పేర్లు వేరైనా... అన్నీ ఆ 'అమ్మ' అనుగ్రహం కోసమే! - lakshmi vratham in india
close
Published : 20/08/2021 14:06 IST

పేర్లు వేరైనా... అన్నీ ఆ 'అమ్మ' అనుగ్రహం కోసమే!

'వరలక్ష్మీ వ్రతం' తెలుగింటి ఆడపడుచులందరికీ బాగా పరిచయమున్న సౌభాగ్యవ్రతం. అష్టలక్ష్మి అనుగ్రహాన్ని పొందాలని ఈ వ్రత దీక్ష చేపట్టిన రోజున ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతాన లక్ష్మి, ధైర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి అని ఎనిమిది పేర్లు గల శ్రీ మహావిష్ణువు సతి అయిన లక్ష్మీదేవిని భక్తిపూర్వకంగా కొలుస్తూ, సకల అరిష్టాలను దూరం చేయాలని ఆ అమ్మను వేడుకుంటారు. ఇదే విధంగా మనదేశంలోని వివిధ రాష్ట్రాల్లో వరలక్ష్మీ వ్రతాన్ని పోలిన పూజలు, వ్రతాలను పర్వదినంగా జరుపుకోవడం ఆనవాయితీగా ఉంది.

మహాలక్ష్మి వ్రతం..

తెలుగువారు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తున్న విధంగానే ఉత్తరాది మహిళలు 'మహాలక్ష్మి వ్రతాన్ని' జరుపుకొంటారు. ప్రధానంగా బిహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భాద్రపద మాసం శుక్లపక్షంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. భవిష్య పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ వ్రతం గురించి విశదీకరించి చెప్పినట్లు ఓ కథ ఉంది. ఈ రోజున పసుపు, కుంకుమతో 'స్వస్తిక్' ఆకారాన్ని చిత్రించి అందులో నాలుగు రేఖలను నాలుగు వేదాలుగా భావించి పూజ చేయడం 'మహాలక్ష్మి వ్రతం' లోని ప్రత్యేకత. ఈ వ్రత సందర్భంగా వివిధ రకాల పూలతో తోరణాలు కట్టి మహాలక్ష్మికి స్వాగతం పలకడం విశేషం. సాధారణంగా ఉత్తరాదిలో దీపావళి సందర్భంగా చేసే 'లక్ష్మీ పూజ'కు విశేష ప్రాధాన్యం ఉన్నప్పటికీ, మహాలక్ష్మి పూజను కూడా చాలా చోట్ల భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం గమనార్హం.

కలశం పూజ..

వరలక్ష్మీ వ్రతాన్ని పోలిన మరో పర్వదినమే కేరళలో జరుపుకొనే 'కలశం పూజ'. మనం వ్రతం చేసేటప్పుడు పూర్ణకుంభాన్ని ఎలా వాడతామో, ఎలా కలశాన్ని తయారు చేస్తామో, కేరళలో కూడా అలాగే కలశాన్ని తయారుచేసే సంప్రదాయం ఉంది. ఈ కలశాన్ని బియ్యంతో నింపి, పైన నీళ్లు చల్లి నిమ్మకాయను పెడతారు. అలాగే కొన్ని నాణేలను కూడా అందులో వేస్తారు. ఈ శుభదినాన కేరళ ప్రాంతంలోని మదియన్ కులూమ్ ఆలయంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. స్వర్ణాభరణాలతో లక్ష్మీదేవిని అలంకరించే సంప్రదాయం కూడా ఈ పూజలో కనిపిస్తుంది. ఈ పూజ చేయడం ద్వారా అష్టలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

శరత్ పూర్ణిమ..

శరత్ పూర్ణిమ సాధారణంగా సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో వస్తుంది. గుజరాత్, పశ్చిమ బంగ, ఒడిశా.. తదితర రాష్ట్రాల్లో ఈ పండగ సందర్భంగా లక్ష్మీదేవిని పూజించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 'శరత్ పూర్ణిమ'ను పురస్కరించుకొని భక్తులు రాత్రిళ్లు జాగారం కూడా చేస్తుంటారు. లక్ష్మీదేవి 'శరత్ పూర్ణిమ' నాడు రాత్రివేళ ప్రతి ఇంటి గడప దగ్గరకు వస్తుందని ఒక నమ్మకం ఉంది. ఒడిశాలో 'గజలక్ష్మీ పూజ' గాను, గుజరాత్ ప్రాంతంలో 'వైభవ లక్ష్మి పూజ' గాను లక్ష్మీదేవిని పూజిస్తారు.

కొజగరి లక్ష్మీ పూజ..

పశ్చిమ బంగ రాష్ట్రంలో దుర్గాపూజ జరిగిన కొన్ని రోజుల తర్వాత లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేకంగా మరో పూజను చేస్తారు. వివిధ మంత్రాలతో లక్ష్మీదేవికి పుష్పాంజలి ఘటిస్తూ, కుటుంబ సమేతంగా ఈ పూజను జనులందరూ జరుపుకొంటారు.

వరమహాలక్ష్మి పూజ

'వరమహాలక్ష్మి పూజ'ను కర్ణాటక ప్రాంతంలోని ప్రజలు జరుపుకొంటారు. తెలుగువారు 'వరలక్ష్మీ వ్రతాన్ని' చేస్తున్న సందర్భంలోనే, ఆ మాసంలోనే కన్నడిగులు కూడా ఈ పండగను చేసుకోవడం విశేషం. ఈ పూజ కూడా దాదాపుగా మన తెలుగువారు చేసే వరలక్ష్మీ వ్రతాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ తోరాలు కట్టుకునే పద్ధతిని అక్కడ 'రక్ష' అంటారు. అలాగే ఒబ్బట్టు, పులియోగరె, హుళి అన్న, పాయస లాంటి వంటకాలను కన్నడిగులు నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు.

లక్ష్మీదేవి కరుణా కటాక్షాల కోసం వివిధ రాష్ట్రాల్లోని ప్రజలు వేరు వేరు పేర్లతో ఆచరించే పూజలు, వ్రతాలు ఇవీ! సంప్రదాయాలు, సంస్కృతులు భిన్నమైనా అందరి సంకల్పం మాత్రం ఈ దేవి ఆశీస్సులు అందుకోవడమే!మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని