ఉబ్బిన కళ్ల నుంచి ఉపశమనం పొందండిలా! - tips can help you reduce puffy eyes in telugu
close
Published : 23/08/2021 15:50 IST

ఉబ్బిన కళ్ల నుంచి ఉపశమనం పొందండిలా!

‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అన్నట్లు మన శరీరంలో కళ్లకు ఎంతో ప్రాధాన్యముంది. అయితే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పడి చాలామంది తమ కంటి సంరక్షణను పెద్దగా పట్టించుకోవడం లేదు. కొంతమందికి కళ్ల కింద నల్లటి వలయాల్లాంటి మచ్చలు ఉంటే, మరికొంతమందికి కళ్ల కింద చర్మం ఉబ్బినట్లు కనిపిస్తుంది. సరైన నిద్రలేకపోవడం, ఎక్కువ సమయం కంప్యూటర్‌పై గడపడం, టీవీ ఎక్కువగా చూడడం, పదే పదే కాఫీ-టీలు తాగడం, ఎక్కువ ఒత్తిడి, ఆందోళనకు గురికావడం, పోషకాహార లోపం... ఇవన్నీ కంటి సమస్యలకు కారణమవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉబ్బిన కళ్లు అమ్మాయిలను అందవిహీనంగా మార్చేస్తున్నాయి. మరి, ఇలాంటి సమస్య నుంచి బయటపడే మార్గాలేంటో తెలుసుకుందామా?!

అలా ఉంటే సమస్యే!

సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే చాలామందికి కళ్లు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. అయితే చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోగానే ఉబ్బిన కళ్లు మళ్లీ మామూలుగా అయిపోతాయి. అయితే నీటితో శుభ్రపరచుకున్న తర్వాత కూడా కళ్లు ఉబ్బినట్లుగానే ఉంటే ఏదో సమస్య ఉందని అర్థం అని చెబుతున్నారు నిపుణులు. ఈక్రమంలో కొన్ని సహజ చిట్కాలు పాటించడం ద్వారా ఉబ్బిన కళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చని వారు సూచిస్తున్నారు.

ఇలా బయటపడండి!

* శరీరం డీహైడ్రేషన్‌కు గురైనా కళ్లు ఉబ్బినట్లుగా కనిపిస్తాయట! అందుకే నీళ్లు ఎక్కువగా తాగమంటున్నారు నిపుణులు.

* నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలు, పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.

* టీ, కాఫీ, కార్బొనేటెడ్‌ ఎనర్జీ డ్రింకులు, ఆల్కహాల్‌... తదితర పానీయాలను తరచుగా తీసుకోవడం వల్ల కళ్లు ఉబ్బిపోయి అందవిహీనంగా తయారవుతాయి. కాబట్టి వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిది.

* కొత్తిమీరను డైట్‌లో చేర్చుకోవడం వల్ల వేగంగా ఈ సమస్య నుంచి బయటపడచ్చు. ఎందుకంటే కొత్తిమీర మూత్ర పిండాల ద్వారా వ్యర్థ పదార్థాలు, మలినాలను వడపోసి బయటకు పంపించేస్తుంది. సలాడ్లు, సూప్స్‌లలో కొత్తిమీరను కలిపి తీసుకుంటే మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా సొంతం చేసుకోవచ్చు. ఈక్రమంలో దోసకాయ, కొత్తిమీర, టొమాటో... తదితర పదార్థాలతో తయారుచేసిన జ్యూస్‌ను తీసుకోవడం వల్ల ఉబ్బిన కళ్ల నుంచి వేగంగా ఉపశమనం పొందవచ్చు. మరి ఆ జ్యూస్‌ తయారీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు

* దోసకాయ-1

* వాము ఆకులు-2

* టొమాటో-1

* కొత్తిమీర- కొంచెం

* నిమ్మరసం- టీస్పూన్‌

తయారీ

పైన పేర్కొన్న కూరగాయలన్నింటినీ ముందుగా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అనంతరం మిక్సీలో వేసి జ్యూస్‌ లాగా తయారుచేసుకోవాలి. దీనికి నిమ్మరసాన్ని కలిపి వెంటనే తాగాలి. ఇలా కొద్ది రోజుల పాటు క్రమం తప్పకుండా తాగితే ఉబ్బిన కళ్లు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి.

ఉబ్బిన కళ్ల నుంచి ఉపశమనం పొందేందుకు ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకున్నారుగా... మరి మీకూ ఈ సమస్య ఎదురైతే ఈ చిట్కాలను పాటించండి. అయితే ఇలా చేసినా కూడా సమస్య తగ్గకపోగా.. దురద, మంట, ఎరుపెక్కడం.. లాంటి సమస్యలు ఎదురవుతుంటే మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.


Advertisement


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని