అంతరిక్షంలోకి వెళ్లాలనుకుంది.. వెళ్తోంది! - telugu origin women sirisha bandla set to fly into space
close
Updated : 02/07/2021 20:01 IST

అంతరిక్షంలోకి వెళ్లాలనుకుంది.. వెళ్తోంది!

Photo: Twitter

భూమిపై నిల్చొని ఆకాశాన్ని అందరూ చూడగలరు... కానీ ఆకాశంలోకి వెళ్లి భూమిని చూడాలనే కోరిక అందరికీ ఉన్నా.. అది నెరవేరేది అతి కొద్దిమంది విషయంలోనే! తాజాగా అలాంటి అరుదైన అవకాశం దక్కించుకుంది శిరీషా బండ్ల. భారత సంతతి, అందులోనూ తెలుగు మూలాలున్న ఆమె చిన్నప్పటి నుంచి నింగిలోకి వెళ్లాలని కలలు కనేదట! ఇప్పుడు ఆ కలను సాకారం చేసుకునే సువర్ణావకాశం వచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ స్పేస్‌ ఫ్లైట్‌ సంస్థ ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ ఈనెల 11న ప్రయోగించనున్న అంతరిక్ష నౌకలో శిరీష కూడా ఆకాశయానానికి బయలుదేరుతోంది. దీంతో అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్న తొలి తెలుగు మహిళగా ఖ్యాతి గడించిందీ సూపర్‌ ఉమన్‌.

ఆరుగురిలో ఆమె!

కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌... అంతరిక్షంలోకి అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన భారతీయ వనితలు. త్వరలో శిరీష పేరు కూడా ఈ జాబితాలోకి చేరనుంది. అంతరిక్ష పర్యటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో అమెరికాకు చెందిన వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ తమ అంతరిక్ష నౌకను ఈనెల 11న నింగిలోకి పంపించనుంది. ఇప్పటికే మూడుసార్లు స్పేస్‌ఫ్లైట్లను ఆకాశంలోకి పంపిన ఈ సంస్థ.. ఈ నాలుగో ప్రయోగంలో భాగంగా తొలిసారి మనుషుల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. దీంతో ఈ అరుదైన అవకాశం దక్కించుకునేందుకు ఇప్పటివరకు 600 మంది పేర్లు నమోదుచేసుకున్నారట. న్యూ మెక్సికో నుంచి బయలుదేరే ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ ద్వారా మొత్తం ఆరుగురు కంపెనీ ప్రతినిధులు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. వీరిలో ఇద్దరు పైలట్లు, ఆ సంస్థ అధిపతి రిచర్డ్‌ బ్రాన్సన్‌తో పాటు అదే సంస్థకు చెందిన మరో ముగ్గురు ప్రతినిధులున్నారు. అందులో భారతీయ సంతతికి చెందిన శిరీష కూడా ఉంది. వర్జిన్‌ గెలాక్టిక్‌ ఉపాధ్యక్షురాలి(ప్రభుత్వ వ్యవహారాలు) హోదాలో ఆమె ఈ అంతరిక్షయానానికి బయలుదేరనుంది.

లెక్కలంటే ఇష్టం!

తమ మానవ సహిత అంతరిక్ష యానానికి శిరీష ఎంపికైందని వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ ప్రకటించగానే ఆమె స్వస్థలం గుంటూరు జిల్లాలో సంబరాలు మొదలయ్యాయి. శిరీష తల్లిదండ్రులు అనూరాధ, మురళీధర్‌ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు వాస్తవ్యులు. శిరీష పుట్టాక కుటుంబమంతా అమెరికా వెళ్లిపోయి అక్కడే స్థిరపడింది. ప్రస్తుతం వీరు వాషింగ్టన్‌లో నివాసముంటున్నారు. ఇక చిన్నప్పటి నుంచే ఆస్ట్రోనాట్‌ కావాలని కలలు కన్న శిరీషకు గణితమన్నా మహా ఇష్టమట! అక్కడి Purdue యూనివర్సిటీలో ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఆమె.. ఆపై జార్జిటౌన్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా అందుకుంది. చదువు పూర్తయ్యాక కమర్షియల్‌ స్పేస్‌ఫ్లైట్‌ ఫెడరేషన్‌ (CSF)లో ఇంటర్న్‌షిప్‌ (Space Policy Job) చేసింది. అయితే అంతకంటే ముందు టెక్సాస్‌లోని గ్రీన్‌విల్లేలో ఉన్న L-3 టెక్నాలజీస్‌ (గతంలో దీన్ని L-3 కమ్యూనికేషన్స్‌గా పిలిచేవారు) అనే ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ కంపెనీలో ఏరోస్పేస్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తించింది. ఈ క్రమంలో అధునాతన విమాన భాగాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించిందామె. ఇక 2017 నుంచి ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ సంస్థలో పనిచేస్తోంది. ప్రస్తుతం ఆ సంస్థ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతోన్న ఆమె.. అదే హోదాలో అంతరిక్షంలోకి అడుగుపెట్టి తన చిన్ననాటి కలను సాకారం చేసుకోబోతోంది.

సేవలోనూ ముందే!

ప్రస్తుతం ‘అమెరికన్‌ ఆస్ట్రోనాటికల్‌ సొసైటీ’, ‘ఫ్యూచర్‌ స్పేస్‌ లీడర్స్‌ ఫౌండేషన్‌’ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లలో సభ్యురాలిగా కొనసాగుతోంది శిరీష. అంతేకాదు.. తాను చదివిన Purdue యూనివర్సిటీలో ‘యంగ్‌ ప్రొఫెషనల్‌ అడ్వైజరీ కౌన్సిల్‌’ సభ్యురాలిగానూ ఉందామె. ఎప్పుడూ కెరీర్‌, వృత్తి అంటూ బిజీగా ఉండడమే కాదు.. సేవలోనూ ఆమె ముందే ఉంటుంది. ఈ క్రమంలో కమర్షియల్‌ స్పేస్‌ టెక్నాలజీపై ఆసక్తి చూపే విద్యార్థుల కోసం రూపుదిద్దుకున్న ‘Matthew Isakowitz Fellowship Program’లో తన వంతుగా సహకారం అందిస్తోంది శిరీష. కెరీర్‌లో తాను అందుకున్న విజయాలకు గుర్తుగా 2014లో తానా (తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా) నుంచి ‘యూత్‌ స్టార్‌ అవార్డు’ను సైతం అందుకుంది.

అంతరిక్ష యానానికి వెళ్లబోతోన్న తొలి తెలుగు మహిళ శిరీషకు సోషల్‌ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు, నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. ‘క్షేమంగా వెళ్లి.. ఎన్నో మధురానుభూతులు మూటగట్టుకొని రమ్మం’టూ ఆశీర్వదిస్తున్నారు.

మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని