ఈసారి 'వరలక్ష్మీ వ్రతం' ఇలా చేద్దాం! - making arrangements for vara lakshmi pooja in telugu
close
Published : 19/08/2021 16:10 IST

ఈసారి 'వరలక్ష్మీ వ్రతం' ఇలా చేద్దాం!

శ్రావణ మాసంలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో నోచే నోము 'వరలక్ష్మీ వ్రతం'. ఈ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజున పెళ్లయిన మహిళలు ఈ వ్రతం ఆచరిస్తే భర్త, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆయుష్షు బాగుంటాయని ఓ విశ్వాసం. మరి ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంటిని, పూజగదిని, మండపాన్ని ఎలా అలంకరించాలో తెలుసుకుందాం.. రండి..

ఇంటిని ఇంపుగా..

* వీలైతే ఆ రోజు లేదంటే ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి.

* ఇంట్లోని ద్వారాలకు మామిడాకులతో తోరణాలు, పూలదండలు కట్టాలి. ఇంటి చుట్టూ, ముఖద్వారాన్ని లైట్లతో అలంకరించాలి.

* పూజకు ముందు.. తర్వాత అమ్మవారి పాటలను పెట్టుకునేలా ముందే తగిన ఏర్పాట్లు చేసి పెట్టుకోవాలి. దీనివల్ల ఇల్లంతా సందడిగా మారి.. పండగ వాతావరణం నెలకొంటుంది.

మండపం అలంకరణ ఇలా..

ముందుగా మండపాన్ని శుభ్రంగా కడిగి.. దానిపై వరిపిండితో మంచి ముగ్గులు వేయాలి. నాలుగు వైపులా అరటి కొమ్మలు, మామిడాకులతో అలంకరించాలి. ముందుగా మాల కట్టుకొని పెట్టుకున్న పూలదండలను మండపానికి కట్టాలి. తర్వాత మండపానికి లైటింగ్ అరేంజ్‌మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన మండపాన్ని తూర్పుకు అభిముఖంగా ఉంచాలి.

పూజగది..

* పూజగది ఉన్న వారు పూజగదిలో, పూజగది లేనివారు లివింగ్ రూమ్‌లో తూర్పు దిశగా ముందుగా అలంకరించుకున్న మండపాన్ని ఉంచాలి.

* పూజగదిలోని కలశం, కుందులు, మంగళహారతులు.. మొదలైన పూజా పాత్రలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.

* ఈ మండపంపై అరటి ఆకును ఉంచాలి. లేదంటే పళ్లెం అయినా ఉంచొచ్చు. తర్వాత ఆకులో లేదా పళ్లెంలో కొన్ని బియ్యం పోసి సమానంగా పరచాలి.

* ముందుగా పసుపు, కుంకుమతో చుట్టూ బొట్లు పెట్టి అలంకరించిన కలశంలో (బంగారం, వెండి, రాగి.. ఇలా ఏ లోహంతో చేసిన కలశమైనా కావచ్చు.) కొన్ని బియ్యం పోసి దాన్ని ఆకు లేదా పళ్లెంలో పోసిన బియ్యంలో ఉంచాలి.

* కలశంలో ఉన్న బియ్యంలో నిమ్మకాయ, తమలపాకులు, కాయిన్స్.. మొదలైనవి ఉంచాలి. తర్వాత కలశం చుట్టూ మామిడాకులు పెట్టి దానిపై శుభ్రంగా కడిగి, కాస్త పసుపు చల్లిన కొబ్బరి కాయను ఉంచాలి.

* అమ్మవారి విగ్రహాన్ని లేదా ఫొటోను నీట్‌గా తుడిచి నుదుటన కుంకుమ బొట్టు పెట్టాలి. విగ్రహమైతే కంటికి కాటుక కూడా పెట్టొచ్చు. తర్వాత అమ్మను ఎరుపు రంగు బ్లౌజ్ పీస్, ఆభరణాలు, పూలు.. మొదలైన వాటితో అలంకరించాలి.

* ఇలా అలంకరించిన అమ్మవారి ముఖం కలశం వైపు ఉండేలా అమర్చాలి.

* తర్వాత దీపాలు వెలిగించాలి.

* అనంతరం అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి చేసిన పిండి వంటలన్నీ మండపం ముందు ఉంచి పూజ మొదలు పెట్టాలి.

జాగ్రత్తలు తీసుకుంటేనే అమ్మ సంతోషిస్తుంది!

పూజ ముగిసిన తర్వాత వచ్చిన ముత్త్తెదువులందరికీ వాయనాలు ఇవ్వడం అనాదిగా వస్తున్న ఆచారం. వరలక్ష్మీ వత్రం పూర్తయిన తర్వాత 'శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః వాయన దానం సమర్పయామి' అనుకుని నానబెట్టిన శెనగలు, మూడు ఆకులు, వక్క, అరటిపండు, పసుపు, కుంకుమ, గంధం, పువ్వులు, ఎరుపు రంగు జాకెట్ పీస్, తయారు చేసిన పిండి వంటలు.. వీటన్నింటినీ ఒక పళ్లెంలో తీసుకొని.. దానిపై మరో పళ్లెంను ఉంచాలి. దానిపై కొంగు కప్పి.. ముత్త్తెదువుకు బొట్టు పెట్టి.. ఆమెను వరలక్ష్మీ దేవిగా భావించి ఈ వాయనాన్ని అందిస్తారు. ఇలా వాయనాన్ని ఇచ్చేటప్పుడు 'ఇస్తినమ్మ వాయనం..' అని ఇచ్చేవారు, 'పుచ్చుకుంటినమ్మ వాయనం..' అని తీసుకునే వారు అనాలి. ఇలా మూడుసార్లు ఒకరికొకరు చెప్పుకోవాలి. ఈ క్రమంలో ఆమె వద్ద నుంచి ఆశీర్వాదం అందుకోవాలి. ఇలా వాయనాన్ని ముత్త్తెదువుకు సమర్పించడం వల్ల ఇరువురికీ దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ తోడుంటాయని నమ్మకం. అలాగే సామాజిక సంబంధాలు కూడా వృద్ధి చెందుతాయని భావిస్తారు.

అయితే కరోనా నేపథ్యంలో - ఈ వ్రతం చేసేటప్పుడు కూడా అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకోవాలి. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, ముత్తైదువులందరినీ విడివిడి సమయాల్లో పిలిచి వాయనాలు ఇవ్వడం వంటి జాగ్రత్తలు పాటించడం మాత్రం మర్చిపోకండి. సాధ్యమైనంతవరకు హంగు ఆర్భాటాలకు పోకుండా, అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటూ సింపుల్ గా, భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ముగించడానికి ప్రాధాన్యమివ్వండి.

శానిటైజ్ చేయడం మరిచిపోకండి!

అలాగే.. ఇంకో విషయం కూడా గుర్తుంచుకోండి... అమ్మ వారి పూజ కోసం వాడే ప్రతి వస్తువుని, ప్రతి పదార్ధాన్నీ శుభ్రంగా శానిటైజ్ చేయడం మాత్రం మర్చిపోకండి... అలాగే బయట నుంచి అన్ని వస్తువులను తెప్పించడం కాకుండా, సాధ్యమైనంతవరకు ఇంట్లో ఉన్న వాటితోనే పూజ పూర్తి చేయడానికి ప్రయత్నించండి. తద్వారా బయటకు వెళ్లడం తగ్గించి కరోనా నివారణలో మీ వంతు పాత్ర పోషించండి. హంగులు, ఆర్భాటాల కంటే మనలో ఉండే నిజమైన భక్తి శ్రద్ధలనే ఆ అమ్మ కోరుకుంటుంది.. అవి ఉన్నప్పుడే మనల్ని అన్ని రకాలుగా అనుగ్రహిస్తుంది.. కాబట్టి ఈ విషయం గమనించి, హృదయపూర్వకమైన భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని పూజించి ఆ తల్లి కరుణా కటాక్షాలు అందుకోండి!మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని