అపోహలు వద్దు.. అమ్మపాలే ముద్దు! - myths and facts about breastfeeding in telugu
close
Published : 07/08/2021 15:48 IST

అపోహలు వద్దు.. అమ్మపాలే ముద్దు!

అమ్మపాలు అమృతధారలు.. అందుకే బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు తప్ప ఇతరత్రా ఏ పదార్థాలు ఇవ్వకూడదని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అయితే తల్లిపాల విషయంలోనూ మనకు ఎన్నో అపోహలు వినిపిస్తూ ఉంటాయి. ప్రసవానంతరం లేత పసుపు వర్ణంలో వచ్చే ముర్రుపాలు బిడ్డకు పట్టించకూడదని, వక్షోజాలు చిన్నవిగా ఉండడం వల్ల బిడ్డకు సరిపడా పాలు ఉత్పత్తి కావని, ఒకవేళ పాలు ఉత్పత్తి అయినా అవి బిడ్డ ఆకలి తీర్చేందుకు సరిపోవని.. ఇలాంటి వ్యాఖ్యలన్నీ ఆ కోవకు చెందినవే. ఈ అపోహల్లో ఎంత వరకు నిజం ఉందో ఓసారి మనమూ తెలుసుకుందాం రండి..

తొమ్మిది నెలల పాటు కడుపులో బిడ్డను, వూహల్లో వారి రూపును చూసుకుని మురిసిపోతుంది గర్భం ధరించిన ప్రతి మహిళ. ఇక తొమ్మిదో నెల మొదలైనప్పట్నుంచి ఎప్పుడెప్పుడు బిడ్డను కళ్లారా చూసుకుందామా అని ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటుంది. ప్రసవం అయిన తర్వాత పండంటి బిడ్డను పొత్తిళ్లలోకి తీసుకుని గుండెలకు హత్తుకోవడం ద్వారా తన ప్రేమాభిమానాలను బిడ్డకు తెలియజేస్తుంది ఆ తల్లి. అంతేనా.. పాల రూపంలో తన శక్తినంతా బిడ్డకు ధారపోస్తుంది. అయితే తల్లిపాల విషయంలో కూడా రకరకాల అపోహలు మనం వింటూనే ఉంటాం. వాటిలో ఎంతవరకు నిజం ఉందో తెలియక కొందరు వాటికే ప్రాధాన్యం ఇస్తూ పాటిస్తుంటారు. కానీ అలా చేయడం తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. ఇంతకీ తరచూ వినే ఆ అపోహలు, వాటిలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలుసుకుందాం రండి..

* వక్షోజాలు చిన్నవిగా ఉంటే బిడ్డ తాగేందుకు సరిపడా పాలు ఉత్పత్తి కావు..!

ఇది పూర్తిగా అపోహ మాత్రమే. వాస్తవానికి బిడ్డ తాగేందుకు సరిపడా పాలు ఉత్పత్తి కావడానికి, తల్లి వక్షోజ పరిమాణానికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే వక్షోజ పరిమాణం కేవలం కొవ్వుతో కూడుకున్న కణజాలంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. కానీ పాల ఉత్పత్తికి అవసరమయ్యే కణజాలం (ఫంక్షనల్ టిష్యూ) వేరేగా ఉంటుంది. గర్భం ధరించింది మొదలు ఈ కణజాలం కూడా మెల్లగా వృద్ధి చెందుతూ ప్రసవం అయ్యే సమయానికి పాల ఉత్పత్తికి అనుగుణంగా మారుతుంది. కాబట్టి బిడ్డకు సరిపడా పాల ఉత్పత్తి కావడానికి, వక్షోజాల పరిమాణానికి ఎలాంటి సంబంధం ఉండదని గుర్తించాలి.

* ఛాతీకి ఇన్‌ఫెక్షన్ ఉన్నవారు బిడ్డకు పాలు ఇవ్వకూడదు..

ఇది ఎంతమాత్రం నిజం కాదు. ప్రసవం సమయానికి కొందరు మహిళల్లో చనుమొనలు బాగా నల్లగా మారడం, వాటి చుట్టూ ఉన్న చర్మం కాస్త రఫ్‌గా అయినట్లు ఉండడం, అలాగే చనుమొనలు కాస్త నొప్పిగా అనిపించడం వంటివి జరుగుతుంటాయి. కానీ ఒక్కసారి బిడ్డకు పాలు పట్టడం ప్రారంభించిన తర్వాత ఇవన్నీ క్రమేపీ వాటంతటవే సర్దుకుంటాయి. కొందరు మహిళల్లో కొన్ని క్షీరనాళాలు మూసుకుపోవడం లేదా ఛాతీ ఇన్‌ఫెక్షన్.. వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఇటువంటప్పుడు బిడ్డకు పాలివ్వకూడదని చాలామంది చెబుతారు. కానీ బిడ్డకు పాలివ్వడం వల్ల ఇన్‌ఫెక్షన్ తగ్గడమే కాదు.. మూసుకుపోయిన క్షీరనాళాలు సైతం వాటంతటవే తెరుచుకుంటాయి. అంటే తల్లి ఎంత ఎక్కువగా బిడ్డకు పాలిస్తే అంత ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి.

* కొత్తగా తల్త్లెన మహిళల్లో సరిపడా పాలు ఉత్పత్తి కావు..

ఇది కేవలం అపోహ మాత్రమే. సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువు తాగే పాలు చాలా తక్కువ మోతాదులోనే ఉంటాయి. వారికి తల్లిపాలు తప్ప మరేమీ సులభంగా జీర్ణం కావు. అయితే వారి జీర్ణాశయం చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి ప్రతి రెండు గంటలకు ఓసారి కొద్దికొద్ది మోతాదులో తల్లి పాలు పడితే సరిపోతుంది. ఈ క్రమంలో ప్రసవం తర్వాత ఉత్పత్తి అయ్యే పాలు బిడ్డ కడుపు నిండడానికి నిరభ్యంతరంగా సరిపోతాయి. అయితే తొలి మూడు లేదా నాలుగు రోజుల పాటు వచ్చే ముర్రుపాలు బిడ్డ ఆరోగ్యానికి కూడా చాలా ఆవశ్యకం. ఇవి తక్కువగానే ఉత్పత్తి అయినప్పటికీ బిడ్డకు సరిపోతాయి. వీటి తర్వాత వచ్చే పాలు కూడా బిడ్డకు ఎంత ఎక్కువగా పడితే అంత ఎక్కువగా మళ్లీ ఉత్పత్తి అవుతూ ఉంటాయి.

* బిడ్డకు పాలిచ్చినన్ని రోజులు గర్భం ధరించే అవకాశాలుండవు..

ఈ మాట పూర్తిగా వాస్తవం కాదు. బిడ్డకు పాలివ్వడం వల్ల గర్భం ధరించే అవకాశాలు కొంతమేరకు తగ్గుతాయి. అంతేకానీ.. బిడ్డకు పాలివ్వడం అనేది పూర్తిగా ఒక గర్భనిరోధక పద్ధతి అని చెప్పలేము. కాబట్టి పిల్లలు పుట్టకుండా ఉండేందుకు వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రసవం జరిగి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ నెలసరి రాకపోయినట్లయితే వైద్యులను సంప్రదించి తగిన గర్భనిరోధక పద్ధతులను అవలంబించడం మంచిది.

* బిడ్డకు బాటిల్‌తో పాలు తాగడం అలవాటు చేస్తే రొమ్ము పాలు తాగేందుకు ఆసక్తి చూపదు

ఇది నిజం కాదు.. తొలి ఆరు వారాల పాటు బిడ్డకు కచ్చితంగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఆ తర్వాత బాటిల్‌తో పాలు పట్టడం అలవాటు చేసినప్పటికీ బిడ్డ సీసా పాలతో పాటు తల్లిపాలు కూడా తాగేందుకు ఆసక్తి చూపుతుంది. ఇది చాలా సహజమైన ప్రక్రియ.

* బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినన్ని రోజులు తల్లి ఎలాంటి మందులు వాడకూడదు

ఇది కొంతవరకు వాస్తవమే. అయినప్పటికీ ఏవైనా అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు వంటివి తలెత్తినప్పుడు వైద్యులను సంప్రదించి, ఫీడింగ్ మదర్ అన్న విషయం వాళ్లకు తెలియజేయాలి. ఆ తర్వాతే వారు సూచించిన మందులు వేసుకోవాలి. పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్.. వంటి పవర్‌ఫుల్ ట్యాబ్లెట్స్‌కు వీలైనంతమేరకు దూరంగా ఉండడమే మంచిది.

* తల్లికి ఒంట్లో బాగోకపోతే బిడ్డకు పాలు పట్టకూడదు

ఇది కూడా పూర్తిగా వాస్తవం కాదు. తల్లికి ఆరోగ్యం బాలేనప్పుడు బిడ్డ కూడా ఆమె చెంతనే ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావం బిడ్డపై తప్పకుండా కనిపిస్తుంది. ఈ సమయంలో బిడ్డకు పాలు పట్టడం వల్ల తల్లి శరీరంలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీస్ బిడ్డకు పాల ద్వారా అందితే వ్యాధి నిరోధక శక్తి మెరుగై ఆరోగ్యంగా ఉండే అవకాశాలుంటాయి.


Advertisement


మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని