ఆ లీలా కృష్ణుడిని ఆదర్శంగా తీసుకుందాం..! - lessons to learn from lord krishna life in telugu
close
Updated : 30/08/2021 15:34 IST

ఆ లీలా కృష్ణుడిని ఆదర్శంగా తీసుకుందాం..!

చిన్నతనంలో వెన్న దొంగిలించినా.. గోపాలురందరినీ రక్షించాడు. గోపికల వస్త్రాలు దోచుకున్నా.. ద్రౌపదికి చీరలిచ్చి ఆమె ఆత్మగౌరవాన్ని కాపాడాడు. అయితే ఆ లీలాకృష్ణుడి లీలలను గమనిస్తే ఆయన చేసిన తుంటరి చిలిపి పనుల్లోనూ ఓ నిగూఢార్థం కనిపిస్తుంది. కన్నయ్యగా వన్నెచిన్నెలతో ఆకట్టుకునే వయసు నుంచే ఆయన ఎన్నో అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. తన జీవితం ద్వారా ఎంతోమందికి ఎన్నో పాఠాలను నేర్పాడు. అవి అప్పటి కాలానికే కాదు.. కాలమాన స్థితిగతులు పూర్తిగా మారిపోయినా ఇప్పటికీ మన జీవితాలకు వర్తింపజేసుకోవడానికి వీలున్నవే..! మరి, చిన్నికృష్ణుడి జీవితం నుంచి మనం నేర్చుకోదగిన కొన్ని పాఠాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...

ఆసక్తులను వదలొద్దు..

చిన్నతనం నుంచే కన్నయ్యకు వేణువంటే ఎంతో ఇష్టం. గోవులను కాస్తూ.. దొరికిన సమయాన్నంతా వేణువు వూదుతూనే గడిపేవాడు. దాన్ని వినేందుకు ఆయన స్నేహితులు కూడా ఎంతో ఇష్టపడేవారు. ఈ ఇష్టాన్ని జీవితాంతం కొనసాగించాడు కృష్ణుడు.. పెద్దయిన తర్వాత కూడా ఈ ఆసక్తిని తగ్గనివ్వలేదు. రాజ్యపాలన, ఇతర బాధ్యతలతో తలమునకలై ఉన్నా సరే.. ఎప్పుడూ తన వేణుగానాన్ని పక్కన పెట్టలేదు. అంతెందుకు కురుక్షేత్ర యుద్ధంలో రథసారథిగా కొనసాగుతున్న సమయంలోనూ మురళిని తనతో పాటే ఉంచుకున్నాడు. దీన్నిబట్టే ఆయనకు దానిపై ఉన్న ఆసక్తి ఎంతో తెలుస్తుంది. ఆసక్తులు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. కానీ ఉరుకుల పరుగుల జీవితంలో సమయాభావ కారణంగా వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటాం. అందుకే కృష్ణుడి జీవితం నుంచి ఆసక్తులను పక్కన పెట్టొద్దనే పాఠాన్ని నేర్చుకుందాం.. ఎందుకంటే వాటివల్ల జీవితంలో ఒత్తిడి కూడా తగ్గుతుంది..

నిజమైన స్నేహితుడిగా..

చిన్ననాటి స్నేహితులు, వారితో చేసిన అల్లరి ఇవన్నీ గుర్తొస్తే ఎవరికైనా కళ్లలో నీళ్లు తిరగకమానవు. అయితే బిజీ జీవితంలో ఇంట్లోవాళ్లతోనే మాట్లాడేందుకు సమయం ఉండదు. ఇక స్నేహితులతో సంబంధబాంధవ్యాలను కొనసాగించే వారిని వేళ్లపై లెక్కించవచ్చు. కానీ కృష్ణుడి జీవితాన్ని గమనిస్తే ఆయన స్నేహితులను కుటుంబంతో సమానంగా ప్రేమించాడు. చిన్ననాటి స్నేహితుడైన సుధాముడు (కుచేలుడు) తనను కలుసుకోవడానికి వచ్చినప్పుడు తెచ్చిన అటుకులను అమృతంతో సమానంగా భావించి తృప్తిగా ఆరగించాడు. స్నేహితుడిని సహాయం అడగడానికి వచ్చి ఆత్మగౌరవం ఒప్పుకోక సుధాముడు అలాగే తిరిగి వెళ్లినా.. చెప్పకుండానే స్నేహితుడి కష్టాలన్నీ తెలుసుకున్నాడు శ్రీకృష్ణుడు. అతడు తిరిగి వెళ్లేలోపే వారి ఇంటి నిండా వెండి, బంగారాలను నింపి అపర కుబేరుడిగా మార్చాడు. అదీ కృష్ణుడికి స్నేహితులంటే ఉన్న ప్రేమ. మనం ఆయనలా చేయలేకపోయినా.. కనీసం స్నేహితులతో మంచిచెడ్డలు పంచుకుంటూ వారికి అవసరంలో సహాయం చేసినా చాలు..

ఒదిగిపోయి ఉండాలి..

కృష్ణుడు నంద మహారాజు కుమారుడు.. ఆయన గోకులానికే పెద్ద.. మరి, ఆయన కుమారుడంటే ఎలా ఉండాలి.. ఎంతటి దర్పాన్ని ప్రదర్శించాలి? కానీ చిన్ని కన్నయ్య మాత్రం అవేవీ లేకుండా సాదాసీదాగా పెరిగాడు. గోపబాలురతో ఆడుకుంటూ, గోపికల కుండలు పగులగొడుతూ అల్లరి చేష్టలు చేసినా అందరూ సమానమేనన్న నిజాన్ని చెప్పకనే చెప్పాడు. కేవలం మనుషులనే కాదు.. పశువులను కూడా మనతో సమానంగా ప్రేమించడం ఆ చిన్నికృష్ణుడికే చెల్లింది. ఇలా తన జీవితం ద్వారా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సత్యాన్ని నేర్పాడు. మధురకు రాజైనా తనవారిని ఎప్పుడూ దూరం పెట్టలేదాయన.. జీవితంలో కొన్ని విజయాలు సాధించగానే విర్రవీగే తత్వాన్ని విడనాడాలని తన జీవితం ద్వారా బోధించాడు ఆ గోపాలుడు.

తల్లిదండ్రులను ప్రేమిస్తూ..

చిన్నతనంలో మనం ఎంత అల్లరి చేసినా దాన్ని భరిస్తూ మనల్ని పెంచారు మన తల్లిదండ్రులు.. అయితే కాస్త ముసలివారవగానే.. వారికి సేవ చేయలేకో, చాదస్తం భరించలేకో లేక మరింకేవైనా కారణాలతోనో వారిని వృద్ధాశ్రమాలకు పరిమితం చేసేవారు ఎంతోమంది.. కానీ తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు చూపించాల్సిన అవసరం ఎంత ఉందో తన జీవితం ద్వారా చెబుతాడా నారాయణుడు. తన జన్మరహస్యం తెలుసుకోగానే చెరలో ఉన్న తల్లిదండ్రులను బయటకు తీసుకురావాలన్న కాంక్షతో తనతో ఉన్నవారందరినీ వదిలి మరీ మధురకు పయనమయ్యాడు. తాను ప్రేమించిన రాధను, గోకులాన్ని, స్నేహితులైన గోపాలురందరినీ వదిలి అక్కడికి వెళ్లి మేనమామ కంసుడిని చంపి తల్లిదండ్రులను చెర నుంచి విడిపిస్తాడు. తల్లిదండ్రుల కోసం దేన్నైనా వదులుకోవడానికి, ఎంతదాకా అయినా వెళ్లడానికి వెనుకాడలేదా దేవకీ నందనుడు..

ఎల్లప్పుడూ చిరునవ్వే..

కష్టాలనేవి భూమిపై జన్మించిన ప్రతిఒక్కరికీ సహజమైనవి.ఎలాంటి కష్టం లేకుండా జీవించేవారు భూమిపై ఎవరూ కనిపించరేమో.. శ్రీకృష్ణుడికి కూడా కష్టాలు ఎదురయ్యాయి. అయితే వాటన్నింటినీ కేవలం చిరునవ్వుతో ఎదుర్కోవడం ఆయన ప్రత్యేకత. చాలామంది చిన్న సమస్య ఎదురవగానే భయపడిపోతుంటారు. కానీ పెద్ద పెద్ద శాపాలు, రాక్షసుల దాడులు, మరెన్నో విపత్తులు ఆ నందనందనుడి జీవితంలో ఎదురయ్యాయి. కానీ వాటిలో దేనికీ ఆయన బెదరలేదు. తన ముఖంపై తొణికిసలాడే చిరునవ్వును ఎప్పుడూ వదలలేదు. చిరునవ్వుతోనే వాటన్నింటినీ ఎదుర్కొని విజయం కూడా సాధించాడు. జీవితంలో ఎన్ని కష్టాలెదురైనా చిరునవ్వే ఆయుధంగా వాటన్నింటినీ ఇట్టే దాటేయొచ్చని తన జీవితం ద్వారా తెలియజేశాడా రాధావల్లభుడు.

చూశారుగా.. ఆ లీలా చిన్నికృష్ణుడి జీవితం ద్వారా మనం నేర్చుకొని, పాటించాల్సిన పాఠాలేంటో.. మరి, మీరూ కృష్ణుడు నేర్పిన ఈ సత్యాలను మీ జీవితంలో అమలు చేస్తారు కదూ..!



మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని