‘మిరాకిల్ మామ్‌’ పరుగు ఆగిపోయింది! - oldest athlete man kaur passes away at 105
close
Published : 31/07/2021 20:52 IST

‘మిరాకిల్ మామ్‌’ పరుగు ఆగిపోయింది!

అరవై ఏళ్లు వచ్చేసరికి కాస్త దూరం నడవడానికే ఆపసోపాలు పడుతుంటారు కొంతమంది. అయితే వందేళ్ల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా పరిగెత్తారు చండీగఢ్‌కు చెందిన మన్ కౌర్ (105). తొమ్మిది పదుల వయసులో అథ్లెట్‌గా మారి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో 20కి పైగా పతకాలు సాధించారు. ‘వయసు అనేది ఓ సంఖ్య మాత్రమే’ అని నిరూపించి యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ క్రమంలో కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఈ పరుగుల బామ్మ పరుగు ఆగిపోయింది. కొద్దిరోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆమె తాజాగా తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మన్‌కౌర్‌కు నివాళులు అర్పిస్తున్నారు.

93 ఏళ్ల వయసులో!

వందేళ్ల వయసు పైబడినప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో క్రీడల్లో పాల్గొన్నారు మన్‌కౌర్‌. అలా అని ఆమె ఎప్పుడో చిన్నప్పట్నుంచీ క్రీడల్లో పాల్గొంటోందని అనుకుంటే పొరబడినట్లే! ఎందుకంటే ఆమె క్రీడాప్రస్థానం ప్రారంభించిందే 93 ఏళ్ల వయసులో! అవునండీ.. మీరు సరిగ్గానే చదవారు.. దేవుణ్ని ఆరాధిస్తూ ఆధ్యాత్మిక చింతనతో కాలం గడపాల్సిన వయసులో ఆమెకు క్రీడల పట్ల ఆసక్తి కలగడానికి కారణం ఎవరో తెలుసా?? ఆ ఘనత మొత్తం ఆమె కుమారుడు గురుదేవ్‌దే! అతను కూడా కొన్ని ప్రపంచ మాస్టర్ గేమ్స్‌లో పాల్గొన్నాడు. వందేళ్లు పైబడినప్పటికీ ఆరోగ్యంగా ఉన్న తల్లిని చూసి క్రీడల్లో పాల్గొనేందుకు ప్రోత్సహించాడు. అంతేకాదు.. క్రీడల్లో పాలుపంచుకునేందుకు అవసరమైన శిక్షణ సైతం దగ్గరుండి మరీ తనే ఇచ్చాడు. అలా కన్నకొడుకు శిక్షణలోనే రాటుదేలిన మన్‌కౌర్ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటారు.

అత్యంత వేగంగా పరిగెత్తి!

1916 మార్చి 1న పుట్టిన మన్‌కౌర్ 2011 నుంచి ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొనడం ప్రారంభించారు. అయితే 2016లో జరిగిన అమెరికన్‌ మాస్టర్స్‌ గేమ్స్‌తో ప్రపంచ అథ్లెటిక్‌ రంగంలో మొదటిసారిగా తనను తాను పరిచయం చేసుకున్నారు. ఆ పోటీల్లో అత్యంత వేగంగా పరిగెత్తిన శతాధిక వృద్ధురాలిగా రికార్డు సృష్టించారు మన్‌కౌర్. ఆ తర్వాత 2017లో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ వేదికగా జరిగిన వరల్డ్‌ మాస్టర్స్‌ గేమ్స్‌లో 100మీటర్ల స్ప్రింట్‌ విభాగంలో స్వర్ణ పతకం అందుకున్నారు. ఆ మరుసటి ఏడాదే స్పెయిన్‌లోని మాలెగా వద్ద నిర్వహించిన వరల్డ్‌ మాస్టర్స్ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం గెల్చుకున్నారు. 2019 పోలండ్‌లో జరిగిన ఓ టోర్నమెంట్లో షాట్పుట్‌, 60 మీటర్ల స్ప్రింట్‌, 200 మీటర్లు, జావెలిన్‌ త్రో వంటి నాలుగు విభాగాల్లోనూ విజేతగా నిలవడం విశేషం. అదే ఏడాది మలేషియా వేదికగా జరిగిన ఏషియన్‌ మాస్టర్స్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ బంగారు పతకం గెల్చుకున్నారు.

‘మిరాకిల్‌ మామ్‌ ఫ్రం చండీగఢ్’!

100 ఏళ్లు పైబడిన మహిళల విభాగ పోటీల్లో ఎన్నో ప్రపంచ రికార్డులు సృష్టించి ‘మిరాకిల్‌ మామ్‌ ఫ్రం చండీగఢ్‌’ గా గుర్తింపు పొందారు మన్‌కౌర్. తన అలుపెరగని పరుగుకు గుర్తింపుగా గతేడాది మహిళా దినోత్సవం రోజున రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ‘నారీ శక్తి పురస్కారం’ కూడా అందుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆమె 15 రోజుల క్రితం చండీగఢ్‌లోని ఓ ఆయుర్వేదిక్‌ ఆస్పత్రిలో చేరారు. అయితే కోలుకోలేక తాజాగా తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తదితర ప్రముఖులు ఆమెకు నివాళి అర్పిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని సోషల్‌ మీడియా ద్వారా ఆకాంక్షిస్తున్నారు.

మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని