేహం, థైరాయిడ్‌, అధిక కొలెస్ట్రాల్‌ (600).. వంటి పలు అనారోగ్యాలతో బాధపడేది. దీంతో గుండెలో బ్లాక్‌ ఉందని, ఆమెకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారు. కానీ అమ్మకు అలా చేయడానికి నా మనసు ఒప్పుకోలేదు. అందుకే అమ్మతో రోజూ యోగా సాధన చేయించా.. తను కూడా నాపై పూర్తి నమ్మకం ఉంచింది. ఇక సర్జరీ అవసరం లేకుండానే సమస్య తీరిపోయింది. అంతేకాదు.. అప్పట్నుంచి ఇప్పటిదాకా తనకు ఎలాంటి అనారోగ్యం తలెత్తలేదు.. ఇప్పుడు మా ఇంట్లో పూర్తి ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నది ఎవరంటే అది అమ్మే!
ఇక నాన్నకు కూడా వాకింగ్‌ ఎక్కువగా చేయడం వల్ల కీళ్ల సమస్యలొచ్చాయి. దాంతో తన దృష్టినీ యోగా వైపు మళ్లించా. నాన్న కూడా ఎంతో ఉత్సాహంగా యోగాసనాలు వేయడం ప్రారంభించారు. ఇప్పుడు తను ఏ సమస్యా లేకుండా నడవగలరు.. జాగింగ్‌ కూడా చేయగలరు. ఇలా నేను నా కుటుంబానికి యోగాను గొప్ప బహుమతిగా ఇచ్చానని గర్వంగా చెప్పగలను. ఇప్పటికీ నేను ఉదయాన్నే వారిని అడిగే తొలి ప్రశ్న ఏంటంటే.. ‘ఈ రోజు యోగా చేశారా?’ అని!’ చెబుతూ తన ఫ్యాన్స్‌ని కూడా కుటుంబంతో సహా యోగా చేయమని కోరుతోంది
.

కంగన చెప్పిన యోగా స్టోరీస్‌ చదువుతుంటే మీ జీవితంలో యోగా తెచ్చిన మార్పులు, యోగ సాధనతో వివిధ అనారోగ్యాల్ని దూరం చేసుకున్న అనుభవాలు గుర్తొస్తున్నాయా? అయితే ఆలస్యమెందుకు..? వాటిని మాతో పంచుకోండి.. మీ అనుభవాలు, సలహాలు, సూచనలు.. ఇతరుల్లోనూ స్ఫూర్తి నింపచ్చు..!


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని