కాళ్లు బొబ్బలెక్కినా పరిగెత్తింది... ఒలింపిక్స్‌ బెర్తు సాధించింది! - meet sprinter revathi veeramani who slept hungry and ran barefoot to qualify for olympics
close
Updated : 11/07/2021 12:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాళ్లు బొబ్బలెక్కినా పరిగెత్తింది... ఒలింపిక్స్‌ బెర్తు సాధించింది!

Photo: Twitter

చిన్నతనంలోనే అమ్మానాన్నలను కోల్పోతే అమ్మమ్మే సర్వస్వమైంది. కనీసం ఒక్కపూట కూడా కడుపు నింపుకొనే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వ వసతి గృహంలో చేరింది. అక్కడే చదువుతో పాటు పరుగుపై ప్రేమ పెంచుకుంది. ఎంతలా అంటే.. షూస్‌ లేకున్నా, కాళ్లు బొబ్బలెక్కుతోన్నా తన పరుగును మాత్రం ఆపలేనంత..! అదే స్ఫూర్తితో జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో అద్భుతాలు సృష్టించింది. ఇప్పుడు ప్రతిష్ఠా్త్మక ఒలింపిక్స్‌ పోటీలకు అర్హత సాధించింది. ఆమే.. తమిళనాడులోని మదురైకు చెందిన 23 ఏళ్ల రేవతి వీరమణి.

అమ్మమ్మ నీడలో..!

తమిళనాడులోని ఓ పేదింటి కుటుంబంలో పుట్టింది రేవతి. దీనికి తోడు పులి మీద పుట్రలా తనకు ఐదేళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులు కూడా దూరమయ్యారు. రేవతితో పాటు ఆమె సోదరికి అమ్మమ్మ ఆర్మల్‌ సర్వస్వమైంది. ఆమె ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రమే.. ఇటుకలు మోసే పనికి వెళ్లేది. దీంతో పిన్న వయసులోనే పొట్టకూటి కోసం పడరాని పాట్లు పడ్డారు రేవతి, ఆమె సోదరి. ఈ క్రమంలో చేసేదేమీ లేక తన ఇద్దరు మనవరాళ్లను ఓ ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించింది ఆర్మల్‌. అలా రెండో తరగతి నుంచి 12వ తరగతి వరకు హాస్టల్‌లోనే ఉండి చదువుకుంది రేవతి.

చెప్పుల్లేకుండానే పోటీలకు!

చదువుకుంటున్నప్పుడే పరుగుపై ఆసక్తి పెంచుకుంది రేవతి. ముఖ్యంగా ప్లస్‌టూ అభ్యసిస్తున్న సమయంలో రాష్ట్రస్థాయి 100 మీటర్ల పరుగు పోటీల్లో చెప్పుల్లేకుండానే పరుగెత్తి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాళ్లు బొబ్బలెక్కినప్పటికీ ఫైనల్స్ వరకు చేరుకుంది. ఇది చూసిన కన్నన్‌ అనే ఓ అథ్లెటిక్‌ కోచ్‌ ఆమెకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు తన సొంత ఇంట్లోనే వసతి కల్పించాడు. అలా కొద్ది రోజుల పాటు కన్నన్‌ శిక్షణలో రాటుదేలిన రేవతి ఆయన సహాయంతోనే మదురైలోని ప్రముఖ లేడీ డాక్ కాలేజీలో ఉచిత సీటు సంపాదించుకుంది. అక్కడి ప్రొఫెషన్‌ కోచ్‌ల సహాయంతో తన నైపుణ్యాలకు మరిన్ని మెరుగులద్దుకుంది.

వారి ప్రోత్సాహంతోనే!

ఇలా అమ్మమ్మ, కోచ్‌ల ప్రోత్సాహంతో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటింది రేవతి. మొదట 2016 జూనియర్‌ నేషనల్స్ 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పోటీల్లో బంగారు పతకాలు కైవసం చేసుకున్న ఆమె.. సీనియర్ నేషనల్స్‌ విభాగంలోనూ రజత పతకం గెల్చుకుంది. ఆ తర్వాత 2019 ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటి నాలుగో స్థానంలో నిలిచింది. అదే ఏడాది తన కోచ్‌ల సూచనలతో 100 మీటర్ల నుంచి 400 మీటర్ల విభాగానికి మారి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లోనూ మెరుగైన ప్రతిభ చూపింది.

వెన్నెముక గాయం బాధించినా!

ఆటలో తన అద్భుతాలకు గుర్తింపుగా 2019లోనే దక్షిణ మధ్య రైల్వే మదురై డివిజన్‌లో ‘కమర్షియల్‌ క్లర్క్‌ - టికెట్‌ ఎగ్జామినర్‌’ ఉద్యోగానికి ఎంపికైంది రేవతి. ఇక ఒలింపిక్స్‌ సన్నద్ధతలో ఉండగానే గతేడాది నవంబర్‌లో ఆమె వెన్నెముకకు గాయమైంది. అయితే కొద్దిరోజుల్లోనే కోలుకొని పాటియాలాలో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌ అర్హత పోటీలకు హాజరైంది. పోటీల్లో భాగంగా 400 మీటర్ల దూరాన్ని 53.55 సెకన్లలో చేరుకుని ఒలింపిక్స్‌ బెర్తు ఖరారు చేసుకుంది.

ఇటుకలు మోసే పనికి తీసుకెళ్లమన్నారు!

‘నేను ఒలింపిక్స్‌కు అర్హత సాధించినందుకు నా కంటే మా అమ్మమ్మే ఎక్కువగా సంబరపడిపోతోంది. ఆమె కారణంగానే నేను, నా సోదరి(ప్రస్తుతం చెన్నైలో పోలీస్‌గా విధులు నిర్వర్తిస్తోంది) ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకున్నాం. అమ్మానాన్నలు చనిపోయిన తర్వాత ఆమె ఇటుకలు మోసి మమ్మల్ని పెంచింది.  మమ్మల్ని కూడా ఇటుకల పనికి తీసుకెళ్లమని బంధువులు, చుట్టుపక్కల వారు అమ్మమ్మకు చెప్పేవారు. కానీ ఆమె మేం స్కూలుకెళ్లి చదువుకోవాలనే కోరుకుంది. ఇక కోచ్‌ కన్నన్‌ సర్‌ మా కుటుంబానికి ఎంతో సహాయం చేశారు. నేను ఒలింపిక్స్‌కు వెళ్లాలనేది ఆయన కోరిక. అది నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఒకసారి నా గతాన్ని పునఃపరిశీలించుకుంటే ఎన్నో ఇబ్బందులను దాటుకుంటూ ఈ స్థాయికి వచ్చాను. నేనే కాదు.. గట్టిగా అనుకుంటే ఎవరైనా అనుకున్నది సాధించచ్చు..’ అని అంటోందీ యువ స్ప్రింటర్‌.

టోక్యో బెర్తు ఖరారు చేసుకున్న రేవతిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా పలువురు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. బంగారు పతకంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని