పైపెదవిపై నలుపు తగ్గాలంటే..! - natural ways to reduce upper lip shadow
close
Published : 01/07/2021 17:09 IST

పైపెదవిపై నలుపు తగ్గాలంటే..!

చర్మం మృదువుగా, నాజూగ్గా ఉంటే ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే కొంతమంది పైపెదవి పైభాగంలో అవాంఛిత రోమాలతో బాధపడుతుంటారు. వీటిని తొలగించుకునే క్రమంలో కొందరు వ్యాక్సింగ్, త్రెడింగ్, బ్లీచింగ్.. వంటి సౌందర్య చికిత్సల్ని ఆశ్రయిస్తుంటారు. కానీ ఒక్కోసారి అవి అందరికీ పడక ఆ ప్రదేశంలో చర్మం నల్లగా మారడం, ఎర్రటి దద్దుర్లు ఏర్పడడం.. వంటి సమస్యలు ఎదురవుతాయి. మరి ఇలా పైపెదవి పైభాగంలో నల్లగా మారిన చర్మాన్ని సాధారణ స్థితిలోకి తీసుకురావడానికి కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందామా?

కాంతివంతం అవుతుంది..

కేశ సంరక్షణలో, శరీరంపై ఏర్పడిన గాయాల్ని మాన్పడంలోనే కాదు.. పైపెదవి పైభాగంలో నల్లగా మారిన చర్మాన్ని తిరిగి కాంతివంతంగా చేయడానికి కూడా కొబ్బరినూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకోసం రాత్రి నిద్రపోయే ముందు పైపెదవి పైభాగంలో కొంచెం కొబ్బరినూనెను మందపాటి పొరలా పూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ ప్రదేశంలో చర్మం కోల్పోయిన తేమను తిరిగి పొంది.. నలుపుదనం క్రమంగా తగ్గిపోతుంది. అంతేకాదు.. అక్కడి చర్మం కాంతివంతంగానూ మారుతుంది.

ఇది ప్రయత్నించండి..

పైపెదవి పైభాగంలో ఏర్పడిన నలుపుదనాన్ని తగ్గించడంలో బాదం పప్పు, తేనె.. వంటివి కూడా సహకరిస్తాయి. ఇందుకోసం ముందుగా నాలుగైదు బాదం పప్పులను కొన్ని గోరువెచ్చటి నీళ్లలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని మెత్తగా నూరాలి. దీనికి చెంచా తేనె కలుపుకొని.. రెండూ బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పైపెదవి పైభాగంలో మందపాటి పొరలా అప్త్లె చేసుకోవాలి. ఇలా ఓ అరగంట పాటు ఉంచుకుని చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఫలితంగా పైపెదవి పైన ఏర్పడిన నలుపుదనం క్రమంగా తొలగిపోయి ఆ ప్రదేశం కాంతివంతమవుతుంది.

పోషణ అందించాలంటే..

పాల మీగడ కూడా పైపెదవి పైభాగంలో నలుపుదనాన్ని తగ్గించడంలో సహకరిస్తుంది. ఇందుకోసం కాస్త పాల మీగడను ఒక చిన్న గిన్నెలో తీసుకుని అందులో ఓ కాటన్ బాల్‌ని ముంచాలి. దీంతో పైపెదవిపై మీగడను అప్త్లె చేసుకుని అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత తడిగా ఉండే శుభ్రమైన గుడ్డతో తుడిస్తే సరిపోతుంది. ఇలా క్రమం తప్పకుండా తరచూ చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా పాల మీగడలోని ల్యాక్టికామ్లం ఆ భాగానికి పోషణనందించి సమస్యను తగ్గిస్తుంది.

ఈ మిశ్రమంతో..

పైపెదవి పైన ఉండే చర్మంలోని కణాలు డ్యామేజ్ కావడం వల్ల కూడా ఆ ప్రదేశం నలుపుగా మారడం, పిగ్మెంటేషన్.. వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. మరి వీటిని తగ్గించడానికి క్యారట్, పెరుగు బాగా ఉపకరిస్తాయి. ముఖ్యంగా క్యారట్‌లోని బీటాకెరోటిన్, పెరుగులోని ల్యాక్టికామ్లం.. వంటివి ఈ సమస్యని దూరం చేసేందుకు సహకరిస్తాయి. కాబట్టి కొద్దిగా క్యారట్ రసంలో చెంచా పెరుగు వేసి.. చిక్కటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పైపెదవిపై మందపాటి లేయర్‌లా పూసుకొని పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. రోజూ ఈ చిట్కా ప్రయత్నించడం వల్ల కొన్ని రోజులలోనే ఆశించిన ఫలితాల్ని పొందచ్చు.

మరిన్ని..

* కీరాదోస రసంతోనూ పైపెదవి పైభాగంలో నల్లగా మారిన చర్మాన్ని కాంతివంతంగా మార్చవచ్చు. ఇందుకోసం కీరా రసంలో ముంచిన కాటన్ బాల్‌తో పైపెదవిపై రసాన్ని అప్త్లె చేసి కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే సరి.

* బంగాళాదుంప రసంతోనూ పైపెదవి పైభాగంలో ఏర్పడిన నలుపును క్రమంగా తగ్గించుకోవచ్చు. ఇందుకోసం కొద్దికొద్దిగా బంగాళాదుంప రసాన్ని ఐదు నిమిషాల వ్యవధిలో కనీసం గంటపాటు అప్త్లె చేసుకుంటూ ఉండాలి. అనంతరం చల్లటి నీటితో కడిగేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.

* చర్మానికి సహజసిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్‌లా పనిచేసే నిమ్మరసం కూడా ఈ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం రోజూ రాత్రి ఓ ఇరవై నిమిషాల పాటు ఈ రసాన్ని పైపెదవి పైభాగంలో అప్త్లె చేసుకోవాలి. తర్వాత నీటిలో ముంచి, పిండిన కాటన్ బాల్‌తో ఆ ప్రదేశంలో కాసేపు మసాజ్ చేసుకుంటే.. కొద్ది రోజుల్లోనే చక్కటి ఫలితం లభిస్తుంది.

మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని