ఈ చిన్నారి పాటకో ‘తాలియా’! - meet talia jose the 8 year old singer and song writer from bengaluru
close
Updated : 09/07/2021 19:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ చిన్నారి పాటకో ‘తాలియా’!

Photo: Instagram

మానసిక ప్రశాంతతతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్నీ అందించగల శక్తి ఒక్క సంగీతానికే ఉందనడం అతిశయోక్తి కాదు. మరి అంతటి మహత్తు కలిగిన పాటలు రాయడమంటే మాటలు కాదు. ‘పాటలు రాయడం కూడా ఓ ప్రసవ వేదన లాంటిదే’.. అని ఓ సినీ కవి చెప్పినట్లు పదిమందిని మెప్పించే పాటలు రాయాలంటే భాషపై పట్టుతో పాటు మంచి సృజనాత్మకత, పాండిత్యం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇదే విషయం నిరూపిస్తోంది బెంగళూరుకు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి. పాటలు రాస్తూ, వాటికి స్వయంగా ట్యూన్స్‌ కట్టడమే కాదు.. వినసొంపుగా పాడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మూడో తరగతి చదువుతూ!

‘హెడ్‌ హెల్డ్‌ హై’ పేరుతో ఇటీవల పలు ఆన్‌లైన్‌ సంగీత వేదికల్లో విడుదలైన ఓ ఇంగ్లిష్‌ పాట సంగీత ప్రియుల్ని బాగా ఆకట్టుకుంటోంది. ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్‌ యాప్‌ ‘స్పాటిఫై’లో వెయ్యి మందికి పైగానే ఈ పాట విన్నారు. వెయ్యి మందే కదా అందులో గొప్పేముంది అని మీరు అనుకోవచ్చు.. కానీ ఈ పాట రాసింది, దానికి సంగీతం కట్టింది, పాడింది ఎనిమిదేళ్ల తాలియా జోస్‌. మరి, ఇంత చిన్న వయసులోనే తన ప్రతిభతో అంతమందిని ఆకట్టుకుందంటే విశేషమే కదా! చిన్నప్పుడు తల్లి సహాయంతో సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న ఈ అమ్మాయి ఇప్పుడు తన బహుముఖ ప్రజ్ఞతో పలువురి ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం తాలియా మూడో తరగతి చదువుతోంది.

గర్భంలో ఉన్నప్పుడే!

తాలియా తల్లి అంజు చెరియన్‌ గర్భంతో ఉన్నప్పుడు పియానో వాయించడంతో పాటు పాటలు పాడడం సాధన చేసేదట. అలా అమ్మ కడుపులో ఉండగానే సంగీతంతో అనుబంధం ఏర్పరచుకున్న ఈ చిన్నారి రెండేళ్లు రాగానే పాటలు పాడడం ప్రారంభించింది. తనలోని సంగీత ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు ఐదేళ్ల వయసు రాగానే ఆ చిన్నారికి సంగీతంతో పాటు పియానో పాఠాలు కూడా నేర్పించారు. అలా సంగీతంపై పట్టు సాధించిన తాలియా కొన్ని రోజుల క్రితం స్వయంగా ఓ పాట రాసింది. దానికి చక్కటి సంగీతాన్ని జోడించి తన పియానో గురువుకు అందజేసింది. చిన్నారి సంగీత ప్రతిభకు ముగ్ధుడైన ఆయన ఆ పాటను రికార్డ్‌ చేసి ఈ ఏడాది జూన్‌లో విడుదల చేశారు. పలు సంగీత వేదికల్లో విడుదలైన ఈ పాట సంగీత ప్రియుల్ని తెగ ఆకట్టుకుంది. ఈ పాటకు మంచి స్పందన రావడంతో త్వరలోనే దీనికి సంబంధించిన మ్యూజిక్‌ వీడియోను విడుదల చేయాలనుకుంటోంది తాలియా కుటుంబం.

కరోనాతో ఆలస్యమైంది!

‘కరోనా వ్యాప్తి ప్రారంభం కాకముందే నా కూతురు ఈ పాట రాసింది. అయితే స్టూడియోలో రికార్డ్‌ చేస్తే బాగుంటుందని భావించాం. కానీ కరోనా మా ప్రణాళికలకు అడ్డుపడింది. చివరకు కొన్ని గ్యాడ్జెట్స్‌ సహాయంతో ఇంట్లోనే రికార్డ్‌ చేశాం. తాలియా పియానో గురువు ఈ పాటకు మరికొన్ని హంగులద్ది ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ప్రకృతితో తనకున్న అనుబంధం, అనుభవాల సారమే ఈ పాట. ఇక మా అమ్మాయి పాడిన పాటలతో పాటు; తన అభిప్రాయాలు, ఆలోచనలను ఎప్పటికప్పుడు నా ఫోన్‌/ఐ ప్యాడ్‌లో రికార్డ్‌ చేస్తుంటాను. సంగీతంలోనే కాదు డ్యాన్స్‌, పుస్తక పఠనం, క్రీడలు, కుకింగ్‌, స్కేటింగ్‌, పెయింటింగ్‌లోనూ నా కూతురికి మంచి ప్రావీణ్యముంది..’ అంటూ తన చిన్నారి గురించి చెబుతూ మురిసిపోతోందా తల్లి.

ఆ పాటంటే ఇష్టం!

ఇక తన పాటకు వస్తోన్న స్పందనపై తాలియా మాట్లాడుతూ ‘నా మనసులో మెదిలిన ఆలోచనలన్నింటికీ అక్షర రూపమిస్తుంటాను. ఆ తర్వాత వాటికి చక్కటి సంగీతాన్ని జత చేస్తుంటాను. ఇక అమ్మానాన్నలిద్దరికీ సంగీతమంటే ఎంతో ఆసక్తి. దీంతో ఇంట్లో నిత్యం ఏదో ఒక పాట వింటూనే ఉంటాను. డిస్నీ క్లాసిక్స్‌తో పాటు ‘ఫ్రోజెన్’ సినిమాలోని ‘లెట్‌ ఇట్‌ గో’ నాకు బాగా ఇష్టమైన పాటలు. అయితే రోజురోజుకీ ఈ జాబితా పెరిగిపోతోంది. ‘ది గ్రేటెస్ట్‌ షో మ్యాన్‌’, ‘ఫ్రోజెన్‌-2’, ‘డిసెండంట్స్‌’ సినిమాల్లోని పాటలతో పాటు గ్రేస్‌ వాండర్‌ వాల్‌, ఏంజెలికా హేల్‌, అన్నే-మేరీ, అడెలె, టేలర్‌ స్విఫ్ట్‌, కేటీ పెర్రీ పాటలను కూడా బాగా వింటుంటాను’ అని చెప్పుకొచ్చిందీ మల్టీ ట్యాలెంటెడ్ గర్ల్‌.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని