ష్.. భాగస్వామి గురించి ఈ విషయాలు చెప్పద్దు! - things not to tell your friends about your life partner in telugu
close
Updated : 15/06/2021 20:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ష్.. భాగస్వామి గురించి ఈ విషయాలు చెప్పద్దు!

ఎంత దగ్గరి స్నేహితులైనా సరే వాళ్లతో మన భాగస్వామి గురించి చర్చించకూడని కొన్ని విషయాలుంటాయి. అలా అనవసర విషయాలు చర్చించడం వల్ల మనమే వారి విలువ తగ్గించినట్లవుతాం. అసలింతకీ అలాంటి విషయాలేంటో తెలుసుకుంటే మేలు.
* ప్రతి వ్యక్తిలో ఏవో ఒక లోపాలుండటం సహజం. ఎవరితోనైనా ఎక్కువ రోజులు కలిసి ఉంటే వాటిమీద మరింత అవగాహన వస్తుంది. అలాంటివి మీ భర్తలోనూ ఉండొచ్చు. స్నేహితులతో సరదాగా జోకులు వేసుకుంటూ మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలాంటి విషయాలు బయటపెట్టకూడదు. ఆ తరువాత మనమే బాధపడాల్సి వస్తుంది.
* తనకుండే భయాలు, గతంలో చేసిన తప్పులు, ప్రేమ సంగతులు... ఇవన్నీ మీతో మీ భర్త పంచుకొని ఉండొచ్చు. అలాంటి విషయాల్ని ఎంత రహస్యంగా ఉంచితే అంతమేలు. లేదంటే అది ఆ నోటా ఈ నోటా చేరి కొత్త ఇబ్బందులు సృష్టించి మీ బంధానికే సమస్య తెచ్చిపెట్టొచ్చు.


* భార్యాభర్తలన్నాక చిన్న చిన్న మనస్పర్థలు రావడం సహజమే. కానీ ఆ కోపంలో స్నేహితులకు ఫోన్ చేసి ఆ గొడవల గురించి, దాంతో పాటే అంతకుముందున్న సమస్యల గురించీ చెప్పేస్తుంటాం. అవి తాత్కాలికమే అనీ, ఏదో ఆ సమయంలో బాధ తగ్గించుకోవడానికే అలా చేస్తున్నామని మనకు తెలుసు. కానీ ఎదుటి వాళ్లు దాన్ని అలాగే ఆలోచించకపోవచ్చు. అలాచేస్తే అనవసరంగా మీ భర్త గురించి చెడుగా ఆలోచించే అవకాశం కల్పించినవాళ్లవుతారు.
* అలాగే... ఇప్పటివరకూ మీ భాగస్వామితో చెప్పని విషయాలు మీ స్నేహితులతో కూడా చర్చించకపోవడం మేలు. ముఖ్యంగా అవి మీ భర్తకు సంబంధించినవి, ఇబ్బంది పెట్టేవి అయినప్పుడు ఈ సూత్రం అస్సలు మర్చిపోకూడదు.
* ఉద్యోగంలో మంచి పేరు సంపాదించుకోవడం, మంచి ఉద్యోగంలో స్థిరపడడం ప్రతి అబ్బాయికి ఉండే ప్రధాన లక్ష్యం. దానివల్లే ఇతరులు వాళ్లని గౌరవిస్తారు కూడా. అందుకే ఒకవేళ మీ భాగస్వామి ఉద్యోగం కోల్పోయినా, తక్కువ జీతం వస్తున్నా... ఆ విషయాలు స్నేహితులతో చర్చించకపోవడం మేలు. అలా చేస్తే మీరే స్వయంగా వాళ్ల విలువ తగ్గించిన వాళ్లవుతారు.


మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని