ఈ చిట్కాలతో కళ్ల కింద నల్లటి వలయాలకు చెక్‌! - tips to get rid of dark circles
close
Updated : 14/06/2021 17:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ చిట్కాలతో కళ్ల కింద నల్లటి వలయాలకు చెక్‌!

కాలమేదైనా చాలామంది అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టే సౌందర్య సమస్యల్లో కళ్ల కింద నల్లటి వలయాలు కూడా ఒకటి. పిల్లలు.. పెద్దలు.. అనే తేడా లేకుండా ఏ వయసు వారికైనా ఈ సమస్య ఎదురు కావచ్చు. నిద్రలేమి, ఎక్కువ సమయం కంప్యూటర్‌పై గడపడం, టీవీ ఎక్కువగా చూడటం, పదేపదే కాఫీ తాగడం, ఎక్కువ ఒత్తిడికి గురికావడం, పోషకాహార లోపం.. మొదలైనవన్నీ నల్లటి వలయాలు ఏర్పడటానికి కారణాలే. మరి వీటిని తగ్గించుకునే మార్గాల్లేవా? అంటే ఉన్నాయి.. అవేంటో చూద్దామా??

చల్లటి టీ బ్యాగ్స్‌తో..
టీ బ్యాగ్స్ నల్లటి వలయాలను పోగొట్టడంలో బాగా సహాయపడతాయి. దీనికోసం పది నిమిషాల పాటు రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన టీ బ్యాగ్స్‌ను కళ్లపై ఉంచుకుని 15 నిమిషాల పాటు రిలాక్స్ అవ్వాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి.

టొమాటోతో..
టొమాటో చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాగే కంటి కింద వలయాలు తొలగించడంలోనూ దీని పాత్ర కీలకమే. అదెలాగంటే.. కొంచెం టొమాటో రసంలో కాస్త నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ నెమ్మదిగా మర్దన చేయాలి. ఇలా చేస్తే నల్లటి వలయాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. లేదా కేవలం నిమ్మరసాన్ని తీసుకుని రోజుకు రెండు సార్లు కళ్ల కింద అప్లై చేసినా ఫలితం ఉంటుంది.

ఉప్పు తక్కువగా..
ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు, ఆల్కహాల్.. వంటి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండటం మంచిది. దీనివల్ల కంటి కింద నల్లటి వలయాలు తగ్గడం మాత్రమే కాదు.. శరీరానికి విశ్రాంతి కూడా లభిస్తుంది.

కీరా లేదా ఆలుగడ్డ ముక్కలతో..
చల్లటి కీరా లేదా ఆలుగడ్డ ముక్కల్ని తీసుకుని కళ్లపై పదిహేను నుంచి ఇరవై నిమిషాలపాటు ఉంచాలి. ఇలా చేసిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసి క్రీం అప్లై చేసుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే ఈ సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. ఆలుగడ్డ పొట్టు, రసం కూడా ఈ నల్లటి వలయాలను తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
మెటల్ స్పూన్స్‌తోనూ..
రెండు మెటల్ స్పూన్లను తీసుకుని వాటిని నీళ్లలో ముంచి తీసి రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. ఉదయం మీరు తయారవడానికి పది నిమిషాల ముందు వాటిని ఫ్రిజ్‌లో నుంచి తీసుకుని కళ్లపై ఉంచుకోవాలి. స్పూన్ల చల్లదనం వల్ల నల్లటి వలయాలు తొలగిపోవడంతో పాటు చర్మం రిలాక్స్ అవుతుంది. తర్వాత మేకప్ వేసుకుంటే సరిపోతుంది.

బాదం నూనెతో..
రోజూ రాత్రి పడుకునే ముందు కాస్త బాదం నూనెను తీసుకుని కళ్ల చుట్టూ అప్లై చేసుకోవాలి. తర్వాత నెమ్మదిగా మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు తగ్గుతాయి. ఇదే పద్ధతి రోజ్ వాటర్‌తో చేసినా చక్కటి ఫలితం ఉంటుంది.
కంటిని నలపకూడదు..
కొంతమంది కళ్లను పదేపదే నలుపుతుంటారు. దీనివల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. కాబట్టి కంటిని నలపడం ద్వారా మనంతట మనమే ఈ సమస్యను కొని తెచ్చుకున్నట్లవుతుంది.

మరికొన్ని..

పైనాపిల్ రసంలో కొద్దిగా పసుపు కలుపుకొని నల్లటి వలయాలున్న చోట అప్లై చేసుకోవాలి. ఇలా చేస్తే వారం రోజుల్లో మీకే తేడా తెలిసిపోతుంది.
* పుదీనా రసం.. ఇది అన్నింటి కన్నా వేగంగా పని చేస్తుంది. రోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిగా పుదీనా రసాన్ని కళ్ల కింద రాసుకోవాలి. ఉదయం లేవగానే కడిగేసుకుంటే నల్లటి వలయాలు పోవడంతో పాటు కళ్ల అలసట కూడా మాయమవుతుంది.
* నారింజపండు రసంలో కొద్దిగా గ్లిజరిన్‌ను కలిపి కంటి చుట్టూ పూయండి. ఇది కేవలం కళ్లకే కాకుండా ముఖానికి మంచి ఫేస్ ప్యాక్‌లా కూడా ఉపయోగపడుతుంది. దీనివల్ల ముఖం లోపలి నుంచి కాంతివంతమవుతుంది.
* కాటన్ బాల్స్‌ను రోజ్ వాటర్‌లో ముంచి కంటి రెప్పలపై నెమ్మదిగా రాయండి. ఇలా చేస్తే వలయాలు పోవడంతో పాటు కంట్లోని వేడి కూడా తగ్గుతుంది.
* తాజా పండ్లు, మొలకెత్తిన గింజలు (స్ప్రౌట్స్) ఆహారంలో భాగం చేసుకోవాలి.
* విటమిన్ సి, డి, ఇ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
* కళ్ల కింద నల్లటి వలయాలు నిద్రలేమి కారణంగా ఎక్కువ వస్తాయి.. కాబట్టి రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవాలి.
* రాత్రి పడుకునే ముందు మేకప్ తీసేసి పడుకుంటున్నామా.. లేదా.. అనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఐ మేకప్ వేసుకున్నవారు పడుకునే ముందు మేకప్ తీసేయకుండా అలాగే పడుకుంటే నల్లటి వలయాల సమస్య మరింత ఎక్కువవుతుంది.

తెలిసిందిగా.. అమ్మో! కళ్ల కింద నల్లటి వలయాలా? ఎలా తగ్గుతాయి? అని అనవసరంగా బాధపడటం, భయపడడం మానేసి ఈ సింపుల్‌ చిట్కాల్ని పాటించి చూడండి.. తేడా మీకే తెలుస్తుంది.


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని