అప్పుడు 2 వేలు మాత్రమే ఉండడంతో నార్మల్‌ డెలివరీనే కోరుకున్నా! - neena gupta almost did not have enough money for masaba birth
close
Published : 24/06/2021 16:12 IST

అప్పుడు 2 వేలు మాత్రమే ఉండడంతో నార్మల్‌ డెలివరీనే కోరుకున్నా!

తన మనసులోని మాటను నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా చెబుతుంటుంది అలనాటి అందాల తార నీనా గుప్తా. 1980 దశకంలో విండీస్ దిగ్గజ క్రికెటర్‌ వివియన్ రిచర్డ్స్‌తో కొంతకాలం సహజీవనం చేసిన ఆమె... మసాబాకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కొన్ని కారణాల రీత్యా అతనితో విడిపోయి సింగిల్ మదర్‌గానే తన కూతురిని పెంచి పెద్ద చేశారు. ఈ క్రమంలో సమాజం నుంచి అవమానాలు, విమర్శలు ఎదుర్కొన్నారు.. ఆర్థికంగానూ ఎన్నో ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రసవం సమయంలో నీనా పడిన ఆర్థిక ఇబ్బందుల గురించి ఆమె కూతురు మసాబా గుప్తా పంచుకుంది.

నీనా గుప్తా... హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించి ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు. 40 ఏళ్ల క్రితం మొదలైన ఆమె నటప్రస్థానం నేటికీ అప్రతిహతంగా కొనసాగుతోంది. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో హీరోయిన్‌గా, సహాయ నటిగా ప్రేక్షకులను మెప్పించిన నీనా.. పలు జాతీయ, ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలు అందుకున్నారు. అయితే నీనా సినీ జీవితమే కాదు.. వ్యక్తిగత జీవితం కూడా ఓ సంచలనమే. రిచర్డ్స్‌తో సహజీవనం... మసాబా జననం... ఆ తర్వాత అతనితో విడిపోవడం తదితర కారణాలు ఆమెను వార్తల్లో నిలిచేలా చేశాయి. రిచర్డ్స్‌ నుంచి విడిపోయాక నీనా మరొకరిపై ఆధారపడకుండా తన కూతురును పెంచి, పెద్ద చేశారు.

పుస్తక రూపంలో!

ఈ క్రమంలో- తన జీవిత సారాన్ని మొత్తం ఓ పుస్తక రూపంలో పొందుపరిచారు నీనా. ‘Sach Kahun toh’ పేరుతో రూపొందిన ఈ పుస్తకం మరికొద్ది రోజుల్లో మార్కెట్లోకి రానుంది. అయితే అంతకుముందే ఇందులోని ఓ ఆసక్తికర విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకుంది నీనా కూతురు మసాబా. ఆత్మకథలోని ఓ పేజీని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఆమె డెలివరీ సమయంలో తన తల్లి పడిన ఇబ్బందులేంటో షేర్‌ చేసింది.

నార్మల్‌ డెలివరీనే కోరుకున్నాను!

మసాబా షేర్‌ చేసిన ఆ పేజీలో నీనా ఏం రాసుకొచ్చిందంటే ‘నా డెలివరీ టైమ్‌ దగ్గర పడుతున్న కొద్దీ నాలో ఆందోళన పెరిగిపోయింది. ఎందుకంటే అప్పుడు నా దగ్గర కేవలం రూ.2 వేలు మాత్రమే ఉన్నాయి. దీంతో సాధారణ ప్రసవం జరగాలని కోరుకున్నాను. కానీ డాక్టర్లేమో కచ్చితంగా సిజేరియన్‌ చేయాల్సిందేనన్నారు. ఆ సమయంలో సర్జరీ చేయాలంటే కనీసం రూ.10 వేలైనా చేతిలో ఉండాలి. దీంతో నేను తీవ్ర ఆందోళనకు గురయ్యాను. అదృష్టవశాత్తూ ప్రసవానికి కొద్ది రోజుల ముందు ట్యాక్స్‌ రీయింబర్స్‌మెంట్‌ కింద నా బ్యాంక్‌ ఖాతాలో రూ.9 వేలు జమయ్యాయి. అలా మొత్తం రూ.12 వేలు నా బ్యాంక్‌ ఖాతాలో చేరడంతో ఊపిరి పీల్చుకున్నాను’.

నేను సి-సెక్షన్ బేబీని!

ఈ పేజీతో పాటు బుక్‌ కవర్‌ పేజీని ఇన్‌స్టాలో షేర్‌ చేసిన మసాబా ‘నేను పుట్టే సమయానికి మా అమ్మ బ్యాంక్ అకౌంట్లో కేవలం రూ.2 వేలు మాత్రమే ఉన్నాయట. అయితే ట్యాక్స్‌ రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.9 వేలు జమ కావడంతో అది కాస్తా రూ.12 వేలకు చేరింది. దీంతో నేను సి-సెక్షన్‌ బేబీనయ్యాను. అమ్మ ఆత్మకథను చదివే క్రమంలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకురావడానికి ఆమె ఎన్ని కష్టాలు పడిందో అర్థం చేసుకున్నాను. అందుకే నా జీవితంలోని ప్రతి రోజు... ప్రతి క్షణం ఆమె రుణం తీర్చుకోవడానికి కష్టపడతాను’ అని భావోద్వేగంతో రాసుకొచ్చింది.

పుస్తకం కోసం ఎదురుచూస్తున్నాం!

ఈ సందర్భంగా మసాబా షేర్‌ చేసిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘నీనా మేడమ్‌ ఎంతో బలమైన మహిళ.. ఆమె జీవితం ఎందరికో స్ఫూర్తి.. తన ఆటో బయోగ్రఫీ కోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

‘పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్ ఇండియా’ జూన్ 14న నీనా ఆత్మకథ పుస్తకాన్ని విడుదల చేయనుంది. ఇందులో నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా నుంచి నీనా ముంబయికి చేరుకోవడం, ఎలాంటి గాడ్‌ ఫాదర్ అవసరం లేకుండా నటిగా ఎదగడం, రిచర్డ్స్‌తో రిలేషన్షిప్‌, సింగిల్‌ మదర్‌గా ఎదుర్కొన్న చేదు అనుభవాలు, రెండో వివాహం, మసాబా పెంపకం... ఇలా తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలెన్నో ఇందులో ఉన్నాయట.

 

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని