బీట్‌రూట్ లిప్ స్టెయిన్ ఇంట్లోనే చేద్దాం...! - natural lip stain for beautiful lips
close
Published : 24/07/2021 19:18 IST

బీట్‌రూట్ లిప్ స్టెయిన్ ఇంట్లోనే చేద్దాం...!

అధరాలు అందంగా కనిపించడం కోసం వాడే లిప్‌స్టిక్, లిప్‌బామ్ లాంటి రకరకాల సౌందర్య సాధనాల గురించి మనందరికీ తెలుసు. లిప్‌స్టిక్ తయారీలో వాడే రకరకాల రసాయనాలకు భయపడి కొంతమంది వాటి జోలికి వెళ్లరు. సహజమైన పదార్థాలతో తయారయే ఆర్గానిక్ లిప్‌స్టిక్ లు, బ్రాండెడ్ లిప్‌స్టిక్‌లు చాలా ఖరీదు. ఎంత ఖరీదైన లిప్‌స్టిక్ వాడినా సహజమైన అధర సౌందర్యాన్ని మించిన అందం లేదు కదా..! లిప్ స్టెయినింగ్ అనే పద్ధతి ద్వారా సహజమైన పద్ధతిలో మీ పెదాలకు నచ్చిన రంగులు అద్దవచ్చు. పైగా ఎటువంటి హానికారక రసాయనాలు లేకుండా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూసేద్దామా..!

లిప్ స్టెయిన్ తయారీ

కావాల్సినవి..

* రెండు టీస్పూన్ల బీట్‌రూట్ రసం

* ఒక టీస్పూను జిలెటిన్ పౌడరు

* ఒక టీస్పూను వేడి నీరు

* అర టీస్పూను గ్లిజరిన్

తయారీ...

ఒక బౌల్‌లో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి కలపాలి. మిశ్రమం సరిగా కలవనట్లు అనిపిస్తే ఒక నిమిషం పాటు ఒవెన్‌లో వేడి చేయాలి లేదా మరుగుతున్న నీటి పాత్రలో అర నిమిషం ఉంచాలి.

ఎలా వాడాలి..?

ముందుగా పెదవులు పగుళ్లు లేకుండా శుభ్రం చేసుకోవాలి. తక్కువ మోతాదులో మాయిశ్చరైజర్ అప్త్లెచేయాలి. మాయిశ్చరైజర్ ఎక్కువైతే లిప్ స్టెయిన్ సరిగా నిలవదు, అసలు మాయిశ్చరైజర్ వాడక పోతే లిప్ స్టెయిన్ గీతలు గీతలుగా ఉంటుంది. అందుకని తక్కువ మోతాదులో వాడాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసిన లిప్ స్టెయిన్ మిశ్రమాన్ని పెదవులకు ప్యాక్‌లా వేసుకోవాలి.

ఈ ప్యాక్ ఆరిన తర్వాత పొరలా తయారవుతుంది. అప్పుడు ఆ పొరను పీల్ చేస్తే ఎర్రని పెదాలు మీ సొంతం. లిప్ స్టెయిన్ తర్వాత లిప్ బామ్ వాడితే పెదాలు మరింత అందంగా ఉండడమే కాకుండా పెదవుల రంగు ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది.

ఈ మిశ్రమంలో వేడి నీటి బదులు కొబ్బరిపాలు లేదా బాదంపాలు(వేరే పదార్థాలు కలవనివి) వాడవచ్చు. బీట్‌రూట్ రంగు కాకుండా వేరే రంగులు కావాలంటే బీట్‌రూట్ రసానికి బదులుగా నచ్చిన ఎడిబుల్ ఫుడ్ కలర్(ఆహారంలో వాడదగిన ఫుడ్ కలర్)ను కలుపుకోవచ్చు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని