విమానం తోక చూపిస్తే.. అది ఏ దేశానిదో చెప్పేస్తుంది!  - six years old girl identifies 93 airlines by their plane tails in one minute
close
Updated : 13/07/2021 19:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విమానం తోక చూపిస్తే.. అది ఏ దేశానిదో చెప్పేస్తుంది! 

Photo: Screengrab

‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్నట్లు ఈ మధ్య కాలంలో పిల్లలు తమలో ఉన్న అద్భుత మేధోశక్తిని, జ్ఞాపక శక్తిని వివిధ రకాలుగా చాటుకుంటున్నారు. కొందరు ప్రపంచ దేశాల పేర్లతో పాటు వాటి రాజధానులు, కరెన్సీలను గుక్క తిప్పుకోకుండా చెబుతుంటే.. మరికొందరు వివిధ భాషల్లో పాటలు పాడుతున్నారు.. శ్లోకాలు చెబుతున్నారు. హరియాణాలోని పంచకులకు చెందిన ఆర్నా గుప్తా కూడా ఈ కోవకే చెందుతుంది. విమానం తోక చూసి అది ఏ దేశానికి చెందినదో చిటికెలో చెప్పేస్తోందీ ఆరేళ్ల చిన్నారి. ఈ క్రమంలో నిమిషంలోనే 93 దేశాలకు చెందిన విమానాలను గుర్తుపట్టి ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించింది.

సింగపూర్‌ టు స్విట్జర్లాండ్‌!

మన జాతీయ జెండా మినహా ఇతర దేశాల జాతీయ జెండాలను చూపించి అది ఏ దేశానిదో గుర్తుపట్టమంటే అన్నీ గుర్తుపట్టలేం. అలాంటిది కేవలం విమానం తోక చూపించగానే ఒక్క సెకను కూడా గ్యాప్‌ ఇవ్వకుండా అది ఏ దేశానికి చెందిన విమానయాన సంస్థో ఇట్టే చెబుతోంది ఆర్నా. ఈ నేపథ్యంలో ఇటీవల ఒకే ఒక్క నిమిషంలో 93 దేశాలకు చెందిన విమానాలను గుర్తించి ‘ఇంటర్నేషనల్ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. అతిపెద్ద సింగపూర్‌ ఎయిర్‌ లైన్స్‌ నుంచి మలేషియా, థాయిలాండ్‌, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన విమానయాన సంస్థలన్నీ ఆర్నా గుర్తుపట్టిన వాటిలో ఉన్నాయి.

రెండేళ్ల వయసు నుంచే!

చండీగఢ్‌లోని ఓ పాఠశాలలో చదువుతోన్న ఆర్నాకు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే ఎంతో ఆసక్తి. కేవలం తెలుసుకోవడమే కాదు.. వాటిని ఎప్పటికప్పుడు తన మెదడులో పదిలంగా దాచుకోవడమూ ఈ చిన్నారికి అలవాటు. అందుకే వాటి గురించి నిద్రలో లేపి అడిగినా టక్కున చెప్పేస్తుంటుంది. దీనికి ఆమె తల్లి నేహా గుప్తా ప్రోత్సాహం కూడా తోడైంది. ఫలితంగా తన జ్ఞాపక శక్తితో ప్రపంచ రికార్డులు కొల్లగొడుతోంది.

‘నా తల్లిదండ్రులు, ముఖ్యంగా అమ్మ అందించిన ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపిస్తోంది. ఆమె చెప్పినట్లు ప్రాక్టీస్‌ చేసినందుకే ప్రతి విషయాన్నీ సులభంగా గుర్తుపెట్టుకోగలుగుతున్నాను. ఇక తాజాగా ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడం వెనక అమ్మానాన్నలతో పాటు మా పాఠశాల ఉపాధ్యాయుల కృషి కూడా ఉంది. అందుకు వారికీ ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను’ అని చెప్పుకొచ్చిందీ సూపర్‌ కిడ్‌.

గతంలోనూ!

ఆర్నా ప్రపంచ రికార్డులు సృష్టించడం ఇదే మొదటిసారి కాదు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 120 మంది ప్రముఖుల పేర్లను గతేడాది ఆగస్టులో కేవలం 92 సెకన్లలో చెప్పి ‘Triumph World Records’ లో చోటు దక్కించుకుంది. ఇలా తన ప్రతిభతో ప్రపంచ రికార్డులు సృష్టిస్తోన్న ఆర్నాను చూసి ఆమె తల్లి నేహా గుప్తా తెగ సంబరపడిపోతున్నారు. ‘రెండేళ్ల వయసులోనే నా కూతురుకు అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉందని గ్రహించాను. అప్పటినుంచే మేం ఆమెను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నాం. నా గారాల పట్టి భవిష్యత్‌లో మరెన్నో ప్రపంచ రికార్డులు సృష్టించగలదు’ అని ధీమాగా చెబుతున్నారు నేహా.

ప్రోత్సహిస్తే చిన్న వయసులోనే పిల్లలు అద్భుతాలు సృష్టించగలరు అనడానికి ఆర్నానే చక్కటి ఉదాహరణ!



మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని