ఈ కరోనా వేళ కాస్త చూసి ఖర్చు పెడదాం! - pandemic savings and spending tips in telugu
close
Published : 25/06/2021 16:41 IST

ఈ కరోనా వేళ కాస్త చూసి ఖర్చు పెడదాం!

కరోనా దెబ్బకు దేశ ఆర్థిక రంగమే కాదు.. ఇంటి ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది.. ఉపాధి కోల్పోయి కొందరు.. జీతాల్లో కోతపడి మరికొందరు.. వ్యాపారాలు దెబ్బతిని ఇంకొందరు.. ఇలా డబ్బు విషయంలో ఎవరి వెతలు వారివి! నిజానికి కరోనా ఇలా మనల్ని ఇబ్బంది పెట్టినా.. కొన్ని మంచి అలవాట్లను కూడా అలవర్చిందని చెప్పుకోవాలి. పొదుపు కూడా అదే కోవకు చెందుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన వారికి కూడా అనవసరమైన ఖర్చులు ఎలా తగ్గించుకోవాలో నేర్పిందీ సంక్షోభ సమయం! అయితే ఓ సగటు ఉద్యోగిగా ప్రస్తుతం మన చేతికి అందుతోన్న డబ్బుతోనే ఇంటిని చక్కదిద్దుకోవడం, దేనికెంత ఖర్చు పెట్టాలో నిర్ణయించుకోవడం, మదుపు చేసుకోవడం.. అంటే కాస్త కష్టమే అని చెప్పాలి. అయితే అందుకు కొన్ని అంశాలు గుర్తు పెట్టుకుంటే ఈ పనులన్నీ సులభంగా పూర్తవుతాయంటున్నారు నిపుణులు. అప్పుడే ఖర్చుల్ని బ్యాలన్స్‌ చేస్తూ ఎలాంటి ఆటంకం రాకుండా ముందుకు సాగచ్చంటున్నారు. మరి, ఏంటా పొదుపు సూత్రాలు? మనమూ తెలుసుకొని పాటించేద్దామా?!

డబ్బు విషయంలో కరోనాకు ముందు ఎలా ఉన్నామో గానీ.. ప్రస్తుతం మాత్రం అలర్ట్‌గానే ఉన్నామని చెప్పాలి. ఆర్థిక రంగం ఛిన్నాభిన్నమైన ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని ఉన్న దాంట్లోనే సంతోషాన్ని వెతుక్కుంటున్నాం. అయితే ఇదే సంతోషాన్ని జీవితాంతం కొనసాగించాలంటే కొన్ని పొదుపు సూత్రాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు.

అవసరం లేకపోతే వద్దు!

ప్రతి నెలా వచ్చిన డబ్బులో ఖర్చులన్నీ పోగా ఎంతో కొంత పొదుపు చేయడం మనకు అలవాటే! అయితే ఇలా సేవింగ్ తర్వాత కూడా డబ్బు మిగిలితే వాటితో ఏదో ఒకటి కొనాలని ఆలోచించే వారే మనలో ఎక్కువగా ఉంటారు. నిజానికి ప్రస్తుతం దాని అవసరం లేకపోయినా భవిష్యత్తులో ఉపయోగపడుతుందేమోనన్న ఉద్దేశంతో ఆ వస్తువును కొనేస్తుంటారు. ప్రత్యేకించి ఆన్ లైన్ షాపింగ్ చేసేటప్పుడు డిస్కౌంట్లు ఉన్నాయనో, ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయనో ఇలా అనవసరమైనవి కూడా కొనేయడం చాలామంది విషయంలో జరుగుతుంటుంది. అయితే అది నిజంగా అనవసర ఖర్చే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇలా నెలనెలా మిగిలిన డబ్బును పొదుపు చేసుకుంటే ఏదైనా అవసరానికి ఉపయోగపడుతుంది కదా.. అని చెబుతున్నారు.

‘ఆటో-సేవింగ్‌’ చేయండి!

అందుకోసం ‘ఆటో-సేవింగ్‌ ప్లాన్‌’ ద్వారా నెలనెలా కొంత మొత్తాన్ని మీ బ్యాంక్ లో లేదా మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఇతర పెట్టుబడి పథకాల్లో ఆటోమేటిక్‌గా జమ చేసే ఆప్షన్‌ని ఎంచుకోవచ్చు.. లేదంటే తప్పనిసరి ఖర్చులు పోను మిగిలిన మొత్తాన్ని పీపీఎఫ్ ఖాతాలో లేదా ఇతర ప్రత్యేక సేవింగ్స్ అకౌంట్లో జమ చేసుకోవచ్చు. ఫలితంగా అనవసర ఖర్చులూ తగ్గుతాయి.. డబ్బూ పొదుపు చేసుకోవచ్చు. అయితే అనవసర ఖర్చులను నియంత్రించడం ద్వారా ఇలా అదనంగా మిగిలిన మొత్తాన్ని మామూలుగా నెలవారీ చేసే పొదుపులో కలపకపోవడం మంచిది. అనవసర ఖర్చులను తగ్గించడం ద్వారా ప్రతి నెలా తప్పనిసరిగా చేసే పొదుపుకి అదనంగా ఎంత మొత్తాన్ని జమ చేయగలుగుతున్నామో గమనించుకోవాలి.

ఇల్లు కొంటున్నారా? ఇవి గుర్తుపెట్టుకోండి!

కరోనా సంక్షోభం మనకు డబ్బు విలువ తెలియజేసింది.. మనం ఉన్న చోటే మనకంటూ ఓ సొంతిల్లు ఉండాలన్న విషయం గుర్తు చేసింది.. పైగా సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరికీ ఓ కల. దీనికి తోడు ఈ సంక్షోభ సమయంలో బ్యాంకులు కూడా గృహరుణాలపై వడ్డీరేట్లను భారీగా తగ్గించే సరికి.. ఇళ్ల కొనుగోళ్లకు గిరాకీ పెరిగిపోయింది. ఈ క్రమంలో పురుషులపై ఆధారపడకుండా మహిళలే స్వయంగా తమ సొంతింటి కలను సాకారం చేసుకుంటున్నారని తాజా సర్వేలు చెబుతున్నాయి. అయితే ఇది మంచి ఆలోచనే కానీ.. ఈ క్రమంలో ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవడమూ ముఖ్యమే అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం మీరు చేస్తోన్న ఉద్యోగంపై భరోసా ఉందా? గృహరుణం చెల్లించినా ఇతర ఖర్చుల కోసం డబ్బు మిగులుతోందా? ఏవైనా అవసరాలొస్తే మీ భాగస్వామి సహాయపడతారన్న నమ్మకం ఉందా? పిల్లల బాధ్యతలు, ఇంటి అవసరాలు.. వంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని.. ఎక్కడా ఏ ఇబ్బందీ రాదన్న నమ్మకం ఉంటేనే ముందుకు సాగడం మంచిదంటున్నారు. తద్వారా భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావు. ఒకవేళ ముందు ముందు ఖర్చు విషయంలో ఏమాత్రం సందేహం ఉన్నా.. ప్రస్తుతానికి ఇంటి ఆలోచన విరమించుకొని.. దానికోసం ప్రత్యేకంగా పొదుపు చేసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.

దానికోసం ఎందుకంత ఖర్చు?

కరోనా వచ్చాక ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెరిగింది.. ఇందుకోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి వెనకాడట్లేదు చాలామంది! ఇక దీనికి తోడు బరువు తగ్గాలని, ఫిట్‌గా మారాలని లక్ష్యంగా పెట్టుకున్న వారు జిమ్‌లో చేసే వ్యాయామాల కోసం బోలెడంత డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఇలా ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ విషయాలపై దృష్టి పెట్టడం మంచిదే కానీ.. మీ ఆదాయ వ్యయాలకు మించి జిమ్‌ వర్కవుట్స్‌ కోసం అంత ఖర్చు పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించమంటున్నారు నిపుణులు. అంతగా అవసరం లేదంటే జిమ్‌కి పెట్టే నెలవారీ ఖర్చుతో మీకు కావాల్సిన జిమ్‌ ఎక్విప్‌మెంట్‌ని ఒకేసారి కొనుగోలు చేసి ఇంట్లోనే ఓ మినీ హోమ్‌ జిమ్‌ని ఏర్పాటుచేసుకోవచ్చు. దాంతో మీ ఒక్కరే కాదు.. ఇంటిల్లిపాదీ వ్యాయామాలు చేయచ్చు.. మరో విషయం ఏంటంటే.. ఏదైనా ప్రత్యేక వ్యాయామం చేయాలనుకుంటే దానికి సంబంధించిన వీడియోలు, ఆన్‌లైన్‌ ట్యుటోరియల్స్‌ నెట్‌లో బోలెడున్నాయి. ఇలాంటివి చాలావరకు ఉచితంగానే ఉంటాయి.. లేదంటే తక్కువ ఖర్చుతోనే ఆయా వ్యాయామాలు సాధన చేసే వీలూ ఉంది.. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో ఉంచుకుంటే.. జిమ్‌ ఖర్చులు తగ్గించుకొని డబ్బు పొదుపు చేసినట్లే!

ఇక్కడ ఖర్చు పెట్టాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో చాలామంది ఉద్యోగాలు ఉంటాయా? పోతాయా? అన్న సందిగ్ధంలో ఉన్నాయి. ఇంకొంతమంది ఇప్పటికే ఉపాధి కోల్పోయి ఆర్థికంగా కష్టాలు అనుభవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధపడుతూ కూర్చోవడం కంటే భవిష్యత్తు గురించి సానుకూల దృక్పథంతో ముందుకెళ్లడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం, మీ చదువును బట్టి కొత్త కోర్సుల్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం మంచిదంటున్నారు. అనవసర ఖర్చులు చేసే బదులు ఇలాంటి నైపుణ్యాలను మెరుగుపరచుకునేందుకు డబ్బు వెచ్చించినా దానివల్ల భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు రావడం ఖాయమంటున్నారు. ఇలా మీరు నేర్చుకున్న కోర్సులకు అనుగుణంగా ఉద్యోగ వేట సాగిస్తే ఎక్కువ డబ్బు సంపాదించచ్చు. తద్వారా పొదుపు-మదుపు, ఇతర సౌకర్యాలను సమకూర్చుకోవడానికీ ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందీ ఉండదంటున్నారు.

కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం చేతిలో ఉన్న డబ్బును ఆచితూచి పొదుపు చేసుకుంటే ఎలాంటి సంక్షోభం ఎదురైనా ఇబ్బంది ఉండదు.. అలాగే ఈ పొదుపు మంత్రాలన్నీ కరోనాతోనే ఆగిపోకుండా.. భవిష్యత్తులోనూ కొనసాగించి భావి తరాల వారికి ఆదర్శంగా నిలవాలని సూచిస్తున్నారు నిపుణులు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని