కరోనా నుంచి కోలుకుంటున్నా .. రెండో బేబీ కోసం ప్లాన్ చేసుకోవచ్చా? - recovering from corona.. can i plan second baby
close
Updated : 14/06/2021 19:29 IST

కరోనా నుంచి కోలుకుంటున్నా .. రెండో బేబీ కోసం ప్లాన్ చేసుకోవచ్చా?

హాయ్‌ డాక్టర్‌. నా వయసు 31. బరువు 75 కిలోలు. నాకు నాలుగేళ్ల పాప ఉంది. ఇటీవలే నాకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. ఆ సమయంలో జలుబు, ఒంటినొప్పులు, అలసట.. వంటి చిన్న పాటి సమస్యలతో బాధపడ్డా. ప్రస్తుతం రికవర్ అయ్యాను. మొదటిసారి పాప పుట్టాక Temporary Family Planning చికిత్స తీసుకున్నా. ప్రస్తుతం నాకున్న మానసిక సమస్య (Psychiatric Problem)కు మందులు వాడుతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో నేను రెండో బేబీ కోసం ప్లాన్‌ చేసుకోవచ్చా? దయచేసి చెప్పండి.

- ఓ సోదరి

జ: మీకు ఇటీవలే కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందన్నారు. దాన్నుంచి మీ శరీరం పూర్తిగా కోలుకొని నార్మల్‌ కావడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. దానికి తోడు యాంటీ సైకాటిక్‌ మందులు కూడా వాడుతున్నానని రాశారు. దాదాపు ఈ మందులన్నీ గర్భస్థ శిశువు మీద దుష్ప్రభావాలు చూపించేవే! మీ ఎత్తు ఎంతో రాయలేదు కానీ మీ బరువు కాస్త ఎక్కువగానే అనిపిస్తోంది. అందుకని మీరు కొన్ని నెలల సమయం తీసుకొని మంచి జీవనశైలి అవలంబించడం ద్వారా బరువు కొద్దిగా తగ్గితే బాగుంటుంది. అలాగే మీ సైకియాట్రిస్ట్‌ని సంప్రదించి మీరు పిల్లల కోసం ప్లాన్‌ చేసుకుందామనుకుంటున్న సంగతి చెప్పి.. వారిని వీలైనంత తక్కువ దుష్ప్రభావాలుండే మందులు రాసిమ్మని అడగండి. ఈ పరిస్థితులన్నీ సర్దుకున్నాకే తర్వాతి ప్రెగ్నెన్సీకి ప్లాన్‌ చేసుకోవడం మంచిది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని