ఆమె మాటే వారి మనసుకు సాంత్వన! - meet jharkhand woman sumitra who has been working on the health issues of women for a long time
close
Updated : 29/07/2021 17:54 IST

ఆమె మాటే వారి మనసుకు సాంత్వన!

Photo: Twitter

మనసును అల్లకల్లోలం చేసే మానసిక సమస్యల నుంచి తన సోదరిని కాపాడుకోవాలని ఎంతో ప్రయత్నించిందామె. చికిత్స కూడా ఇప్పించింది. కానీ అవగాహన లోపం, తొందరపాటు నిర్ణయాలతో తన చెల్లి నిండు జీవితం బలైంది. ఆ బాధను దిగమింగుకొని తన సోదరిలా మరే మహిళా ప్రాణాలు కోల్పోకూడదని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఊరూరా తిరుగుతూ మహిళల మానసిక ఆరోగ్యం, మూఢనమ్మకాలపై అవగాహన కల్పించడం ప్రారంభించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. 12 ఏళ్లుగా ఇలాంటి సమాజ సేవలోనే తరిస్తోంది జార్ఖండ్‌కు చెందిన సుమిత్ర గాగ్రాయ్‌.

మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ!

జార్ఖండ్‌.. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఈ రాష్ట్రంలో గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ మహిళలపై అఘాయిత్యాలు కూడా అధికంగానే జరుగుతుంటాయి. మంత్రసానులనే ముద్రవేసి దారుణంగా హింసించడం, చంపడం లాంటి అమానుష ఘటనలు ఇక్కడ కోకొల్లలు. మిగతా రాష్ట్రాలతో పోల్చితే శిశుమరణాల రేటు కూడా ఎక్కువే. అక్కడి ప్రజల్లోని నిరక్షరాస్యత, అవగాహన లోపమే ఇన్ని అనర్థాలకు మూల కారణం. ఈ క్రమంలో గిరిజనుల్లో మార్పు తెచ్చేందుకు తనదైన శైలిలో కృషిచేస్తోంది 31 ఏళ్ల సుమిత్ర. వెస్ట్‌ సింగ్‌భూమ్‌ జిల్లాకు చెందిన ఆమె స్థానిక ‘Ekjut’ అనే స్వచ్ఛంద సంస్థ సహాయంతో మానసిక ఆరోగ్యంపై మహిళల్లో అవగాహన కల్పిస్తోంది. అదేవిధంగా మహిళల అభివృద్ధికి అవరోధాలుగా మారిన కొన్ని సామాజిక దురాచారాలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రయత్నిస్తోంది. వీటితో పాటు పిల్లల ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు చెబుతూ శిశుమరణాల రేటును గణనీయంగా తగ్గించేందుకు కృషిచేస్తోంది.

ఆ విషాద సంఘటనతో!

‘HO’ అనే గిరిజన జాతికి చెందిన సుమిత్ర కూడా పేద కుటుంబంలోనే పుట్టింది. అయితే తన జీవితంలో జరిగిన ఓ విషాద సంఘటన ఆమెను సామాజిక సేవ వైపు అడుగులు వేసేలా చేసింది. ‘మానసిక సమస్యల నుంచి బయటపడలేక నా సోదరి 16 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుంది. తనను కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నించాను. చికిత్స కూడా ఇప్పించాం. కానీ అవగాహన లోపంతో ఆమె రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడింది. ఈ దుర్ఘటన నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. నా సోదరిలాగే చాలామంది మహిళలు పలు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఇక కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూఢ నమ్మకాలు, ఆచారాల పేరిట మహిళలపై ఆకృత్యాలు, ఆఘాయిత్యాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రసవ సమయంలో పాటించే కొన్ని సామాజిక దురాచారాల వల్ల ఎంతోమంది గర్భిణులు ప్రాణాలు కోల్పోతున్నారు. పిల్లలు పుట్టాక బొడ్డుతాడు కత్తిరించకపోవడం, తగిన పరిశుభ్రత పాటించకపోవడంతో నెలల్లోపే చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఫలితంగా శిశుమరణాల రేటు కూడా పెరిగిపోతోంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు నేను ‘Ekjut’ అనే స్వచ్ఛంద సంస్థతో చేతులు కలిపాను. మహిళల సమస్యలను తెలుసుకునేందుకు స్వయంగా గిరిజన గ్రామాల్లో పర్యటిస్తున్నాం. వీధి నాటకాలు, కథల ద్వారా ఇలాంటి సామాజిక దురాచారాలపై అవగాహన కల్పిస్తున్నాం’ అని అంటోందీ సూపర్‌ వుమన్‌.

చైతన్యం తెస్తోంది!

సుమిత్ర 12 ఏళ్ల కృషి కారణంగా ఇప్పుడిప్పుడే గిరిజనుల్లో మార్పు వస్తుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. మానసిక సమస్యలతో పాటు ఇతర అనారోగ్యాలపై అవగాహన పెరిగిందని, శిశుమరణాల రేటు కూడా క్రమంగా తగ్గుతోందంటున్నారు. ఈ క్రమంలో సుమిత్ర సేవా దృక్పథానికి గుర్తింపుగా  ‘కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ’ గతేడాది ఆమెను ‘Woman Exemplar Award’తో సత్కరించింది. అంతేకాదు ఆమె అవగాహన కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాల్ని ప్రశంసిస్తూ ప్రముఖ మెడికల్ జర్నల్‌ ‘ది లాన్సెట్‌’ కూడా ఓ ప్రత్యేక కథనం ప్రచురించడం విశేషం.

మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని