పెళ్లి, పిల్లలే మన జీవితం కాదు... అందుకే అలా చేశాను! - tanisha mukherji reveals why she froze her eggs at 39
close
Updated : 08/07/2021 20:49 IST

పెళ్లి, పిల్లలే మన జీవితం కాదు... అందుకే అలా చేశాను!

అమ్మాయిలకు కాస్త వయసొస్తే చాలు ‘పెళ్లెప్పుడు?’ అంటారు. అదే పెళ్లైతే ‘పిల్లలెప్పుడు’ అని అడుగుతుంటారు. నిజానికి ఇలాంటి మాటలు మనలాంటి వారికే కాదు....సెలబ్రిటీలకూ ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో పెళ్లి, పిల్లలు అనేవి మహిళల జీవితంలో ఒక భాగమే... కానీ అవే మన పూర్తి జీవితాన్ని నిర్వచించలేవంటోంది బాలీవుడ్‌ నటి తనీషా ముఖర్జీ. ప్రముఖ బాలీవుడ్‌ తార కాజోల్‌ సోదరిగా సుపరిచితమైన ఆమె కొద్ది రోజుల క్రితం 43వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మాతృత్వం గురించి మాట్లాడిన ఈ ముద్గుగుమ్మ.. నాలుగేళ్ల క్రితం (39 ఏళ్ల వయసులో) తన అండాల్ని భద్రపరచుకున్నట్లు వెల్లడించింది.

కాజోల్ సోదరిగా!

ప్రముఖ బాలీవుడ్‌ అందాల తార కాజోల్‌ సోదరిగా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది తనీషా. ‘సర్కార్‌’, ‘సర్కార్‌ రాజ్‌’, ‘ట్యాంగో ఛార్లీ’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్టీర్‌ సరసన ‘కంత్రి’, ‘నీవల్లే  నీవల్లే’ సినిమాలతో తెలుగు సినీ ప్రియులను కూడా పలకరించింది. ప్రముఖ టీవీ రియాలిటీ షోలైన ‘బిగ్‌బాస్’, ‘ఖత్రోన్‌ కే ఖిలాడీ’లలో రన్నరప్‌గా నిలిచి టీవీ ప్రేక్షకులకూ చేరువైంది. అయితే కొన్నేళ్లుగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్న తనీషా సోషల్‌ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటోంది. తన ఫ్యాషనబుల్‌ ఫొటోలతో పాటు తన సామాజిక సేవకు సంబంధించిన ఫొటోలను తరచుగా పంచుకుంటోంది.

39 ఏళ్ల వయసులో!

కెరీర్‌, సంతాన సమస్యలు, సరైన ప్రణాళిక లేకపోవడం...ఇలా కారణమేదైనా కొంతమంది మహిళలు తమ ప్రెగ్నెన్సీని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇక వయసు పెరిగిన కొద్దీ అండాల నిల్వ తగ్గిపోవడం వల్ల వయసులో ఉన్నప్పుడే తమ అండాల్ని భద్రపరచుకుంటున్న వారు కూడా ఉన్నారు. కొన్ని నెలల క్రితం ప్రముఖ బాలీవుడ్‌ నటి మోనాసింగ్‌ పెళ్లికి ముందే ఎగ్‌ ఫ్రీజింగ్‌ పద్ధతి (అండాల్ని శీతలీకరించే పద్ధతి)ని ఎంచుకున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో తానూ తన 39 ఏళ్ల వయసులో అదే పని చేశానంటోంది తనీషా.

పదేళ్ల క్రితమే ఆ ఆలోచన వచ్చింది!

బాలీవుడ్లో బోల్డ్‌గా మాట్లాడే ముద్దుగుమ్మల్లో తనీషా కూడా ఒకరు. ఏ విషయం గురించైనా ముక్కుసూటిగా మాట్లాడే ఆమె తాజాగా పెళ్లి, మాతృత్వం గురించి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకుంది. 
‘పదేళ్ల క్రితమే (33 ఏళ్ల వయసులో) నా అండాలను భద్రపరచాలనుకున్నాను. కానీ వైద్యులు వద్దన్నారు. ఎగ్‌ ఫ్రీజింగ్‌ వల్ల శరీరాకృతి దెబ్బతింటుందని, పిల్లలు పుట్టరని ఏమాత్రం నమ్మకం లేనప్పుడే ఈ పద్ధతిని ఎంచుకోవాలన్నారు. దీంతో అప్పుడు ఆ ఆలోచనను విరమించుకున్నాను. కానీ సంతానం విషయంలో కొన్ని ప్రతికూల ఆలోచనలు నా మెదడు చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. దీంతో నాలుగేళ్ల క్రితం (39 ఏళ్ల వయసులో) మరోసారి వైద్యులను సంప్రదించాను. వారి పర్యవేక్షణలో ఎగ్‌ ఫ్రీజింగ్‌ పద్ధతిని అనుసరించాను.’

భారీగా బరువు పెరిగాను!

‘ఏ వయసులో పెళ్లి చేసుకోవాలి’? ‘ఎప్పుడు పిల్లల్ని కనాలి’? అనేవి మహిళల వ్యక్తిగత నిర్ణయాలు. ఎగ్‌ ఫ్రీజింగ్‌ అనేది కూడా పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. ఈ విధానం వల్ల నేను భారీగా బరువు పెరిగాను. ప్రొజెస్టిరాన్‌ నన్ను బొద్దుగా మార్చేసింది. బరువు సంగతి పక్కన పెడితే ఆ సమయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. మహిళల జీవితంలో అత్యంత మధుర క్షణాలు ఏవంటే... వారు గర్భంతో ఉన్నప్పుడే. అందుకే గర్భం ధరించిన మహిళలను చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది’. 

పిల్లలే కావాలనుకుంటే దత్తత తీసుకోవచ్చు!

అయితే- ‘రిలేషన్‌షిప్‌, పెళ్లి, పిల్లలు.. మహిళల జీవితంలో ఇవి కేవలం ఒక భాగం మాత్రమే. ఇవే మన పూర్తి జీవితాన్ని నిర్వచిస్తాయనడం నిజం కాదు. పిల్లలే కావాలనుకుంటే...ఈ ప్రపంచంలో ఏ తోడూ, నీడ లేని పిల్లలు ఎందరో ఉన్నారు. వారిని దత్తత తీసుకుని పెంచుకోవచ్చు. ఈ విషయం గురించి ధైర్యంగా మాట్లాడేందుకు మరికొందరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది’ అని చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

ఈ క్రమంలో- వయసు పెరిగిన కొద్దీ అండాల నిల్వ తగ్గిపోయే కారణంగా తనీషా మాదిరిగా వయసులో ఉన్నప్పుడే తమ అండాల్ని భద్రపరుచుకునే వారు ఈ రోజుల్లో పెరిగిపోతున్నారు. పెళ్లి, పిల్లలు అన్నది వ్యక్తిగత నిర్ణయం అయినప్పటికీ - ఈ రకంగా పిల్లల్ని కనడం వాయిదా వేయడం వల్ల వచ్చే సమస్యలేవైనా ఉంటాయా? ప్రత్యేకించి మహిళలు, కుటుంబ వ్యవస్థ కోణం లోంచి ఆలోచిస్తే ఇలాంటి నిర్ణయాలు ఎంతవరకు సమంజసం? మీ అభిప్రాయాలను పంచుకోండి..!


B8xuwcLl-JX

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని