మీ పిల్లలూ ఆ విషయంలో ఒత్తిడికి గురవుతున్నారా? - tips to cope with back to school anxiety in kids in telugu
close
Published : 17/09/2021 15:55 IST

మీ పిల్లలూ ఆ విషయంలో ఒత్తిడికి గురవుతున్నారా?

గత కొంత కాలంగా ఒక జీవన విధానానికి అలవాటు పడిన మనకు అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోమంటే.. ఎంతోకొంత ఒత్తిడికి లోనవడం సహజం. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితీ ఇలాగే ఉంది. ఏడాదిన్నర కాలంగా ఆన్‌లైన్‌ క్లాసులకు అలవాటు పడిన వారు.. తిరిగి స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లాలంటే ఏదో తెలియని ఆందోళనకు గురవుతున్నారని చెబుతున్నారు చాలామంది తల్లిదండ్రులు. ఇందుకు కరోనా భయం ఒక కారణమైతే.. ‘అబ్బా మళ్లీ స్కూలా’ అన్న అసహనం మరికొందరిలో ఉంది. ఏదేమైనా వారి మనసులో ఉన్న ఈ ప్రతికూలతల్ని తొలగిస్తేనే వారు తిరిగి చదువుపై శ్రద్ధ పెట్టగలుగుతారని చెబుతున్నారు నిపుణులు. మరి, ఇందుకోసం తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసుకుందాం రండి..

కారణాలివే!

ఇంట్లో ఉండి బోర్‌గా ఫీలయ్యే పిల్లలు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లడానికే ఆసక్తి చూపుతుంటారు. అయినా కూడా ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో కొన్ని కారణాలు పిల్లల్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు. తల్లిదండ్రులు వాటిని గుర్తించి చిన్నారులకు అండగా నిలవాలంటున్నారు.

* స్కూలుకెళ్లాలన్న ఆసక్తి ఉన్నా, తమ ఫ్రెండ్స్‌ని కలుసుకోవచ్చని ఆరాటపడుతున్నా.. ప్రస్తుత కరోనా పరిస్థితులు వారి భయానికి ఓ కారణం కావచ్చు. ఈ క్రమంలో తాము సరైన జాగ్రత్తలు పాటిస్తామో, లేదో.. స్కూల్‌ వాతావరణం పరిశుభ్రంగా ఉంటుందో, లేదో.. తోటి విద్యార్థులు సరైన జాగ్రత్తలు పాటిస్తారో, లేదో.. ఇలా వారి భయాందోళనలకు కారణాలు చాలానే ఉన్నాయి.

* కరోనా పరిస్థితుల రీత్యా చాలామంది తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో వాళ్ల పిల్లల్ని కూడా అక్కడి పాఠశాలలో చేర్పించడానికి సిద్ధమయ్యారు. దీంతో పిల్లలకు స్కూల్‌ వాతావరణం, ఫ్రెండ్స్‌ అంతా కొత్తే! దీనికి అలవాటు పడే క్రమంలోనూ చిన్నారులు ఒత్తిడికి లోనవుతుంటారు.

* స్కూలుకెళ్లినా, కాలేజీకెళ్లినా, ఆఫీస్‌కెళ్లినా.. మొదటి రోజు ఎవరికైనా కాస్త నెర్వస్‌నెస్‌ ఉండడం సహజం. ‘ఇంట్లో ఉండి లావయ్యావే!’, ‘ముఖంపై ఈ మొటిమలేంటి?’.. అంటూ తోటి పిల్లలు ఆటపట్టిస్తారేమోనని వారి భయం!

* స్కూల్లో కరోనా బాధిత కుటుంబాలకు చెందిన పిల్లలు కూడా ఉండచ్చు. వాళ్ల అనుభవాలు తోటి పిల్లలతో పంచుకున్నప్పుడు భయాందోళనలకు గురవుతుంటారు. తమకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా అన్న ఊహే వారిని తీవ్ర మానసిక ఒత్తిడిలోకి నెట్టేస్తుంటుంది.

* తరగతి గదిలో పిల్లల మధ్య పదే పదే కరోనా విషయాలే చర్చకు రావడం, ఆ వార్తలో నిజమెంతో తెలుసుకోకుండా భయపడిపోవడం.. వంటివీ పిల్లల్లో అనవసరమైన ఒత్తిడికి కారణాలవుతున్నాయి.

ఇలా గుర్తించచ్చు!

అయితే ఇలా తమ మనసులోని ఆవేదనను తల్లిదండ్రులతో పంచుకోవడానికి చాలామంది చిన్నారులు ఆసక్తి చూపరు. ఎందుకంటే ఇలా చెప్తే పేరెంట్స్‌ కోపగించుకుంటారేమోనని వారి భయం. అయితే ఇలాంటప్పుడు వారి ప్రవర్తనను బట్టి వారు ఒత్తిడిలో ఉన్నట్లు గుర్తించచ్చని చెబుతున్నారు నిపుణులు.

* ఇంతకుముందెన్నడూ లేనంతగా మీతో దగ్గరగా ఉండాలనుకోవడం.. ఈ క్రమంలో వారి ప్రవర్తనలో భయం, ఆందోళన గమనించచ్చు.

* ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూ కనిపించడం.

* కడుపునొప్పి/ఇతర సాకులు చెప్పి స్కూలు మానేయడం.

* చిన్న విషయాలకే కోపగించుకోవడం/అరవడం.

* కడుపు నిండా తినకపోవడం, కంటి నిండా నిద్రపోక పోవడం.

* ప్రతి విషయాన్నీ నెగెటివ్‌గా ఆలోచించడం.. భయపడిపోవడం.

* గతంలో మాదిరిగా చదువుపై శ్రద్ధ పెట్టకపోవడం.

* చిన్న మాటలకే ఏడ్చేయడం.. ఒక్కోసారి అనవసరంగా ఏడవడం.

ఒత్తిడిని ఇలా చిత్తు చేయండి!

ఇలా వారిలోని భయాందోళనలు, భావోద్వేగాలను గమనించడమే కాదు.. వాటిని దూరం చేసే బాధ్యత కూడా తల్లిదండ్రులదే అంటున్నారు నిపుణులు. అదెలాగంటే..!

* స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే క్రమంలో వైరస్‌ గురించి భయపెట్టకుండా.. అక్కడ ఎలా జాగ్రత్తగా ఉండాలో పిల్లలకు నేర్పించాలి. తోటి విద్యార్థులకు దూరంగా కూర్చోవడం, భోజనం పంచుకోకపోవడం, నిరంతరం మాస్క్‌ పెట్టుకొనే ఉండడం, చేతులు శుభ్రం చేసుకోవడం/శానిటైజ్‌ చేసుకోవడం.. పుస్తకాలు/ఇతర వస్తువులు పిల్లలతో పంచుకోకపోవడం, స్కూల్‌ వ్యాన్‌లో తోటి పిల్లలకు దూరంగా కూర్చోవడం.. ఇవన్నీ కరోనా జాగ్రత్తలే! వీటిని తు.చ. తప్పకుండా పాటిస్తే వైరస్‌ ముప్పు చాలా వరకు తప్పుతుందని పిల్లలకు చెప్పి పంపించాలి.

* పిల్లలకు కొన్ని వ్యాపకాలు నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. తిరిగి స్కూలుకెళ్తున్నారు కాబట్టి వారిని వాటిలో చేర్పించే ప్రయత్నం చేయండి. అయితే ఈ క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకునేలా వారిని ప్రోత్సహించాలి. నిజానికి ఇలా ఇష్టపడి చేసే పని వారిలోని ప్రతికూలతల్ని తొలగించి సానుకూల దృక్పథాన్ని నింపుతుంది.

* తల్లిదండ్రులు వారి పనుల్లో ఎంత బిజీగా ఉన్నా.. సాయంత్రాలు కొంత సమయం కేటాయించడం మంచిది. ఈ క్రమంలో ఆ రోజు స్కూల్లో జరిగిన విషయాలు, చెప్పిన పాఠాల గురించి చర్చించాలి. ఇలా కూడా వారి మనసులోని మాటల్ని పసిగట్టి.. వారు ఆందోళనల నుంచి బయటపడేందుకు సహకరించచ్చు. ఇలా కుటుంబంతో గడపడం వల్ల వారూ ఒత్తిడి, ఆందోళనల్ని దూరం చేసుకొని.. ప్రశాంతతను, సంతోషాన్ని పొందుతారు.

* ఇప్పటిదాకా నాలుగ్గోడలకే పరిమితమై ఒంటరితనంతో ఉక్కిరి బిక్కిరైన చిన్నారులకు తిరిగి స్కూలుకెళ్లడం ఊరటనిచ్చే అంశం. అయితే దీంతో పాటు పేరెంట్స్‌తో ప్లే డేట్స్‌, వారాంతాల్లో కాసేపు అలా నచ్చిన ప్రదేశాలకు వెళ్లడం.. వంటివి కూడా వారిలోని ఒత్తిడిని దూరం చేస్తాయంటున్నారు నిపుణులు.

* పిల్లలకు అందించే ఆహారం కూడా వారి ఒత్తిడిని దూరం చేస్తుంది. ఈ క్రమంలో వారి ఆహారంలో కోడిగుడ్లు, చేపలు, అవిసె గింజలు, పెరుగు.. వంటివి భాగం చేయాలి. అలాగే నీళ్లు ఎక్కువగా తాగేలా వారిని ప్రోత్సహించాలి.

* మళ్లీ స్కూలుకెళ్తున్నారు కదా అని పదే పదే చదవమంటూ వారి వెంట పడడం మానుకొని.. పెయింటింగ్‌, డ్రాయింగ్‌, క్రాఫ్టింగ్‌.. ఇలా వారికి నచ్చిన అంశాలపై దృష్టి పెట్టమనండి. ఈ బిజీలో పడిపోయి ఎలాంటి ఒత్తిడీ వారి దరిచేరదు.

మరి, మీ పిల్లలు కూడా తిరిగి స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే క్రమంలో ఒత్తిడికి లోనవుతున్నారా? అయితే మీ పిల్లల విషయంలో మీరెలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మాతో పంచుకోండి!



మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని