అలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకుంటా! - taapsee pannu opens up about her marriage plans
close
Published : 11/07/2021 12:24 IST

అలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకుంటా!

కాబోయే వాడి గురించి ప్రతి ఒక్క అమ్మాయికీ కొన్ని కోరికలు, ఆలోచనలుంటాయి.   ‘అందంగా ఉండాలి... అంతకంటే మంచి మనసుండాలి.. ఆరడుగులుండాలి..’ అంటూ కట్టుకోబోయే భర్తలో ఉండాల్సిన లక్షణాల గురించి చిట్టా విప్పుతుంటారు అమ్మాయిలు. ఈ క్రమంలో తనకు కాబోయే రాకుమారుడిలోనూ కొన్ని లక్షణాలు కచ్చితంగా ఉండాలంటోంది బాలీవుడ్‌ నటి తాప్సీ. ‘హసీనా దిల్‌రుబా’ సినిమాతో ఇటీవలే సినీ ప్రేమికుల్ని పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలో ఓ సందర్భంలో పంచుకుంది.

బాలీవుడ్‌లో నాయికా ప్రాధాన్య చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది తాప్సీ. గతేడాది ‘థప్పడ్‌’తో సినీ ప్రియులను మెప్పించిన ఈ భామ.. ఇటీవల ‘హసీనా దిల్‌రుబా’తో మరోసారి మన ముందుకు వచ్చింది. ఇక డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ఆటగాడు మథియాస్‌ బోయేతో ఆమె రిలేషన్‌షిప్‌లో ఉందన్న వార్తలు వస్తున్నప్పటికీ, ఈ విషయంలో మాత్రం పెదవి విప్పట్లేదీ సొట్టబుగ్గల బ్యూటీ. అయితే తన పెళ్లికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను మాత్రం ఇటీవలే షేర్‌ చేసుకుంది తాప్సీ.

నాకు నచ్చితే చాలదు..!

‘నా వివాహం గురించి అమ్మానాన్న ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. సినిమాల్లో బిజీగా ఉంటూ ఇంకా ఎప్పటికీ ఇలాగే పెళ్లి కాకుండా మిగిలిపోతానేమోనని బాధపడుతున్నారు. నాకు నచ్చిన వాడితో త్వరగా పెళ్లిపీటలెక్కమని కోరుతున్నారు. అయితే నాకు ప్రస్తుతం పెళ్లి గురించిన ఆలోచనలేమీ లేకపోయినా.. కాబోయే భర్త ఎలా ఉండాలన్న విషయంపై మాత్రం పూర్తి స్పష్టత ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా.. నాకు కాబోయే వాడు నాకు మాత్రమే నచ్చితే సరిపోదు.. నా తల్లిదండ్రులకు కూడా నచ్చి తీరాలి. నాతో ఉన్నట్లే మా పేరెంట్స్‌తోనూ కలివిడిగా ఉండేవాడు దొరికితేనే పెళ్లిపీటలెక్కుతాను. నేను డేటింగ్‌ చేసే వారితోనూ ముందు ఇదే విషయం చెబుతా. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రిలేషన్‌షిప్‌కు కావాల్సిన సమయం కేటాయిస్తాను. అయితే అనవసరంగా టైంపాస్‌ మాత్రం చేయాలనుకోను’.

అనుకున్నది సాధించిన తర్వాతే!

‘వృత్తిగత జీవితానికి సంబంధించి కోరుకున్న స్థాయికి నేనింకా చేరుకోలేదు. కెరీర్‌ పరంగా నేను అనుకున్నది సాధించిన తర్వాత నా పనిని తగ్గించుకుంటాను. ఏడాదికి ఐదారు సినిమాల బదులు కేవలం రెండు, మూడు సినిమాలే చేస్తాను. అప్పుడే నా వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించే సమయం నాకు దొరుకుతుంది..’ అని చెప్పుకొచ్చిందీ అందాల తార.

సినిమా తప్ప...ఏ రంగమైనా ఓకే!

ఇప్పుడే కాదు గతంలోనూ పలుసార్లు తన పెళ్లి, కాబోయే వరుడి గురించి నోరు విప్పింది తాప్సీ. ‘సినిమా రంగం, సినిమా నేపథ్యం ఉన్న వ్యక్తిని నేను అసలు పెళ్లి చేసుకోను. సినిమా తప్ప, ఏ రంగమైనా నాకు ఓకే! నాకు సంబంధించినంత వరకు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను వేర్వేరుగా చూడాలని అనుకుంటున్నాను. ఇక మథియాస్‌ విషయానికొస్తే.. అతను నాకు బాగా తెలిసిన వ్యక్తి. మంచి స్నేహితుడు. నన్ను బాగా అర్థం చేసుకుంటాడు’ అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

ఇక సినిమాల విషయానికొస్తే.. ‘రష్మీ రాకెట్‌’, ‘జనగణమన’, ‘లూప్‌ లపేటా’, ‘దొబారా’, ‘శభాష్‌ మిథు’, ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’.. వంటి చిత్రాల్లో బిజీగా ఉందీ డింపుల్‌ బ్యూటీ.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని