అందుకే ఈ ‘సోలో’ జర్నీ! - this 73 years old chandigarh woman drives solo across india despite marriage and children responsibi
close
Updated : 12/08/2021 19:13 IST

అందుకే ఈ ‘సోలో’ జర్నీ!

(Photo: Twitter.com/@yourMA65)

‘కలలు, ఆసక్తులు నెరవేర్చుకునేందుకు వయసు అనేది ఏ మాత్రం అడ్డంకి కాదు’ అని నిరూపిస్తూ ఇటీవల ఎందరో మహిళలు తమ ప్రతిభా నైపుణ్యాలను చాటుకుంటున్నారు. ఎవరేమనుకున్నా మలి వయసులోనూ తమకు నచ్చిన పనులు చేస్తూ మన్ననలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో ‘వయసు అనేది ఓ సంఖ్య మాత్రమే’ అని సందేశాన్నిస్తూ ఏడు పదుల వయసులో దేశ పర్యటనకు బయలు దేరారు గురుదీపక్‌ కౌర్‌. అది కూడా ఒంటరిగా కారు నడుపుతూ..

73 ఏళ్ల వయసులో ‘సోలో’ ప్రయాణం!

సాధారణంగా మన దేశంలో సుదూర ప్రాంతాలకు ఒంటరిగా ప్రయాణించే మహిళలు అరుదనే చెప్పాలి. అందులోనూ వృద్ధులు ఎక్కువ దూరం ప్రయాణాలు చేయరు. అయితే చండీగఢ్‌కు చెందిన గురుదీపక్‌ కౌర్‌ మాత్రం అలా కాదు. 73 ఏళ్ల వయసున్న ఈ బామ్మకు ఒంటరిగా ప్రయాణం చేయడమంటే ఎంతో సరదా. కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లి సేద తీరడం, అక్కడి మనుషుల భాష, ఆచార వ్యవహారాల గురించి తెలుసుకోవడమంటే ఆమెకు ఎంతో ఆసక్తి.

ఈ ప్రయాణం ఇప్పటిది కాదు!

ఇలా సోలోగా సాగుతున్న ఈ బామ్మ ప్రయాణం ఇప్పుడు మొదలైంది కాదు. ‘జీవితంలో ఒంటరిగా ప్రయాణం చేయాలన్నది నా ఉద్దేశం కాదు. నాకు ఎదురైన కొన్ని పరిస్థితులే నన్ను ఈ విధంగా మార్చాయి. టీనేజ్‌లో ఉన్నప్పుడే జలంధర్‌ నుంచి చండీగఢ్‌కు స్కూటీపై ఒంటరిగా ప్రయాణం చేసేదాన్ని. ఇప్పట్లోలా ఆ సమయంలో మంచి రోడ్లు ఉండేవి కావు..మొబైల్స్‌ వాడకంలో లేవు. ఇక నాన్న ఇండియన్‌ ఆర్మీలో పనిచేస్తుండడంతో తరచు ఆయనకు బదిలీలు జరిగేవి. ఆయనకు ట్రాన్స్‌ఫర్‌ అయినప్పుడల్లా మా వస్తువులు మేమే ప్యాక్‌ చేసుకుని ప్రయాణానికి సిద్ధంగా ఉండేవాళ్లం. అలా చిన్నప్పుడే దేశంలోని చాలా రాష్ట్రాలు తిరిగేశాం. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా నా ఒంటరి ప్రయాణాలు కొనసాగాయి. మా వారు కూడా సైన్యంలోనే విధులు నిర్వర్తించేవారు. పెళ్లయిన రెండో ఏడాదిలోనే మా ఆయన బెల్గామ్‌కు బదిలీ అయ్యారు. దీంతో నా రెండు నెలల పాపను చంకన పెట్టుకుని, ఆరు పెద్ద పెద్ద పెట్టెలతో చండీగఢ్‌ నుంచి బెల్గామ్‌కి బయలుదేరాను. ఆ సమయంలో విమాన సర్వీసులు కూడా ఎక్కువగా ఉండేవి కాదు. అంతా రైళ్లలోనే ప్రయాణం. అది కూడా రోజుల తరబడి. ఒక్కోసారి రెండు, మూడు రైళ్లు కూడా మారాల్సి వచ్చేది’ అని తన అనుభవాలను గుర్తుకు తెచ్చుకున్నారీ ఓల్డ్‌ వుమన్‌.

ఇతరులపై ఆధారపడడం ఇష్టం లేదు!

గురుదీపక్‌ కౌర్‌ భర్తకు ప్రయాణాలంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదట. దీంతో ఎక్కడికెళ్లినా ఒంటరిగానే వెళ్లడం అలవాటుచేసుకున్నారామె. ఈ నేపథ్యంలో అమెరికాతో పాటు పలు దేశాల పర్యటనలకు సోలోగానే వెళ్లి వచ్చారు. ‘మా వారికి ప్రయాణాలు చేయడమంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. నాకు కూడా ప్రతి పనికి ఇతరులపై ఆధారపడడం నచ్చదు. అందుకే ఇప్పుడు కూడా ఒంటరిగానే ప్రయాణాలు చేస్తున్నాను. కొన్నేళ్ల క్రితమే ఒంటరిగా కారులో ప్రయాణించడం కూడా మొదలుపెట్టాను. ఒకసారి బెంగళూరులో ఉన్న మా ఫ్రెండ్‌ని కలవడానికి చండీగఢ్‌ నుంచి సాంత్రో కారులో బయలుదేరాను. టూర్‌లో భాగంగా మొదట దిల్లీకి వెళ్లి నా మిత్రులను కలుసుకున్నాను. ఆ తర్వాత అజ్మర్, ఉదయ్‌పూర్‌, అహ్మదాబాద్‌ మీదుగా ముంబయి వెళ్లి నా కూతురుని కలుసుకున్నాను. అక్కడే ఐదు రోజులు ఉన్నాను. ఆ తర్వాత పుణె మీదుగా బెంగళూరు చేరుకున్నాను. అలా మొత్తం 860 కిలోమీటర్లు ఒంటరిగానే ప్రయాణం చేశాను.’

కళ్లు మూసి తెరిచేలోపు చెట్టును ఢీ కొట్టింది!

ఈ సోలో ప్రయాణంలో నేనెప్పుడూ నిర్లక్ష్యంగా వ్యవహరించలేదు. అదెంత ప్రమాదమో ఒక సంఘటన ద్వారా నాకు బాగా తెలిసొచ్చింది. ఒకసారి కారులో ముంబయికి బయలుదేరాను. బాగా అలసిపోవడం, నెమ్మదిగా కళ్లు మూతపడుతుండడంతో రోడ్డు పక్కన కారు ఆపి కాసేపు కునుకు తీద్దామనుకున్నాను. పార్కింగ్‌ కోసం అనుకూల ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళ్లే లోపే కళ్లు మూసుకున్నాను. స్టీరింగ్‌పై తల వాల్చాను. అంతే...కళ్లు మూసి తెరిచేలోపు కారు నేరుగా వెళ్లి చెట్టును ఢీ కొట్టింది. దీంతో అప్పుడే కొన్న కొత్త కారు బాగా దెబ్బతింది. అదృష్టవశాత్తూ నాకు ఎలాంటి దెబ్బలు తగల్లేదు.’

ప్రపంచ యాత్ర కోసం పేపర్‌ వర్క్‌ చేస్తున్నా!

‘ఈ ప్రమాదం నన్ను కాస్త భయపెట్టినా నా సోలో ప్రయాణాన్ని మాత్రం ఆపలేకపోయింది. నా సోలో జర్నీలో భాగంగా త్వరలో తూర్పు, పశ్చిమ తీరాలను చుట్టేద్దామనుకుంటున్నాను. పశ్చిమ బెంగాల్‌ మీదుగా గుజరాత్‌తో పాటు పలు రాష్ట్రాల్లో పర్యటించేందుకు ప్రణాళికలు వేస్తున్నాను. దీంతో పాటు ప్రపంచ యాత్ర కోసం పేపర్‌ వర్క్‌ కూడా చేస్తున్నాను’..

వయసు అనేది ఓ సంఖ్య మాత్రమే!
‘ఈ ఒంటరి ప్రయాణం నాకెన్నో మధురానుభూతులను మిగిల్చింది. నాపై నాకు నమ్మకాన్ని పెంచింది. ఎక్కడికైనా వెళ్లే ధైర్యాన్ని అందించింది. ఈ సందర్భంగా మహిళలందరికీ నేను చెప్పేది ఒకటే... ‘వయసు అనేది ఓ సంఖ్య మాత్రమే’.. ఈ విషయాన్ని మన మనసులో నిక్షిప్తం చేసుకుంటే ఏదైనా సాధ్యమే. ప్రతి మహిళకు కుటుంబం, పిల్లలు తదితర బాధ్యతలుంటాయి. వీటితో పాటు అప్పుడప్పుడు మనకంటూ సొంతంగా కొంచెం సమయం కేటాయించుకోవాలి. అప్పుడే మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఇక వయసు గురించి అంటారా? అది మన చేతుల్లో లేని విషయం. దాని గురించి ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది’ అని స్ఫూర్తి నింపుతున్నారు గురుదీపక్‌.


Advertisement


మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని