బరువు పెరిగినా సరే.. నన్ను నేను ప్రేమించుకుంటున్నా! - kishwer merchant pens strong note on embracing her body after pregnancy
close
Updated : 11/06/2021 19:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బరువు పెరిగినా సరే.. నన్ను నేను ప్రేమించుకుంటున్నా!

గర్భధారణ అనేది మహిళల జీవితంలో అత్యంత కీలకమైన దశ. ఈ సమయంలో వారు శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులకు లోనవుతుంటారు. ప్రత్యేకించి గర్భం ధరించిన మహిళలు కొంతమంది అనూహ్యంగా బరువు పెరిగిపోతుంటారు. అందుకు కారణాలేవైనా... చాలామంది బరువు పెరిగిన తమ శరీరాన్ని చూసి తమలో తామే మధనపడుతుంటారు. అనవసర ఒత్తిడి, భయాందోళనలకు గురవుతుంటారు. ఈ క్రమంలో గర్భం ధరించాక తాను కూడా ఇలాగే భయపడ్డానంటోంది ప్రముఖ టీవీ నటి కిష్వర్ మర్చంట్. బరువు తగ్గించుకుని మళ్లీ మామూలు స్థితికి రాగలనా?అన్న సందేహాలు తనలో తలెత్తాయంటోంది. అయితే అమ్మయ్యే ప్రతి మహిళకు ఇది సహజమేనంటూ.. ప్రస్తుతం తన అధిక బరువును ఆస్వాదించే పనిలో ఉన్నానంటూ ఓ స్ఫూర్తిదాయక పోస్ట్‌ను షేర్‌ చేసిందీ అందాల తార.

‘శక్తిమాన్‌’ సీరియల్‌తో బాలీవుడ్‌ బుల్లితెరకు పరిచయమైంది కిష్వర్ మర్చంట్. మొదటి సీరియల్‌తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘హిప్‌ హిప్‌ హుర్రే’, ‘ఏక్ హసీనా థీ’, ‘ఇత్నా కరో నా ముఝే ప్యార్‌’, ‘కసౌటి జిందగీ కే’, ‘ధడ్‌కన్‌’, ‘కావ్యాంజలి’, ‘అక్బర్‌ బీర్బల్‌’, ‘ఛోటీ బహూ’ వంటి ధారావాహికలతో పాటు ‘బిగ్‌బాస్‌’, ‘బాక్స్‌ క్రికెట్‌ లీగ్‌’, ‘కామెడీ నైట్స్‌ బచావో’ వంటి రియాలిటీ షోలతో ప్రేక్షకులకు బాగా చేరువైంది. 

చిన్నవాడితో వివాహం!
బాలీవుడ్‌ బుల్లితెరకు సంబంధించి డేరింగ్ లేడీగా గుర్తింపు తెచ్చుకుంది కిష్వర్‌. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఆమె ఎంతో నిక్కచ్చిగా వ్యవహరిస్తుంది . ఏ విషయమైనా సూటిగా మాట్లాడుతుంది. ఈ క్రమంలో తన వ్యక్తిగత జీవితం కారణంగా పలుసార్లు వార్తల్లో నిలిచిందీ బుల్లితెర బ్యూటీ. తనకంటే వయసులో ఎనిమిదేళ్లు చిన్నవాడైన నటుడు సుయాష్‌ రాజ్‌ను ఆమె వివాహం చేసుకుంది. 2010లో వచ్చిన ‘ప్యార్‌ కి యే ఏక్‌ కహానీ’ సీరియల్‌లో జంటగా నటించిన వీరు.. అప్పటి నుంచే ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకున్నారు. అలా ఆరేళ్ల పాటు ప్రేమలో గడిపిన ఈ లవ్‌బర్డ్స్‌ 2016 డిసెంబర్‌లో పెళ్లిపీటలెక్కారు. 

40 ఏళ్ల వయసులో.. 
తమ ప్రేమ బంధానికి ప్రతీకగా ఈ ఏడాది ఆగస్టులో పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది కిష్వర్. తాను తల్లి కాబోతున్న శుభవార్తను ఈ ఏడాది మార్చి 2న మొదటిసారిగా ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. అప్పుడామె వయసు 40 ఏళ్లు కావడం గమనార్హం. 
‘వయసు అనేది ఒక అంకె మాత్రమే. నేను 40 ఏళ్ల వయసులో సహజంగా గర్భం ధరించాను. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలా లేటు వయసులో ప్రెగ్నెన్సీ ధరించడంలో ఏమైనా సమస్యలున్నాయేమోనని డాక్టర్‌ని కూడా కలిశాను. ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. అమ్మగా ప్రమోషన్‌ పొందేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. అయితే మొదటిసారిగా గర్భం దాల్చడంతో ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మొదట్లో అసలు అర్థం కాలేదు. కానీ అదృష్టవశాత్తూ నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు నాకు తోడుగా ఉన్నారు ’అని చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

ఆలోచనా ధోరణిని మార్చుకున్నా!
సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే కిష్వర్‌... తన ప్రెగ్నెన్సీ డైట్‌, మెటర్నిటీ ఫ్యాషన్ల గురించి ఎప్పటికప్పుడు షేర్‌ చేసుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా తన ప్రెగ్నెన్సీ అనుభవాలను పంచుకుంటూ ఇన్‌స్టాలో మరో పోస్ట్‌ పెట్టింది. 
‘గర్భం ధరించిన మొదట్లో బరువు పెరుగుతానేమోనని నేనూ తీవ్రంగా ఆలోచించేదాన్ని. అధిక బరువును తగ్గించుకోగలనా? మళ్లీ మామూలు స్థితికి రాగలనా? అన్న సందేహాలు తలెత్తాయి. అయితే కొన్ని రోజులయ్యాక నా ఆలోచనా ధోరణిని మార్చుకున్నాను. తల్లయ్యే ప్రతి మహిళకు ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయని అర్థం చేసుకున్నాను. అప్పటి నుంచి నా అధిక బరువును ఆస్వాదించడం ప్రారంభించాను. ఎలా ఉన్నా నన్ను నేను స్వీకరించుకుంటున్నాను... నా శరీరాన్ని ప్రేమించుకుంటున్నాను. నా శక్తి సామర్థ్యాలేంటో నాకు పూర్తిగా తెలుసు. ప్రసవం తర్వాత బరువు తగ్గి మళ్లీ నేను సాధారణ స్థితికి రాగలనన్న గట్టి నమ్మకం నాకుంది. నా మార్పును చూసి పుట్టబోయే నా బిడ్డ కూడా గర్వపడతాడు’ అని కాబోయే అమ్మలందరిలో స్ఫూర్తి నింపిందీ బుల్లితెర బ్యూటీ.


మరిన్ని

యోగాలో ఈ పొరపాట్లు దొర్లకుండా..!

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అధిక పనితో అలసిపోయిన శరీరాన్ని శక్తిమంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ ఒకేసారి సాధ్యమైతే.. అంతకంటే ఆనందమేముంటుంది చెప్పండి.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా సంపూర్ణ దృఢత్వాన్ని సాధించవచ్చు. ఇందుకు సహకరించే ప్రక్రియే 'యోగా'. అయితే ఈ యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఫలితంగా యోగా చేసిన ఫలం దక్కకుండా పోతుంది. మరి ఆ పొరపాట్లేంటో ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని