ఈ చిట్కాలతో 15 కిలోలు తగ్గా! - khushbu saundar on her weight loss transformation
close
Published : 16/10/2021 16:09 IST

ఈ చిట్కాలతో 15 కిలోలు తగ్గా!

ఖుష్బూ సుందర్‌... దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో నటిగా, నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సుమారు 200కు పైగా చిత్రాల్లో నటించిందీ అమ్మడు. తన అందం, అభినయంతో అశేష అభిమానులను సొంతం చేసుకుంది. భర్త సుందర్‌తో కలిసి సొంత నిర్మాణ సంస్థను స్థాపించి పలు సినిమాలు కూడా తెరకెక్కిస్తోంది. ఇక పలు టీవీ షోలు, కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరిస్తోంది.

15 కిలోలు తగ్గానంతే!

సినిమా రంగంతో పాటు రాజకీయాల్లోనూ రాణిస్తోన్న ఖుష్బూ గతంలో ఎంతో బొద్దుగా ఉండేదన్న సంగతి అందరికీ తెలుసు. అయితే ఐదు పదుల వయసున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల సన్నజాజి తీగలా మారిపోయింది. భారీగా బరువు తగ్గి తన అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. లాక్‌డౌన్‌లో అధిక బరువును తగ్గించుకున్న ఆమె ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తన మేకోవర్‌కు సంబంధించిన ఫొటోలు తరచూ పంచుకుంటోంది. బరువు తగ్గడానికి ముందు, ఇప్పుడు తీసుకున్న ఫొటోలను కొలేజ్‌ చేసి ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఖుష్బూ... ‘అప్పటికీ.. ఇప్పటికీ పెద్దగా వ్యత్యాసమేమీ లేదు. కేవలం 15 కిలోలు తగ్గానంతే..!’ అని సరదాగా క్యాప్షన్‌ రాసుకొచ్చింది.

బిరియానీ, ఐస్‌క్రీం తినడం మానేశాను!

ఈటీవీలో ‘ఢీ’ మాదిరిగానే తమిళంలో ‘డ్యాన్స్‌ వర్సెస్‌ డ్యాన్స్‌’ పేరుతో నిర్వహించే డ్యాన్స్‌ రియాలీటీ షో ఎంతో గుర్తింపు పొందింది. ఇప్పటికే మొదటి సీజన్‌ పూర్తిచేసుకున్న ఈ కార్యక్రమం రెండో సీజన్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఖుష్బూతో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్‌ బృందా మాస్టర్‌ దీనికి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఖుష్బూ తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
‘సుందర్‌తో పెళ్లైనప్పటి నుంచి నేను 20 కిలోల బరువు పెరిగాను. దీంతో చాలా బొద్దుగా మారిపోయాను. లాక్‌డౌన్‌లో సినిమా షూటింగులు లేకపోవడంతో ఖాళీ సమయం దొరికింది. దీంతో అదనపు బరువును కరిగించుకుందామని గట్టిగా నిర్ణయించుకున్నాను. అయితే అది అంత సులభం కాదని, అలాగనీ అసాధ్యమూ కాదన్న విషయం నాకు తెలుసు. ఇందులో భాగంగా లాక్‌డౌన్‌లో కొన్ని కఠినమైన డైట్ నియమాలు పాటించాను. నేను ఫుడ్‌ లవర్‌ని కాకపోయినా బిరియానీ, ఐస్‌క్రీంలు బాగా తింటాను. అయితే బరువు తగ్గడం కోసం వాటిని పూర్తిగా దూరం పెట్టాను. యోగాసనాలు చేశాను. క్రమం తప్పకుండా రోజూ 40 నిమిషాల పాటు వాకింగ్‌ చేశాను. అలా నేను అనుకున్న లక్ష్యానికి క్రమంగా చేరువవుతున్నా. ప్రస్తుతం నా పెళ్లి వేడుకల సమయంలో వేసుకున్న దుస్తుల్లో కూడా పర్‌ఫెక్ట్‌గా ఫిట్ అవుతున్నా’ అని చెప్పుకొచ్చింది.

ఇంటి పనులన్నీ నేనే చేసుకున్నాను!

ఇదే కాక ఇటీవల కొన్ని సందర్భాల్లో కూడా తన వెయిట్‌లాస్‌కు సంబంధించిన పలు విషయాలు షేర్‌ చేసుకుంది ఖుష్బూ. ‘గత ఏడాది నవంబర్‌లో నా బరువు 92 కిలోలు. ప్రస్తుతం 15 కిలోల బరువును తగ్గించుకున్నాను. అయితే ఈ మార్పు రాత్రికి రాత్రి వచ్చిందేమీ కాదు. లాక్‌డౌన్‌లో సుమారు 70 రోజుల పాటు ఇంటి పనులన్నీ నేను ఒక్కదాన్నే చేసుకున్నా. ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం, పాత్రలు కడగడం, లాండ్రీ పనులు, గార్డెనింగ్‌.. ఇలా ప్రతి పనీ నేనే చేసుకున్నా. నా బరువును తగ్గించడంలో కొన్ని వర్కవుట్లు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా వాకింగ్‌, కొన్ని యోగాసనాలు, ప్లాంక్‌ వ్యాయామాలు.. నా జీవితంలో భాగమైపోయాయి. మన కఠిన శ్రమ మంచి ఫలితాన్నిచ్చినప్పుడు ఆ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేం. ఇంతటితో నా ప్రయాణం ఆగదు. మరిన్ని కిలోలు తగ్గి 69కి చేరుకోవాలన్నదే నా లక్ష్యం. త్వరలో ఇది పూర్తవుతుందని భావిస్తున్నాను’ అని చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

2018లో విడుదలైన ‘అజ్ఞాత వాసి’ సినిమాలో చివరిగా కనిపించింది ఖుష్బూ. ప్రస్తుతం ఆమె ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ అనే తెలుగు సినిమాతో పాటు రజనీకాంత్‌ ‘అన్నాత్తె’ చిత్రంలోనూ నటిస్తోంది.


Advertisement


మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని