ముఖానికి పసుపు వాడేటప్పుడు ఇలా చేయద్దు! - mistakes to avoid while using turmeric on your skin
close
Published : 29/07/2021 20:16 IST

ముఖానికి పసుపు వాడేటప్పుడు ఇలా చేయద్దు!

ముఖ సౌందర్యాన్ని ఇనుమడింపజేయడంలో పసుపుది కీలక పాత్ర. అందుకే ఫేస్‌ప్యాక్‌, స్క్రబ్‌.. వంటివి తయారుచేసే క్రమంలో దీన్ని విరివిగా వాడుతుంటాం. ఇందులోని సుగుణాలు, ఔషధ గుణాలు పలు చర్మ సంబంధిత సమస్యల్ని దూరం చేసి మోముకు మెరుపును అందిస్తాయి. అయితే దీన్ని వాడే క్రమంలో మనం చేసే కొన్ని పొరపాట్లు చర్మ అందాన్ని, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయంటున్నారు సౌందర్య నిపుణులు. మరి, ఇంతకీ అవేంటో తెలుసుకొని సరిదిద్దుకుందాం రండి..

20 నిమిషాలకు మించి వద్దు!

పసుపును రోజ్‌వాటర్‌, పాలు, నీళ్లు.. వంటి పదార్థాల్లో కలుపుకొని ముఖానికి పూతలు వేసుకోవడం మనకు అలవాటే! అయితే ఈ క్రమంలో కొంతమంది ఎక్కువ మెరుపు రావాలన్న ఉద్దేశంతో నిర్ణీత సమయం కంటే మరో అరగంట ఎక్కువ సేపు ఆ ప్యాక్‌ తొలగించకుండా అలానే ఉండిపోతారు. నిజానికి పసుపు కలిపిన ఫేస్‌ప్యాక్‌/స్క్రబ్‌ ఏదైనా సరే.. 20 నిమిషాలకు మించి ఉంచుకోవద్దని చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ అంతకంటే ఎక్కువ సమయం పాటు శుభ్రం చేసుకోకుండా ఉండిపోతే.. ముఖంపై పసుపు రంగు మాదిరి మచ్చలు ఏర్పడడంతో పాటు మొటిమలు కూడా వచ్చే ప్రమాదం ఉందట!

సబ్బు వాడద్దు!

సాధారణంగా ముఖం కడుక్కోవాలనుకున్నప్పుడు సబ్బు ఉపయోగించడం మనకు అలవాటే! ఫేస్‌ప్యాక్‌/స్క్రబ్‌ వేసుకున్నా.. తొలగించుకునే క్రమంలో సబ్బుతో రుద్దుకొని మరీ శుభ్రం చేసుకుంటాం. అయితే పసుపుతో వేసుకున్న ఫేస్‌ప్యాక్‌/స్క్రబ్‌.. వంటివి తొలగించుకునే క్రమంలో సబ్బు వాడద్దంటున్నారు నిపుణులు. అయితే మూడు నాలుగ్గంటల తర్వాత మాత్రం గాఢత తక్కువగా ఉండే ఫేస్‌వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోమంటున్నారు. ఈ విషయంలో మీకు ఇంకా సందేహంగా ఉన్నట్లయితే ఓసారి నిపుణుల సలహా తీసుకోవచ్చు. అలాగే ముఖం కడుక్కున్నాక మాయిశ్చరైజర్‌ రాసుకోవడం మర్చిపోకండి.

ఈ విషయంలో జాగ్రత్త!

కళ్ల కింద నల్లటి వలయాలు, క్యారీబ్యాగుల్ని దూరం చేసుకోవడానికి.. కంటి అలసటను తగ్గించడానికి కొన్ని ఐ ప్యాక్స్‌ వేసుకోవడం మనకు అలవాటే! అయితే ఇలాంటి వాటిలో పసుపు వాడకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే పొరపాటున పసుపు కళ్లలోకి వెళ్తే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుందట! ఒకవేళ వేసుకోవాలనుకున్నా.. కళ్లలోకి వెళ్లకుండా జాగ్రత్తపడడం ముఖ్యం.

వీటితో పాటు పసుపు ఉపయోగించి తయారుచేసిన ఫేస్‌ప్యాక్స్‌ ముఖంపై సమానంగా పరచుకునేలా వేసుకోవడం, పూర్తిగా తొలగిపోయేలా శుభ్రం చేసుకోవడమూ ముఖ్యమే! అలాగే ఈ క్రమంలో వేడి నీళ్ల కంటే చల్లటి/గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటినే వాడమంటున్నారు నిపుణులు. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పసుపు చర్మానికి మేలు చేసి చక్కటి మేని ఛాయను అందిస్తుంది.. మొటిమలు, మచ్చలు.. వంటి చర్మ సమస్యల్ని దూరం చేస్తుంది.

మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని