ఇలా చీరకట్టుతో యూట్యూబ్ సెన్సేషన్ అయింది! - this video of a saree clad odisha woman riding a horse is crazy viral
close
Published : 10/06/2021 20:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇలా చీరకట్టుతో యూట్యూబ్ సెన్సేషన్ అయింది!

ఆమె గుర్రంపై స్వారీ చేస్తుంది... బుల్లెట్ పై రయ్.. రయ్‌ మని దూసుకెళుతుంది... ట్రాక్టర్‌తో పొలం దున్నుతుంది.. అవసరమైతే ట్రక్కు, వోల్వో బస్‌ లాంటి భారీ వాహనాలను సైతం అలవోకగా నడుపుతుంది! సరే...ఇందులో వింతేముంది? చాలామంది మహిళలు ఇలాంటి పనులు చేస్తున్నారు కదా అనుకుంటున్నారా? అయితే అందరిలా ఆమె చేసి ఉంటే ఇలా వార్తల్లో నిలిచేదే కాదు..!

‘మహిళలు చీరకట్టులో చూడడానికి ఎంతో అందంగా కనిపించినా...కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొంతమందైతే నడవడానికి సైతం ఇబ్బంది పడుతుంటారు. కానీ ఈ చీరకట్టులోనే గుర్రంపై స్వారీ చేసి యూట్యూబ్‌ సెన్సేషన్‌గా మారిపోయింది ఒడిశాలోని జాహల్‌ గ్రామానికి చెందిన మోనాలిసా భద్రా. ఒక గుర్రమే కాదు.. బైకు, ట్రక్కు, బస్సు, ట్రాక్టర్‌...ఇలా దేన్నైనా ఆమె అలవోకగా నడపగలదు. అది కూడా చీరకట్టులోనే. ఈ ప్రత్యేకతే ఆమెను నలుగురిలో ఒకరిగా నిలబెట్టింది. తన యూట్యూబ్‌ ఛానల్‌కు మిలియన్ల కొద్దీ సబ్‌స్ర్కైబర్లను తెచ్చిపెట్టింది.
చీరకట్టులో రయ్‌..రయ్‌ మంటూ!
ఎప్పుడు చూసినా సంప్రదాయ చీరకట్టులో నిండుగా కనిపిస్తుంది మోనాలిసా. ఆ చీరకట్టుతోనే ట్రాక్టర్‌ ఎక్కి పొలం దున్నుతుంది. బుల్లెట్ పై రయ్‌..రయ్‌ మని దూసుకెళుతుంది. ఇలా ఏ పనైనా చీరకట్టులోనే చేసే మోనాలిసా యూట్యూబ్‌లో పంచుకునే వీడియోలకు మంచి స్పందన వస్తోంది. తన యూట్యూబ్‌ ఛానల్‌ సబ్‌స్ర్కైబర్ల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది.  2016లో ‘బద్రి నారాయణ్‌ భద్రా’ పేరిట ప్రారంభించిన ఈ ఛానల్‌కు ప్రస్తుతం 2.28 మిలియన్ల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. 


‘మా వారు ఒక క్రియేటివ్‌ డైరెక్టర్‌. సామాజిక కార్యకర్త కూడా. ఆయనే నాకు యూట్యూబ్‌ ఛానల్‌ను పరిచయం చేశారు. అప్పటి నుంచి ఇలా వీడియోలు అప్‌లోడ్‌ చేస్తున్నాను. వాటికి మంచి స్పందన లభిస్తోంది. ఈ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా చక్కటి ఆదాయం కూడా వస్తోంది’ అని చెబుతోందీ సూపర్‌ వుమన్.
జంతు ప్రేమికురాలు కూడా!
మోనాలిసా జంతు ప్రేమికురాలు కూడా. తన ఇద్దరు పిల్లలతో కలిసి వివిధ రకాల పక్షులు, జంతువులకు ఆహారం అందిస్తూ తన భూత దయను చాటుకుంటోంది. ఈ క్రమంలో మోనాలిసా ఇల్లు ఒక చిన్నపాటి జంతుప్రదర్శన శాలను పోలి ఉంటుంది. పక్షులు, జంతువులకు ఆహారం అందించడం, గాయపడితే వైద్యం చేయడం...వాటితో సరదాగా గడుపుతున్న క్షణాలను కూడా తన యూట్యూబ్‌ ఛానల్‌లో అప్‌లోడ్‌ చేస్తోంది మోనాలిసా. వీటికి కూడా మంచి స్పందన వస్తోంది.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని