బరువు తగ్గినా బొద్దుగా ఉండడమంటేనే ఇష్టం! - shehnaaz gill opens up on her weight loss journey
close
Updated : 30/06/2021 20:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బరువు తగ్గినా బొద్దుగా ఉండడమంటేనే ఇష్టం!

సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అభినయంతో పాటు అందమూ ఉండాల్సిందే. ప్రధానంగా శరీర సౌష్టవం.. అంటే నాజూగ్గా ఉండే అమ్మాయిలకే అక్కడ క్రేజ్‌ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారే ఎక్కువ రోజులు చిత్ర పరిశ్రమలో కొనసాగుతారు. అందుకే సినిమా అవకాశాల కోసం చాలామంది ఇష్టం లేకున్నా బరువు తగ్గి స్లిమ్‌గా మారిపోతుంటారు. ఈనేపథ్యంలో తాను కూడా అలాగే చేశానంటోంది ప్రముఖ బుల్లితెర నటి షెహ్‌నాజ్‌ కౌర్‌ గిల్‌. గతంలో బొద్దుగా కనిపించిన ఈ భామ కొన్ని నెలల క్రితం సన్నజాజి తీగలా మారిపోయింది. అదెంతలా అంటే.. సుమారు ఆరు నెలల్లో 12 కిలోల దాకా తగ్గిందట ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు తన వెయిట్‌ లాస్‌ జర్నీని సోషల్‌ మీడియా వేదికగా మనందరితో పంచుకుంది.

బిగ్‌బాస్‌తో సూపర్‌ క్రేజ్‌

సంప్రదాయ సిక్కు కుటుంబానికి చెందిన షెహ్‌నాజ్‌ చిన్నప్పుడే నటి కావాలనుకుందట. అందుకే యాక్టింగ్‌తో పాటు పాటలు కూడా పాడడం నేర్చుకుంది.  మొదట మోడల్‌గా కెరీర్‌ ఆరంభించింది. వరుసగా మ్యూజిక్‌ ఆల్బమ్‌లు, వీడియోలు చేసింది. ఇదే పాపులారిటీతో బాలీవుడ్‌ బుల్లితెరపై అడుగుపెట్టింది. కొన్ని పంజాబీ సినిమాల్లోనూ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అయితే బిగ్‌బాస్‌-13 సీజన్‌తో తన క్రేజ్‌ను అమాంతం పెంచేసుకుంది షెహ్‌నాజ్‌. ఈ రియాలిటీ షోలో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచి హిందీ సినీ ప్రియులకు మరింత చేరువైంది. ప్రస్తుతం ఆమె ప్రముఖ హిందీ నటులు సోనమ్‌ బాజ్వా, దిల్జీత్ దొసాంజ్‌లతో కలిసి ‘హోన్‌స్లా రఖ్‌’ అనే సినిమాలో నటిస్తోంది.

బొద్దుగా కనిపించడమంటేనే ఇష్టం!

ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ డాబూ రత్నానీతో కలిసి ఆమె నిర్వహించిన ఫొటోషూట్‌ ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా యూట్యూబ్‌ ద్వారా తన ఫ్యాన్స్‌తో ముచ్చటించిన ఆమె తన వెయిట్‌ లాస్‌ జర్నీ గురించి చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఒక అభిమాని ‘మీరు ఇప్పటి కంటే బిగ్‌బాస్‌-13 లోనే అందంగా  ఉన్నారు’ అని చెప్పగా...‘మీ ప్రేమకు ధన్యవాదాలు. అప్పుడూ నేనే.. ఇప్పుడూ నేనే.. అయితే మరింత అందంగా కనిపించాలని కోరుకున్నాను. ఇప్పటికీ ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఈ క్రమంలోనే ఇలా నాజూగ్గా మారుతున్నా. మీరు మళ్లీ తిరిగి నన్ను బొద్దుగా చూడాలని కోరుకుంటే...ఏ క్షణంలోనైనా నన్ను నేను లావుగా మార్చుకోగలను. అదేమంత పెద్ద కష్టం కాదు. ఇప్పుడు తింటున్న దానికంటే కొంచెం ఎక్కువ తింటే సరిపోతుంది.. మీరన్నట్లుగా బొద్దుగా కనిపించడమంటేనే నాకూ ఇష్టం’.

జిమ్‌కి వెళ్లను!

‘అయితే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలంటే మాత్రం మన లుక్‌ను మార్చుకోవాల్సిందే. అక్కడ నాజూగ్గా, సన్నజాజి తీగలా ఉన్న అమ్మాయిలకే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఇక అధిక బరువును తగ్గించుకోవడానికి నేనేమీ పెద్ద పెద్ద వ్యాయామాలు చేయలేదు. జిమ్‌కు వెళ్లడం నాకేమాత్రం ఇష్టం ఉండదు. అందుకే ఆహారపుటలవాట్లలో కొన్ని మార్పులు చేసుకున్నా. బరువు తగ్గాలంటే చక్కెర, ఉప్పుకు దూరంగా ఉండాలని నా వ్యక్తిగత సహాయ సిబ్బంది తరచూ నాతో చెబుతుండేవారు. అయితే మనం ఎంత పరిమాణంలో ఆహారం తీసుకుంటున్నామన్న దానిపైనే మన బరువు, ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. నేను ఇదే చిట్కా ఫాలో అయ్యాను. మీరు కూడా అధిక బరువును తగ్గించుకోవాలంటే నాలాగే తక్కువగా తినడం అలవాటు చేసుకోండి.’

ఇదే నా డైట్‌ ప్లాన్‌..!

‘ఇక నా డైట్‌ ప్లాన్‌ విషయానికొస్తే..

* ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో మూంగ్‌ సలాడ్‌ (పెసళ్లతో చేసిన సలాడ్‌), టీ తీసుకుంటా.

* మధ్యాహ్నం లంచ్‌లోకి అన్నం, పప్పుతో పాటు సబ్జీ (కాయగూరలన్నీ కలిపి తయారుచేసే కూర) తీసుకుంటాను.

* ఇక రాత్రికి పాలు మాత్రమే తాగుతాను.

* మాంసం, చాక్లెట్స్‌, ఐస్‌క్రీమ్స్‌.. వంటివి నా మెనూలో నుంచి పూర్తిగా తొలగించా. నటిగా రాణించాలనేది నా చిన్ననాటి కోరిక. అందుకోసమే కొన్నేళ్లుగా కష్టపడుతున్నాను. అందుకు ప్రతిఫలమే ఈ లుక్‌. అయితే కోరుకున్న పేరు ప్రతిష్ఠలు, డబ్బు వచ్చాయి కదా.. అని ఇక్కడితో ఆగిపోలేను. నేను కోరుకున్న దారిలో అత్యుత్తమంగా నన్ను చూడాలనుకుంటున్నాను. అందుకోసం కష్టపడుతూనే ఉంటాను’ అని చెబుతోందీ అందాల తార.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని