మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? - symptoms of stress in kids in telugu
close
Published : 28/06/2021 15:43 IST

మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

ఈ రోజుల్లో చాలామంది ఏదో ఒక సమస్యతో ఒత్తిడికి లోనవుతున్నారు. దీనివల్ల సమస్య పరిష్కారం కాకపోగా ఇతర అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అయితే పెద్దవాళ్లు మాత్రమే ఒత్తిడికి లోనవుతారనుకుంటే అది పొరపాటే. చదువుకునే చిన్నారులు సైతం ఒత్తిడికి లోనవుతున్నారని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఇలాంటి సందర్భాలలో తల్లిదండ్రులుగా మీరే దానికి సరైన పరిష్కార మార్గం చూపించగలుగుతారు. అయితే, మాకు ఆ విషయం ఎలా తెలుస్తుంది? అనుకుంటున్నారా? పిల్లలు ఒత్తిడికి లోనైనప్పుడు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో? చిన్నారులను ఒత్తిడి నుంచి ఎలా బయటపడేయాలో తెలుసుకుందాం రండి...

అనారోగ్యంగా ఉన్నారా..?

కొంతమంది పిల్లలు ఒత్తిడికి లోనైనప్పుడు తలనొప్పి, కడుపు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ఇవి సాధారణంగా కూడా వస్తాయి కదా! అనే సందేహం రావచ్చు. అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని పిల్లల్లో తరచుగా ఈ సమస్య వస్తుంటే దానిని ఒత్తిడి కిందే పరిగణించాలి. టీచర్లు ఇచ్చిన హోమ్‌ వర్క్‌ చేయలేకపోవడం, పరీక్షలకు సరిగా సన్నద్ధం కాకపోవడం వంటి వాటి వల్ల కూడా వారు ఒత్తిడి చెందవచ్చు. ఇలాంటివి తల్లిదండ్రులకు చెబితే ఎక్కడ తిడతారోననే భయం కూడా వారిలో ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో వారిని మీరే దగ్గరకు తీసుకొని అసలు సమస్యేంటో నెమ్మదిగా అడిగే ప్రయత్నం చేయాలి. అలాగే వారికి ధైర్యం చెబుతూ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించాలి.

ఫోన్లో ఆటలా..?

ఈ మధ్య స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగి అది ఒక నిత్యావసరంగా మారింది. అందులోనూ కరోనా కారణంగా ఆన్‌లైన్‌ క్లాసులు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు వారికంటూ ప్రత్యేకంగా ఒక ఫోను కొనిస్తున్నారు. అయితే సాధారణంగా పిల్లలు ఎక్కువగా ఫోన్లలో ఆటలు ఆడడానికే ప్రయత్నిస్తుంటారు. కొన్ని ఆటల వల్ల పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ కొన్ని ఆటలు మాత్రం పిల్లల్లో ఒత్తిడిని పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో పిల్లలు ఒత్తిడికి గురవుతున్నామన్న విషయం కూడా వారికి తెలియదట. అలా అని వారిని అసలు ఫోన్లకే దూరం చేయడం కూడా మంచిది కాదు. ఒకవేళ వారికి ఫోన్ ఇచ్చినా దానికంటూ కొంత సమయం కేటాయించండి. అలాగే వారు ఆడే ఆటలు, చూసే వీడియోలపై కూడా ఓ కన్నేసి ఉంచడం ఎంతైనా అవసరం.

ఎలా తింటున్నారు?

మనం ఆహారం తీసుకునే విధానంలో ఒత్తిడికి లోనవుతున్నామో లేదో తెలిసిపోతుందట. ఇది కేవలం పెద్దలకే కాదు.. పిల్లలకు కూడా వర్తిస్తుంది. మీ పిల్లలు అంతకుముందు కంటే ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం కానీ, తక్కువగా తీసుకోవడం కానీ జరుగుతుంటే దానిని ఒత్తిడి కిందే పరిగణించాలి. వారు ఏదైనా విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం వల్ల ఇలా చేస్తుండచ్చు. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తుంటే వారి సమస్యను తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయండి.

ఏకాగ్రత తగ్గుతోందా?

ఒత్తిడిలో ఉన్నప్పుడు మనం ఏ పనీ సరిగ్గా చేయలేం. ముఖ్యంగా చదువు విషయంలో ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అయితే ఒత్తిడి అనేది ఎప్పుడూ బయటి అంశాల పైనే ఆధారపడి ఉండదు. కొన్ని సందర్భాల్లో మనం చేసే పనులను సరిగా నిర్వర్తించనప్పుడు కూడా ఒత్తిడికి లోనవుతుంటాం. అలాగే పిల్లలు కూడా చదువు విషయంలో వారు పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతే కొన్నిసార్లు ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ క్రమంలో వారికి అండగా ఉంటూ తగిన సహకారం అందించాలి. తద్వారా వారిని ఒత్తిడి నుంచి బయటపడేయచ్చు.

ఇవి కూడా..

* కొంతమంది వారికి వచ్చిన సమస్యను పెద్దదిగా చూసుకొని తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. దాంతో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉండడం లేదా మధ్యలోనే వెళ్లిపోవడం వంటివి చేస్తుంటారు. పిల్లలు కూడా ఇలా చేసే అవకాశం ఉంది.

* కొంతమంది పిల్లలు ఒత్తిడికి లోనైనప్పుడు రాత్రుళ్లు పక్క తడుపుతుంటారు. చిన్న పిల్లల్లో అయితే ఇది పెద్ద సమస్య కాదు.. కానీ స్కూలుకి వెళ్లే వయసున్న వారు కూడా ఇలా చేస్తుంటే వాళ్లు ఒత్తిడి చెందుతున్నారని భావించాల్సిందే.

* కొంతమంది పిల్లలకు పీడకలలు వస్తుంటాయి. అయితే అవి ఎప్పుడో ఒకసారి అయితే ఫర్వాలేదు కానీ తరచుగా వస్తుంటే అది ఒత్తిడి సమస్యేనని భావించాలి.

మీ పిల్లల్లో కూడా ఇలాంటి లక్షణాలు ఉంటే ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడండి. వారి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయండి. వారికి కావాల్సిన సహాయం చేసి చూడండి. ఒకవేళ అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే నిపుణులను సంప్రదించే ప్రయత్నం చేయండి.

మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని