సొంత ఇంటి ప్లానింగ్‌లో ఇవి తప్పనిసరి..! - things to plan before building your dream home in telugu
close
Updated : 19/09/2021 18:20 IST

సొంత ఇంటి ప్లానింగ్‌లో ఇవి తప్పనిసరి..!

సామాన్యుల నుంచి ధనవంతుల వరకు సొంత ఇంటి గురించి కలలు కనని వారుండరు. ఎన్నో ఏళ్లు కష్టపడి దాచుకున్న డబ్బుకు అసలైన విలువ, మరెన్నో ఆలోచనలకు అందమైన రూపమిచ్చేలా సొంత ఇంటిని నిర్మించుకోవాలని అందరూ అనుకుంటారు. కావల్సిన డబ్బు, స్థలం సమకూరిన తర్వాత, ఇల్లు కట్టాలన్న ఆలోచన రాగానే ఆర్కిటెక్ట్‌తో మాట్లాడటానికి వెళ్తారు చాలామంది. కానీ ప్లానింగ్‌లో లోపాలు, ఆర్కిటెక్ట్‌తో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురయ్యేవారు ఎందరో. అందుకే ఆర్కిటెక్ట్‌తో మాట్లాడే ముందు కొన్ని విషయాలలో అవగాహన, స్పష్టత అవసరం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ ఇల్లు.. మీసంప్రదాయం..

చాలామంది సొంత ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన రాగానే వాస్తు పండితులను సంప్రదిస్తారు. అయితే కొన్ని సందర్భాలలో ఆర్కిటెక్ట్ లేదా బిల్డర్ సలహా మేరకు వాస్తు పండితుల సూచనలకు విరుద్ధంగా ఇంటిని నిర్మించుకోడానికి సిద్ధపడతారు. తీరా ఇంటి నిర్మాణం పూర్తయ్యాక ఏదైనా చిన్న అపశకునం కనబడినా... వాస్తు పాటించనందుకే ఇలా జరిగిందంటూ మథనపడతారు. అలా జరగకుండా ఉండాలంటే వాస్తు పట్ల మీకు మీ నమ్మకం ఎంత ముఖ్యమో ముందే ఆర్కిటెక్ట్‌కి తెలియజేయండి. అందుకు అనుగుణంగా ఇంటి నిర్మాణాన్ని చేపట్టండి. ఇందులో ఎటువంటి మొహమాటమూ అవసరం లేదు.

వాళ్ల అభిప్రాయమూ అవసరమే..

కుటుంబంలో ఎంతమంది ఉంటున్నారు, త్వరలో కొత్తగా కుటుంబంలోకి ఎంతమంది చేరే అవకాశం ఉందో లెక్కించండి. పెళ్లి చేసుకోబోయే వారు లేదా కొత్తగా పెళ్త్లె పిల్లల కోసం ఆశిస్తున్న వారు రాబోయే వారిని కూడా లెక్కించాలి. వ్యక్తిగత స్థలం విషయంలో ఇంట్లో ఉండే వారి అవసరాలను, అభిరుచులను అడిగి తెలుసుకోవాలి. ప్రత్యేకమైన కప్‌బోర్డ్, టేబుల్ కావాలన్నా, చెట్ల పెంపకం, పెయింటింగ్, ఆర్ట్ మొదలైన అభిరుచులకు ప్రత్యేకమైన స్థలం కేటాయించుకోవాలన్నా ఆ విషయాల గురించి ఆర్కిటెక్ట్‌తో ముందుగా చర్చించాలి.

ఫర్నిచర్ ఎలా..?

కొత్త ఇంటికి పూర్తిగా కొత్త ఫర్నిచర్ కొనాలని అనుకుంటున్నారా.. లేక పాత ఫర్నిచర్‌నే కొనసాగించాలనుకుంటున్నారా అన్న విషయం ఆర్కిటెక్ట్‌తో చెప్పాలి. మీ దగ్గర ఉన్న ఫర్నిచర్ సైజుని కూడా నోట్‌చేసి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఆ ఫర్నిచర్ అమర్చుకోడానికి వీలుగా ఇంటిని డిజైన్ చేసే అవకాశం ఉంటుంది.

పెంపుడు జంతువులు ఉంటే..

జంతువులను పెంచే అలవాటు ఉన్నవారు సొంత ఇంటి నిర్మాణంలో తప్పని సరిగా వాటిని దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే వాటికి ప్రత్యేకమైన చోటు ఉంచడం వల్ల ఇల్లు శుభ్రంగా ఉండడమే కాకుండా వాటి పోషణ, రక్షణ సులభమవుతాయి. ఇంటికి అతిథులు వచ్చినపుడు ఎటువంటి ఇబ్బందీ కలగదు.

ముందు జాగ్రత్త..

అల్మరాలు లెక్కించినదానికన్నా రెండు ఎక్కువగా పెట్టించడం మంచిది. భవిష్యత్తు అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లంబింగ్ వర్క్, ఎలక్ట్రిక్‌ వర్క్ ప్లాన్ చేయాలి. ఇంటి స్థలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు రకరకాల కన్‌స్ట్రక్షన్ టెక్నిక్స్, స్పేస్ సేవింగ్ టెక్నిక్స్ ఉంటాయి. వాటి గురించి తెలుసుకోండి. లేదా ఆర్కిటెక్ట్‌తో మాట్లాడండి. చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నట్టయితే యాంటీ స్కిడ్ ఫ్లోరింగ్ ఎంచుకోండి.

బడ్జెట్, డిస్కౌంట్ల గురించి...

మీ బడ్జెట్ గురించి ఆర్కిటెక్ట్‌తో చర్చించేటప్పుడు కచ్చితంగా ఉండండి. ఎందుకంటే ఒక్కోసారి చిన్నదే కదా అనుకున్న ఖర్చు నిర్మాణం పూర్తయ్యే సరికి తలకు మించిన భారమవుతుంది. చేతిలో ఉన్న ఆఖరి రూపాయి వరకూ ఖర్చు చేసి ఇల్లు కట్టాలన్న ఆలోచన మానుకోండి. అది అత్యంత ప్రమాదకరం.

అలాగే ఇంటి నిర్మాణంలో మీకు ఏదైనా మెటీరియల్ చవకగా లభించేట్టయితే ఆ విషయాన్ని ఆర్కిటెక్ట్‌తో చర్చించండి. దీనివల్ల ఇంటి ప్లాన్ వేసేటప్పుడు ఆ మెటీరియల్ విషయంలో బడ్జెట్‌కు మాత్రమే కాకుండా, అవసరాలకూ ప్రాధాన్యమిచ్చి డిజైన్ చేసేందుకు వీలుంటుంది.

మీ సొంతింటి కల నెరవేర్చుకునే ఆనందంలో ఇలాంటి ముఖ్యమైన విషయాలను నిర్లక్ష్యం చేయకండి. అవసరమైన జాగ్రత్తలను పాటించి మీ జీవిత స్వప్నాన్ని సాకారం చేసుకోండి.



మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని