వాళ్లు మళ్లీ ఉద్యోగంలో చేరేలా ప్రోత్సహిస్తోంది! - sheryl sandberg share the story of sphoorti who empowering other women in their community
close
Updated : 06/07/2021 20:37 IST

వాళ్లు మళ్లీ ఉద్యోగంలో చేరేలా ప్రోత్సహిస్తోంది!

Photo: Twitter

కరోనా రాకతో మహిళలకు ఇంట్లో పనులు ఊపిరాడకుండా చేస్తున్నాయి.. ఉన్న ఉద్యోగం ఉంటుందో, పోతుందోనని మరోవైపు టెన్షన్‌.. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోలేక, మానసిక ఆందోళన పడలేక.. ఇక మా వల్ల కాదంటూ తాము చేస్తోన్న ఉద్యోగానికి రాజీనామా చేశారు ఎంతోమంది మహిళలు. కష్టమో, నిష్ఠూరమో ఇంటి వద్దే ఉండాలని నిర్ణయించుకున్నారు. అలాంటి మహిళలందరినీ తిరిగి ఆఫీసుకు రప్పిస్తోంది బెంగళూరుకు చెందిన స్ఫూర్తి కుమార్. ‘లీన్‌ ఇన్’ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తోన్న స్ఫూర్తి కరోనా సమయంలో ఉద్యోగం మానేసిన మహిళల ఇళ్లకు వెళ్లి.. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి.. వారు తిరిగి ఉద్యోగంలో చేరేలా ప్రేరణ కల్పిస్తోంది. అందుకే ఆమె చేస్తోన్న ఈ మంచి పనిని సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసించారు ఫేస్‌బుక్‌ సీఓఓ షెరిల్‌ శాండ్‌బర్గ్‌. అంతేనా.. ఆమె కథను ఓ సుదీర్ఘ పోస్ట్‌ రూపంలో పంచుకోగా అది కాస్తా వైరల్‌గా మారింది.

‘మహిళలంతా ఒక్కటైతే ఒకరి దగ్గర్నుంచి మరొకరు బోలెడన్ని విషయాలు నేర్చుకుంటారు.. తమ తమ లక్ష్యాలను అందుకుంటారు’ అంటారు షెరిల్‌. మహిళల్ని సాధికారత వైపు నడిపించడానికే 2013లో ‘లీన్‌ ఇన్‌’ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారామె. దాదాపు అన్ని దేశాల్లో ఈ సంస్థ శాఖలున్నాయి. మన దేశంలోనూ బెంగళూరుతో పాటు హైదరాబాద్‌, ముంబయి, దిల్లీ, గురుగ్రామ్‌, పుణే.. తదితర నగరాల్లోనూ ఈ సంస్థ శాఖల్ని ప్రారంభించి.. మహిళల్ని తమకు నచ్చిన రంగాల్లో ప్రోత్సహిస్తోంది.

ఆమె అందరికీ ‘స్ఫూర్తి’!

అయితే బెంగళూరు లీన్‌ ఇన్‌ శాఖలో నెట్‌వర్క్‌ లీడర్‌గా పనిచేస్తోన్న స్ఫూర్తి గురించి ఇటీవలే ప్రత్యేకంగా ప్రశంసించారు షెరిల్‌. కరోనా ప్రతికూల పరిస్థితుల్లో వ్యక్తిగత కారణాలు, ఇంటి బాధ్యతల దృష్ట్యా ఉద్యోగం మానేసి ఇంటికే పరిమితమైన మహిళల్ని తిరిగి ఉద్యోగంలో చేర్పించే బృహత్తర బాధ్యతను తన భుజాల పైకి ఎత్తుకోవడంతో పాటు దాన్ని సమర్థంగా నిర్వర్తిస్తుండడమే ఇందుకు కారణం. అందుకే స్ఫూర్తి చేస్తోన్న పనిని అభినందిస్తూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ రాసుకొచ్చారు షెరిల్.

స్ఫూర్తి (ఎడమ నుంచి రెండో మహిళ) తన టీమ్‌తో దిగిన ఫొటోను పంచుకుంటూ.. ‘కరోనా రెండో దశ భారత్‌లోని అన్ని రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది.. ఇక్కడి లీన్‌ ఇన్‌ సంస్థలో సభ్యులైన కొంతమంది మహిళా లీడర్స్‌ కూడా ఈ మహమ్మారి కారణంగా ఎంతో నష్టపోయారు. వాళ్లలో తమ ప్రియమైన కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన వారూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే నేను కొంతమంది సభ్యులతో మాట్లాడాను. కరోనా సమయంలో వారు ఎదుర్కొన్న సవాళ్లు, గడ్డు పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నాను. ఈ క్రమంలోనే వాటిని ఎదుర్కోవడానికి ఒకరికొకరు అండగా నిలిచిన విధానం గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయా. ఒక మహిళే సాటి మహిళ కష్టాలు, పరిస్థితులు అర్థం చేసుకోగలదని.. అండగా నిలవగలదని కొంతమంది చేస్తోన్న పనులు చూస్తే నాకు అర్థమైంది.

ఇంటింటికీ వెళ్లి.. వారిని ఒప్పించి!

మా సంస్థలో నెట్‌ వర్క్‌ లీడర్‌గా పనిచేస్తోన్న స్ఫూర్తి కుమార్‌ కూడా అలాంటి అమ్మాయే! కరోనా పరిస్థితుల్లో ఇటు ఉద్యోగాన్ని, అటు ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు, కుటుంబ బాధ్యతల్ని సమన్వయం చేసుకోలేక ఎంతోమంది మహిళలు రాజీనామా చేశారు. అయితే అలాంటి మహిళలందరూ  తిరిగి ఉద్యోగంలో చేరేలా చైతన్యం కలిగిస్తోంది స్ఫూర్తి. ఆ మహిళల భర్తలు, ఇతర కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లి.. ఒక మహిళ ఉద్యోగం చేయడం ఆమెకు, ఆమె కుటుంబానికి ఎంత ప్రయోజనకరమో వారికి వివరిస్తున్నారు. ఇంటి పనులన్నీ తనకే వదిలేయడం కాకుండా.. తలా ఓ పని చొప్పున విభజించుకుంటే అటు తన ఉద్యోగానికి భంగం కలగదని, తనపై అదనపు భారం పడదని, ఇటు పనులూ సమయానికి పూర్తవుతాయని వారితో అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే గతంలో ఉద్యోగం మానేసిన మహిళలంతా దాదాపు తిరిగి పనిలోకి వస్తున్నారు. నిజంగా తను చేస్తోన్న ఈ ప్రయత్నం ప్రశంసనీయం! థ్యాంక్యూ స్ఫూర్తి! ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మహిళలంతా ఒకరికొకరు అండగా ఎలా నిలవాలో ప్రత్యక్షంగా నిరూపించారు.. మహిళల మధ్య కావాల్సింది ఇలాంటి ఐక్యతే!’ అంటూ స్ఫూర్తిని ఆకాశానికెత్తేశారామె. ఇలా షెరిల్‌ పెట్టిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా స్ఫూర్తి చేస్తోన్న మంచి పనిని ప్రశంసిస్తూ కామెంట్లు పోస్ట్‌ చేస్తున్నారు.
హ్యాట్సాఫ్‌ స్ఫూర్తి!

మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని