పాప కారణంగా మా మధ్య దూరం పెరుగుతోంది.. ఏం చేయాలి? - space increases between me and my husband because of our daughter
close
Published : 01/10/2021 16:09 IST

పాప కారణంగా మా మధ్య దూరం పెరుగుతోంది.. ఏం చేయాలి?

మేడం.. ప్రస్తుతం నేను 11నెలల వయసున్న బిడ్డకు తల్లిని. మా పాప చాలా హైపర్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడూ నాతో ఆడుతూనే ఉంటుంది. ఉదాహరణకు పాప ఒక 40ని|| నిద్రపోతే 4గం||పాటు నాతో ఆడుకునేందుకే మొగ్గుచూపుతుంది. రాత్రిళ్లు కూడా అర్ధరాత్రి 2 లేదా 3గం|| వరకు మాత్రమే పడుకుంటుంది. పాప పడుకున్న సమయంలో ఏ చిన్న శబ్దం వచ్చినా వెంటనే నిద్ర లేస్తుంది. మళ్లీ నిద్రపోకుండా ఆడుతూనే ఉంటుంది. పాప కారణంగా నా భర్త లైంగికంగా నాతో సంతోషం ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ నా కూతురు నన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో నా భర్తను సంతోషపెట్టడం ఎలాగో నాకు తెలియడం లేదు. ఏమైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ: పాప ఆరోగ్యంగా, ఆనందంగా ఆడుకుంటూ ఉండడం అనేది ఆరోగ్యకరమైన లక్షణమే. అయితే తను సరిగ్గా నిద్రపోకపోవడానికి గల కారణాలేంటో విశ్లేషించడానికి ప్రయత్నించండి. అంత చిన్న వయసులో అంత తక్కువ నిద్ర ఎలా సరిపోతోంది? ఇందుకు గల కారణాలేంటి? తన చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంటుంది? ఎక్కువగా వెలుతురు ఉండడం, తరచూ శబ్దాలు రావడం, కడుపు నొప్పి, ఉబ్బరంగా అనిపించడం.. పాప నిద్రపోయేందుకు అనుకూలమైన వాతావరణం లేకపోవడం.. ఇలాంటి కారణాలేమైనా ఉన్నాయేమో ఓసారి పరిశీలించండి. అలాగే కారణాలు ఏవైనా.. పాపకు తగిన నిద్ర ఉండట్లేదు కాబట్టి ముందుగా చిన్న పిల్లల వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మీరు చెప్పిన దాని ప్రకారం మీ చిన్నారి ఎక్కువగా మీతో ఆడుకునేందుకే మొగ్గుచూపుతోందంటున్నారు. పాప అలా నిరంతరం మీ శ్రద్ధ కోరుకోవడానికి మీ ప్రవర్తనపరంగా కూడా కారణాలు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి విశ్లేషించుకోండి. అంటే పాప ఏడవగానే ఎత్తుకోవడం, మీ ప్రేమ కొద్దీ అతిగా ముద్దుచేస్తుండడం, తనంతట తాను ఆడుకుంటున్నా సరే.. ఆ చుట్టుపక్కలే మీరూ ఉండడం.. ఇలాంటివన్నీ తనని ప్రభావితం చేస్తున్నాయేమో ఆలోచించండి. అలాగే మీ పాప బాధ్యతలను భర్తతో కలిసి పంచుకోవడం, సాయంత్రం వేళల్లో వీలైనంత త్వరగా పాప కడుపు నింపి నిద్రపుచ్చడం, మిగతా సమయాల్లో నిద్ర వేళలు కాస్త తగ్గించి రాత్రి వేళల్లో ఎక్కువ సమయం నిద్రపోయేలా చూడడం.. ఇలాంటి ప్రయత్నాలు చేసి చూడండి. చిన్న పిల్లల వైద్యనిపుణులను సంప్రదిస్తే ఇలాంటి చిట్కాలు చాలా సూచిస్తారు. వాటిని అనుసరించడం ద్వారా మీ పరిస్థితుల్లో కాస్త మార్పు రావచ్చు.

ఇక మీ ఆలుమగల విషయానికొస్తే ఇద్దరి మధ్యా చక్కని అవగాహన ఉండేందుకు ఇద్దరూ కలిసి పాప బాధ్యతలు పంచుకోవడానికి ప్రయత్నించండి. ఇలా ఇద్దరూ కలిసి పాపతో సమయం గడపడం ద్వారా ఒత్తిడి తగ్గించుకోవడమే కాకుండా పాప నిద్రపోయిన తర్వాత ఒకరికొకరు సమయం కేటాయించుకునే వీలు ఉంటుంది. కాబట్టి మీరిద్దరూ అవకాశం ఉన్నంతలో పాప బాధ్యత పంచుకుంటూ, చక్కటి అవగాహనతో మీ బంధాన్ని మరింత బలపరుచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పాప దృష్టి కేవలం మీపైనే కాకుండా మీ భర్తపై కూడా ఉంటుంది. ఫలితంగా మీకు లభించే ఆ కాస్త విరామ సమయంలో పనులు చేసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం.. వంటివి చేయచ్చు. నిపుణుల సహాయంతో పాప ఆహారం, ఆరోగ్యం, నిద్ర.. వంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తే మీ సమస్యకు సులభంగా పరిష్కారం లభిస్తుంది.


Advertisement


మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని