ఇలా చేస్తే గ్రేవీ చిక్కబడుతుంది! - these ingredients to thicken the gravy in telugu
close
Published : 17/08/2021 20:37 IST

ఇలా చేస్తే గ్రేవీ చిక్కబడుతుంది!

రెస్టరంట్‌ స్టైల్లో గ్రేవీ కూరలు తయారుచేయాలని తహతహలాడుతుంటాం. కానీ చాలామందికి అవి ఓ పట్టాన కుదరవు. పల్చగా, జారుడుగా వచ్చే సరికి ఇంత కష్టపడి కర్రీ చేసి వృథాయేనా అన్న ఫీలింగ్‌ వచ్చేస్తుంటుంది. అయితే అలాంటప్పుడు కొన్ని పదార్థాల్ని అందులో కలపడం వల్ల గ్రేవీ చిక్కబడడంతో పాటు రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యమూ సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. మరి, గ్రేవీకి చిక్కదనం అందించే ఆ పదార్థాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

టొమాటో ప్యూరీతో..!

టొమాటో ప్యూరీని ఉపయోగించి గ్రేవీ కర్రీస్‌ తయారుచేసుకోవడం మనకు తెలిసిందే! రుచి, చిక్కదనం కోసం రెస్టరంట్లలోనూ దీన్ని వాడుతుంటారు. చాలామంది చెఫ్‌లు కూడా తమ వంటకాల్లో ఈ ప్యూరీని ఉపయోగిస్తుంటారు. అయితే ఈ ప్యూరీతో పల్చగా ఉన్న గ్రేవీని చిక్కగా మార్చచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం.. పచ్చి టొమాటోలతో ప్యూరీ చేసి కూరల్లో వాడితే పచ్చి వాసన వస్తుంది. అలాకాకుండా.. ఈ పద్ధతిలో కాస్త వేయించి ప్యూరీ చేస్తే రుచి మరింతగా పెరుగుతుంది.

ఇందుకోసం.. ఒక ప్యాన్‌లో కొద్దిగా నూనె వేసి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బల్ని దోరగా వేయించాలి. ఆపై ఒక బౌల్‌ టొమాటో ముక్కల్ని వేసి.. ఓసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ పట్టుకుంటే.. రుచికరమైన టొమాటో ప్యూరీ సిద్ధం. ఇలా తయారుచేసిన ప్యూరీని ఏ కర్రీలోనైనా నేరుగా వాడేయచ్చు.

టొమాటోల్లో ఉండే లైకోపీన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. క్యాన్సర్‌ వంటి మహమ్మారుల బారిన పడకుండా రక్షిస్తుంది.

కాయగూరలతో ఇలా..!

బంగాళాదుంప, గుమ్మడి.. వంటి కాయగూరలకు కూడా గ్రేవీకి చిక్కదనం తీసుకొచ్చే గుణం ఉందంటున్నారు నిపుణులు. అయితే వాటిని నేరుగా కాకుండా.. నీటిలో బాగా ఉడికించడం వల్ల అవి గుజ్జుగా మారతాయి. కాబట్టి వాటిని మెత్తగా మ్యాష్‌ చేసి కర్రీలో కలిపేయచ్చు. ఇవే కాదు.. క్యారట్‌, క్యాలీఫ్లవర్‌.. వంటి వాటిని కూడా ఉపయోగించచ్చు. ఫలితంగా కూరలకు రుచి రావడంతో పాటు చిక్కదనం వస్తుంది.

విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్స్‌ నిండి ఉన్న ఈ ప్యూరీ సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుందంటున్నారు నిపుణులు.

ఈ పిండి మంచిది!

కూరలకు చిక్కదనం అందించడానికి చాలామంది అందులో కార్న్‌ఫ్లోర్‌, మైదా పిండి.. వంటివి కలుపుతుంటారు. అయితే వీటికంటే శెనగపిండి కలపడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు. దీంతో కూరలకు రుచీ వస్తుందంటున్నారు. ఈ క్రమంలో రెండు టేబుల్‌స్పూన్ల వేయించిన శెనగపిండిని ఒక గిన్నెలో తీసుకొని నీళ్లు పోస్తూ, ఉండలు కట్టకుండా మరీ చిక్కగా కాకుండా, మరీ జారుడుగా కాకుండా కలుపుకోవాలి. ఆపై దీన్ని ఉడుకుతున్న కూరలో వేసి బాగా కలపాలి. శెనగపిండిలో ఉండే అధిక ప్రొటీన్‌ ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. తద్వారా అటు బరువు అదుపులో ఉంచుకోవచ్చు.. ఇటు కండరాల సామర్థ్యాన్నీ పెంచుకోవచ్చు.

కోడిగుడ్లు ఎప్పుడైనా ట్రై చేశారా?

కోడిగుడ్లతో గ్రేవీకి చిక్కదనం అందించచ్చన్న విషయం బహుశా చాలామందికి తెలిసుండదు. అయితే ఈ క్రమంలో గుడ్డును నేరుగా కర్రీలో వేయడం కాకుండా.. దాన్ని ముందుగా ఒక బౌల్‌లో తీసుకొని బాగా కలపాలి. రెండు సొనలు పూర్తిగా కలిశాక.. ఉడుకుతున్న గ్రేవీలో ఈ మిశ్రమాన్ని పోయాలి. ఆ తర్వాత కూడా గుడ్డు మిశ్రమం కూరలో బాగా కలిసేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా చేస్తే కాసేపటికి గ్రేవీ చిక్కపడడం గమనించచ్చు. దీనివల్ల కూరలకు విభిన్నమైన రుచినీ అందించచ్చు. ఇక గుడ్డులో ఉండే అధిక ప్రొటీన్‌ బరువు అదుపులో ఉంచుకోవడానికి సహకరిస్తుంది. ఇది శరీరంలో మంచి కొవ్వుల్ని పెంచడంతో పాటు విటమిన్‌ ‘డి’ని శరీరానికి అందిస్తుంది.

నట్స్‌-గింజలతో..!

పనీర్‌ గ్రేవీ, కాజూ మసాలా.. వంటి కూరలు తయారుచేసేటప్పుడు జీడిపప్పు పేస్ట్‌ని ఉపయోగించడం మనకు తెలిసిందే! అయితే కూరలు చిక్కబడడానికీ దీన్ని ఉపయోగించచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని జీడిపప్పుల్ని వేయించుకొని మెత్తటి పేస్ట్‌లా చేసుకొని కర్రీలో కలుపుకోవడమే! దీనికి బదులు బాదంపప్పులు, అవిసె గింజలు, గుమ్మడి గింజల్ని సైతం వేయించుకొని పేస్ట్‌లా చేసి వాడుకోవచ్చు. ఫలితంగా కూరలకు అమోఘమైన రుచి వస్తుంది. అలాగే నట్స్‌-గింజల్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌, విటమిన్లు, ఖనిజాలు సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

వీటితో పాటు గ్రేవీ చిక్కబడడానికి వెన్న కూడా కలుపుకోవచ్చు. అయితే ఏది కలిపినా.. తక్కువ పరిమాణంలోనే వేసుకోవడం వల్ల కూర రుచి చెడిపోకుండా ఉండడంతో పాటు కావాల్సినంత చిక్కదనం వస్తుంది.

మరి, గ్రేవీ చిక్కబడడానికి మీరు ఎలాంటి చిట్కాలు పాటిస్తారో మాతో పంచుకోండి!


Advertisement


మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని