అమ్మాయిలూ.. ఫిట్‌నెస్‌లో 90 ఏళ్ల తకిమికతో పోటీపడగలరా? - meet takimika japaneese 90 year old fitness instructor telugu
close
Updated : 06/07/2021 19:21 IST

అమ్మాయిలూ.. ఫిట్‌నెస్‌లో 90 ఏళ్ల తకిమికతో పోటీపడగలరా?

Image for Representation

సాధారణంగా 90 ఏళ్లు దాటిన బామ్మల్లో చాలామంది నడవడానికే ఇబ్బంది పడుతుంటారు. మంచానికే పరిమితమై చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతుంటారు. ఎక్కువగా ఇంట్లోనే ఉంటూ మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తూ జీవితాన్ని గడిపేస్తుంటారు. అయితే జపాన్‌కు చెందిన ఓ 90 ఏళ్ల వృద్ధురాలు మాత్రం నేటి తరం యువతకు దీటుగా వివిధ రకాల వ్యాయామాలు చేస్తున్నారు. అంతేకాదు... ఫిట్‌నెస్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా ఎంతోమంది అమ్మాయిలకు ఫిట్‌నెస్‌ పాఠాలు సైతం బోధిస్తున్నారు.

90 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్‌ పాఠాలు!

ప్రపంచంలో అత్యధిక ఆయుర్దాయం ఉన్న దేశాల్లో జపాన్‌ కూడా ఒకటి. 2019 గణాంకాల ప్రకారం అక్కడి ప్రజల సగటు జీవన ప్రమాణ కాలం 83 ఏళ్లు కాగా...మహిళల సగటు ఆయుర్దాయం సుమారు 87.45 సంవత్సరాలు. అక్కడ 80 వేల మందికి పైగా శతాధిక వృద్ధులు ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారట. ఈ క్రమంలో వారి జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వ్యాయామం.. ఇతర అంశాలే వారిని ఎక్కువ కాలం జీవించేలా చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అందుకు ప్రత్యక్ష నిదర్శనమే తకిషిమా మిక (అందరూ ‘తకిమిక’ అని పిలుస్తారు). ఈ ఏడాది జనవరిలో 90వ వసంతంలోకి అడుగుపెట్టిన ఈ బామ్మ చూడడానికి 30 ఏళ్ల మహిళలా ఎంతో ఫిట్‌గా, యాక్టివ్‌గా, సానుకూల దృక్పథంతో కనిపిస్తుంటారు. అందుకే ఫిట్‌నెస్‌ ఇన్‌స్ట్ర్టక్టర్ పోస్టు వెతుక్కుంటూ మరీ ఈ వృద్ధురాలి దగ్గరికి వచ్చింది. ప్రస్తుతం జపాన్‌లో ఉన్న అత్యంత వృద్ధురాలైన ఫిట్‌నెస్‌ ఇన్‌స్ట్రక్టర్ కూడా తకిమికే కావడం విశేషం.

భర్త కామెంట్‌ చేశాడని!
యమగట నగరంలో ఉండే తకిమిక మొదటి నుంచి ఫిట్‌నెస్‌ ప్రేమికురాలేమీ కాదు. 65 ఏళ్ల వయసులో ఆమె వ్యాయామం చేయడం ప్రారంభించారు. అది కూడా భర్త తన శరీర ఆకృతిపై కామెంట్‌ చేశాడన్న కారణంతో..! ‘65 ఏళ్ల వయసులో నేను కాస్త బొద్దుగా ఉండేదాన్ని.. వ్యాయామం, జిమ్‌లాంటి వాటిపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఎక్కువగా ఇంటి పనుల్లోనే బిజీగా గడిపేదాన్ని. అయితే ఓసారి మావారు నా శరీరాకృతిపై నెగెటివ్‌గా కామెంట్‌ చేశారు. అప్పుడే జిమ్‌కు వెళ్లాలని, అధిక బరువును తగ్గించుకోవాలని గట్టిగా నిశ్చయించుకున్నాను.’ 

కొత్త లక్ష్యాలతో ముందుకు సాగాను!

‘ముందుగా 15 కిలోలు తగ్గాలన్న లక్ష్యంతో జిమ్‌కు వెళ్లి ఎక్సర్‌సైజులు చేయడం ప్రారంభించాను. అనుకున్నట్లే ఆ లక్ష్యాన్ని చేరుకున్నాను. ఆ తర్వాత సన్నని నడుము కోసం వ్యాయామాలు ప్రారంభించాను. అనంతరం అథ్లెట్‌లా మరింత ఫిట్‌గా ఉందామనుకున్నాను. ఆపై ఏరోబిక్ ట్రైనర్‌గా... ఇలా కొత్త లక్ష్యాలను పెట్టుకుంటూ ముందుకు సాగాను’ అని చెబుతారీ గ్రాండ్‌ ఓల్డ్‌ వుమన్. తకిమిక ఫిట్‌నెస్‌ ప్రేమికురాలే కాదు మంచి వక్త కూడా. అందుకే 87 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్ట్‌ ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. జపాన్‌లోని పవర్‌ ఏజింగ్‌ జిమ్‌ తనను ఫిట్‌నెస్ ఇన్‌స్ట్రక్టర్‌గా నియమించింది. 

ఇదే నా డైలీ రొటీన్!

జపాన్‌లో అత్యంత వృద్ధురాలైన ఫిట్‌నెస్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా తకిమిక గుర్తింపు పొందారు. కరోనా కారణంగా ప్రస్తుతం ఎక్కువగా ఆన్‌లైన్‌ ద్వారానే ఫిట్‌నెస్ పాఠాలు బోధిస్తున్నారామె. వారానికి ఒకసారి మాత్రం జిమ్‌కు వెళ్లి క్లాసులు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 90 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్‌గా, సానుకూల దృక్పథంతో ఉండడానికి తన జీవన విధానమే కారణమంటారు తకిమిక. 

‘నేను రోజూ 11 గంటలకల్లా నిద్రపోతాను. మళ్లీ తెల్లవారుజాము 3 గంటలకే నిద్రలేస్తాను. ఆ తర్వాత 4 కిలోమీటర్లు వాకింగ్‌, 3 కిలోమీటర్లు జాగింగ్‌, కిలోమీటరు బ్యాక్‌వర్డ్స్‌ వాక్ (వెనకకు నడవడం) చేస్తాను. వీటితో పాటు కొన్ని వెయిట్‌ లిఫ్ట్స్‌, కార్డియో ఎక్సర్‌సైజులు కూడా చేస్తాను. సమతులాహారాన్నే తీసుకుంటాను. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో చేపలు, గుడ్లు, పండ్లు ఎక్కువగా తీసుకుంటాను. ఆ తర్వాత ఇంట్లో పనులు చక్కదిద్దుకుంటాను. టీవీ కూడా చూస్తాను. మధ్యాహ్నం తేలికపాటి ఆహారాన్నే తీసుకుంటాను. ఎందుకంటే అతిగా తింటే నాకు నిద్ర పడుతుంది. సాయంత్రం జిమ్ సెషన్లకు ఇబ్బంది కలుగుతుంది. ఇక రాత్రి చికెన్‌తో పాటు క్యాబేజ్, క్యారట్‌, పొటాటో లాంటి కూరగాయలతో తయారుచేసిన సూప్‌ను తీసుకుంటాను. ఇక అప్పుడప్పుడు ఛీట్‌మీల్స్‌గా కేక్స్‌ను డైట్‌లో భాగం చేసుకుంటాను’ అని తన లైఫ్‌స్టైల్‌ గురించి చెబుతారీ ఓల్డ్‌ వుమన్.

మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని